ఆ ఆలయానికి వెళ్లాలంటే భయమే.. భక్తులను హెడలెత్తిస్తున్న కోతులు..

Edited By:

Updated on: Nov 14, 2026 | 3:21 PM

కార్తీక మాసం సందర్భంగా ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు.. మరోవైపు వానరసేనలు కూడా అదే స్థాయిలో ఆలయాలను చుట్టుముట్టి భక్తులను హడలెత్తిస్తున్నాయి.. భక్తులపై పడి రక్కీ గాయపరుస్తున్నాయి.. కోతులను తరమడం కోసం అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులు లాఠీలు ఎత్తక తప్పడం లేదు.. తాజాగా కురవి వీరభద్రస్వామి ఆలయం ఆవరణలో కోతులు భక్తులపై దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది.

1 / 5
వానర సేనులకు అడవుల్లో ఆహారం, నీళ్లు కరువయ్యాయి వానరాల్ని ఇప్పుడు ఊళ్ళపై పడి హడలెత్తిస్తున్నాయి.. ఇళ్లలోకి చేరబడి కిష్కిందకాండ చేస్తున్నాయి.. గుళ్లను టార్గెట్ చేసి భక్తులపై దాడులకు పాల్పడుతున్నాయి.. భక్తుల చేతిలో కనిపడ్డ ప్రసాదాలు, కొబ్బరి ముక్కలు లాక్కెళ్లి హడలెత్తిస్తున్నాయి

2 / 5
ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయంలో కోతుల స్వైర విహారం కొనసాగుతుంది.. వందలాది కోతులు ఈ ఆలయాన్ని చుట్టుముట్టి భక్తులను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి.. స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులను పరుగులు పెట్టిస్తున్నాయి

3 / 5
తాజాగా స్వామివారి దర్శనం కోసం వచ్చిన వ్యక్తిపై కోతులు దాడులకు పాల్పడ్డాయి.. దీంతో అక్కడున్న భక్తులు ఒక్కసారిగా కేకలు వేస్తూ పరుగులు పెట్టారు.. వెంటనే అప్రమత్తమైన ఆలయ సిబ్బంది ఆ కోతులను తరిమే ప్రయత్నం చేశారు

4 / 5
వానర సేనలను తరమడం  కోసం అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది ఆలయ సిబ్బంది లాఠీలు ఎత్తక తప్పడం లేదు.. లాఠీలతో ఆ కోతులను తరిమి భక్తులకు భరోసా నింపే ప్రయత్నం చేశారు. లాఠీలు పట్టుకుని వానర సేనలను తరమాల్సిన పరిస్థితి ఏర్పడింది.

5 / 5
 ఆలయం ఆవరణలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది, గాడ్స్ కోతను తరమడం కోసం ప్రత్యేకంగా కర్రలు, అప్పుడప్పుడు టపాసులు కూడా పేల్చాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us