
వినాయక చవితి సందర్భంగా ప్రతిష్ఠించే మహాగణపతికి సమర్పించే మహా లడ్డూ ప్రసాదం తయారీ కార్యక్రమానికి తాపేశ్వరం గ్రామ ఆవరణలో ప్రత్యేకంగా 10 కేజీలు మొదలుకొని 100 కేజీల వరకు ఇక్కడ నుంచి రాష్ట్రం నలుమూలకు మహా గణనాథుడి లడ్డూలు వెళుతుంటాయి. వినాయక చవితి సందర్భంగా వినాయక లడ్డూలను ఎలా తయారు చేస్తారు మేకింగ్ ఎలా ఉంటుంది.

ఒక పది కేజీలు లడ్డు తయారు చేయాలంటే ఎంతమంది వంట మేస్త్రులు ఉండాలి. మండపాల్లో పెట్టే లడ్డు ప్రత్యేకత ఏంటి..ప్రతి ఏడాది ఆనవాయితీగా కొనసాగుతున్న సంప్రదాయంలో భాగంగా తాపేశ్వరం పరిసరాల్లో ఉన్న ఏ స్వీట్ షాపు చూసినా గణనాథుడు లడ్డూలతో కలకలాడుతుంటాయి.

ప్రతి గణనాథుని మండపాలకు తాపేశ్వరం నుండి పెద్ద ఎత్తున లడ్డూలు. టన్నులు కొద్ది వెళ్తుంటాయి ముఖ్యంగా సురుచి సంస్థకు చెందిన మిఠాయి షాపు నుండి పెద్ద ఎత్తున తెలంగాణకు కూడా భారీ లడ్డులు తరలి వెళుతుంటాయి.

భక్తిశ్రద్ధలతో మాలధారణ కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం మహాగణపతికి సమర్పించే మహా లడ్డూ ప్రసాదం తయారీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. సురిచి అంటే తెలియని వారు ఎవరు ఉండరు గతంలో ఖైరతాబాద్ గణనాథుడికి ఆరు టన్నుల భారీ లడ్డూను పంపించిన ఘనత ఈ స్వీట్ షాప్ ది.

మరి ఇక్కడ తయారయ్యే లడ్డూల గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు తాపేశ్వరం అడిగి పెడితే చాలు నెయ్యి సువాసనలతో గణనాథుడు లడ్డూలు మనకు స్వాగతం పలుకుతాయి.