Travel India: లాంగ్ వీకెండ్ వస్తోంది.. పర్యటనకు వెళ్లాలనుకుంటున్నారా.. బెస్ట్ ప్లేసెస్ మీ కోసం..

|

Sep 14, 2023 | 12:15 PM

కొందరికి రకరకాల ప్రదేశాలను సందర్శించడం ఇష్టం.. మరికొందరికి ప్రకృతి అందాలను వీక్షించడం ఇష్టం.. అదే సమయంలో చాలా మందికి ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించడం ఇష్టం. అయితే ఇవన్నీ ఒకే చోట ఉండే ప్రాంతాలను ఎంపిక చేసుకుంటే.. పుణ్యం, ప్రసాంత,ఆనందం అన్నీ ఒకేసారి లభిస్తాయి. ఏ మాత్రం సమయం దొరికినా సెలవులు దొరికినా ఎక్కడికి వెళ్ళాలా అని చాలా మంది ఆలోచిస్తారు. ఈ నేపధ్యంలో వినాయక చవితికి లాంగ్ వీకెండ్ వస్తుంది. ఈ సమయంలో యాత్రకోసం లేదా ప్రయాణాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా తక్కువ ధరలో సందర్శించే బెస్ట్ ప్లేసెస్ మీ కోసం..

1 / 5
సెప్టెంబర్ 16 నుండి 19 వరకు లాంగ్ వీకెండ్. వినాయక చవితి కూడా కలిసి సుమారు నాలుగు రోజులు సెలవులు వచ్చాయి. ఈ లాంగ్ వీకెండ్ ను ఎంజాయ్ చేయాలనుకుంటే ప్రయాణించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవచ్చు. మూడు లేదా నాలుగు రోజుల సెలవు రోజుల్లో భారతదేశంలోని ఈ చౌకైన ప్రదేశాలను సందర్శించండి.

2 / 5
రిషికేశ్, ఉత్తరాఖండ్ రిషికేశ్ ట్రిప్ : రిషికేశ్ తక్కువ సమయంలో ఉత్తమమైన పర్యటనకు సరైన గమ్యస్థానం. ఈ ప్రదేశం సందర్శనా స్థలాలకు, అద్భుతమైన ఆహారానికి ప్రసిద్ధి చెందింది. మీరు ప్రకృతి అందాల మధ్య ప్రయాణాన్ని ఆస్వాదించాలనుకుంటే, రిషికేశ్ వెళ్లండి. చౌకగా ఇక్కడ సుందర ప్రదేశాలను సందర్శించవచ్చు. స్థానిక రవాణాను ఎంచుకోండి. అంతేకాదు తక్కువ ఖర్చుతో ఉండగలిగే అనేక ధర్మశాలలు లేదా మఠాలు ఉన్నాయి.

3 / 5
జైసల్మేర్, రాజస్థాన్ జైసల్మేర్ ట్రిప్ : చారిత్రాత్మక వారసత్వం కలిగిన రాజస్థాన్.. అడుగడుగునా అందాలే..  రాయల్ లైఫ్ కు పెట్టింది పేరు. జైసల్మేర్ మంచి సందర్శన ప్రాంతం. ఇక్కడ  రాజభవనాలు, ఎడారులు, కోటలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. జైసల్మేర్‌కు అనేక ప్రాంతాల నుంచి ట్రైన్ సదుపాయం మాత్రమే కాదు.. దగ్గర లో ఎయిర్ పోర్ట్ కూడా ఉంది. ఇక్కడ చౌకగా ఉండటానికి గదులను సులభంగా పొందవచ్చు.

4 / 5
వారణాసి, ఉత్తరప్రదేశ్. వారణాసి ట్రిప్ : ఆధ్యాత్మిక యాత్రకు ప్రసిద్ద నగరం వారణాసి. అతి పురాతనమైన నగరాల్లో ఒకటి. ఈ నగరంలో అనేక దేవాలయాలు, పర్యాటక ప్రాంతాలను చౌకగా   సందర్శించవచ్చు. గంగా నది ఒడ్డున ఠీవిగా కోలువదీరిన శైవ క్షేత్రం అడుగడునా సందర్శనీయ స్థలమే.

5 / 5
పుష్కర్, రాజస్థాన్ పుష్కర యాత్ర : రాజస్థాన్ సంస్కృతి, ఆహారానికి ప్రసిద్ధి. ఇక్కడ అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి, వాటిలో ఒకటి పుష్కర్. ఈ ప్రదేశం చుట్టూ సరస్సులు, తీర్థయాత్రలు, అనేక ఆకర్షణీయమైన గమ్యస్థానాలు ఉన్నాయి