Gas Safety Tips: గ్యాస్ లీక్ అయితే ఏం చేయాలి? కంగారు పడకుండా ముందు ఈ పని చేయండి..!

Updated on: Mar 26, 2026 | 11:40 AM

LPG Gas Safety Tips: గ్యాస్‌ సిలిండర్ లీకేజీ అనేగానే చాలా మందిలో భయం పుట్టుకొస్తుంది. ఆ సమమయంలో ఏం చేయలో అర్థం కాదు. పొరపాటున గ్యాస్‌ లీక్‌ అయ్యిందంటే ఎలాంటి కంగారు పడకుండా కొన్ని సేఫ్టి టిప్స్‌ పాటిస్తే ప్రమాదం ఉండదని చెబుతున్నారు నిపుణులు. మరి ఎవరైనా ఇంట్లో గ్యాస్‌ లీకేజీ అయ్యిందంటే ఎలాంటి చర్యలు చేపట్టాలో పూర్తి వివరాలు తెలుసుకుందాం..

1 / 5
 LPG Gas Safety Tips: ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ ఉందంటే ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో అక్కడక్కడ గ్యాస్‌ సిలిండర్‌ పేలుడు, లీకేజీ లాంటి సంఘటనలు చూస్తూనే ఉన్నాము. ఈ గ్యాస్‌ సిలిండర్‌ లీకేజీ వల్ల పెద్ద ప్రమాదం సంభవించవచ్చు. అందుకే జాగ్రత్తలు చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు. అయితే గ్యాస్‌ సిలిండర్ లీకేజీ అనేగానే చాలా మందిలో భయం పుట్టుకొస్తుంది. ఆ సమమయంలో ఏం చేయలో అర్థం కాదు. పొరపాటున గ్యాస్‌ లీక్‌ అయ్యిందంటే ఎలాంటి కంగారు పడకుండా కొన్ని సేఫ్టి టిప్స్‌ పాటిస్తే ప్రమాదం ఉండదని చెబుతున్నారు నిపుణులు. మరి ఎవరైనా ఇంట్లో గ్యాస్‌ లీకేజీ అయ్యిందంటే ఎలాంటి చర్యలు చేపట్టాలో పూర్తి వివరాలు తెలుసుకుందాం..

2 / 5
 1. సిలిండర్ కనెక్షన్ సమయంలో జాగ్రత్తలు: సీల్ తనిఖీ: సిలిండర్ డెలివరీ తీసుకునేటప్పుడు కంపెనీ సీల్ సరిగ్గా ఉందో లేదో చూడాలి. అలాగే లీకేజ్ చెక్ తప్పనిసరి. కొత్త సిలిండర్ పెట్టినప్పుడు రెగ్యులేటర్ ఆన్ చేసి, సబ్బు నీటితో (Soap solution) లీకేజ్ ఉందేమో పరీక్షించండి. బుడగలు వస్తే లీక్ ఉన్నట్లు అర్థం. అగ్గిపెట్టెతో ఎప్పుడూ పరీక్షించవద్దు. అలాగే ఇంకో విషయం ఏంటంటే గ్యాస్ పైపు (Suraksha Hose) పై ISI మార్క్ ఉండాలి. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి పైపును తప్పనిసరిగా మార్చాలి.

3 / 5
 2. వంట చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు: గాలి వెలుతురు తప్పనిసరి. వంటగదిలో కిటికీలు తెరిచి ఉంచాలి. దీనివల్ల పొరపాటున గ్యాస్ లీక్ అయినా అది బయటకు వెళ్ళిపోతుంది. స్టౌ మీద పాలు లేదా ఇతర పదార్థాలు పెట్టి మర్చిపోవద్దు. స్టౌవ్‌ దగ్గరే ఉండండి. అవి పొంగి పొర్లి మంట ఆరిపోతే, గ్యాస్ లీక్ అయ్యే ప్రమాదం ఉంది. అలాగే వంట చేసేటప్పుడు సింథటిక్ లేదా నైలాన్ దుస్తులు ధరించవద్దు. కాటన్ దుస్తులు మాత్రమే ధరించడం సురక్షితమని నిపుణులు సూచిస్తున్నారు.

4 / 5
 3. రాత్రి వేళల్లో, బయటకు వెళ్లేటప్పుడు: మీరు రాత్రి వేళల్లో, అలాగే బయటకు వెళ్లెటప్పుడు బయటకు వెళ్తున్నట్లయితే రెగ్యులేటర్ ఆఫ్ చేయండి. రాత్రి పడుకునే ముందు, ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు సిలిండర్ దగ్గర ఉన్న మెయిన్ రెగ్యులేటర్ నాబ్‌ను తప్పనిసరిగా ఆఫ్ చేయాలి. అలాగే ఖాళీ సిలిండర్లను కూడా రెగ్యులేటర్ క్యాప్ పెట్టి సురక్షితమైన, గాలి ఆడే ప్రదేశంలో ఉంచాలి.

5 / 5
 4. గ్యాస్ లీక్ అయితే ఏం చేయాలి?: ప్రమాదవశాత్తు గ్యాస్‌ లీక్‌ అవుతున్నట్లయితే ముందుగా కంగారు పడకండి. వెంటనే రెగ్యులేటర్ ఆఫ్ చేయండి. ఇంట్లో ఉన్న విద్యుత్‌ స్విచ్‌లు ముట్టుకోవద్దు. గదిలో ఎలక్ట్రిక్ స్విచ్‌లు ఆన్ చేయడం లేదా ఆఫ్ చేయడం అస్సలు చేయవద్దు. చిన్న స్పార్క్ వచ్చినా పేలుడు సంభవించవచ్చు. వెంటనే ఇంటి తలుపులు తెరవండి. తలుపులు, కిటికీలు అన్నీ వెంటనే తెరిచి ఉంచండి. అలాగే గ్యాస్‌ లీక్‌ అవుతున్నట్లయితే వెంటనే మీ గ్యాస్ ఏజెన్సీకి లేదా 1906 అనే గ్యాస్ లీకేజ్ హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేయండి. ముఖ్య గమనిక: గ్యాస్ సిలిండర్‌ను ఎప్పుడూ పడుకోబెట్టకూడదు (Horizontal). ఎప్పుడూ నిలువుగానే (Vertical) ఉంచాలి.

Follow Us