HBD Lewis Hamilton: బాల్యమంతా వర్ణ వివిక్ష, వేధింపులే.. పట్టుదలతో ఎదిగి.. ప్రపంచ రికార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా మారాడు..!

|

Jan 07, 2022 | 10:01 AM

ఎఫ్1 రేసులో లూయిస్ హామిల్టన్ ఎన్నో ప్రపంచ రికార్డులు సృష్టించాడు. అతను రేసింగ్ ప్రపంచంలో అతిపెద్ద సూపర్ స్టార్‌గా మారాడు.

1 / 5
F1 డ్రైవర్ లూయిస్ హామిల్టన్ కార్ రేసింగ్ ప్రపంచంలో అతిపెద్ద సూపర్ స్టార్‌లలో ఒకరిగా పేరుగాంచిన సంగతి తెలసిందే. బ్రిటన్‌కు చెందిన ఈ ఆటగాడు తన చిన్నతనంలో నల్లగా ఉన్న కారణంగా వివక్ష, వేధింపులకు గురయ్యాడు. కానీ, ఇప్పటికీ అతను ప్రపంచంలోనే అత్యంత ఇష్టపడే క్రీడా వ్యక్తిగా నిలిచాడు. జనవరి 7, శుక్రవారంతో హామిల్టన్ 37వ ఏట అడుగుపెడుతున్నాడు.

2 / 5
హామిల్టన్ 1985లో జన్మించాడు. అతని తండ్రి నల్లజాతి,  తల్లి బ్రిటన్‌కు చెందిన తెల్లజాతి మహిళ. అతనికి రెండేళ్ల వయసులో తల్లిదండ్రులు విడిపోయారు. అతను 5 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు, అతని తండ్రి రిమోట్ కంట్రోల్ కారుని కొనిచ్చాడు. బ్రిటిష్ రేడియో కార్ అసోసియేషన్ ఛాంపియన్‌షిప్‌లో రెండవ స్థానంలో నిలిచాడు. అయితే, ఈ సమయంలో అతను రంగు కారణంగా వివక్షను ఎదుర్కోవలసి వచ్చింది. కొడుకును డ్రైవర్‌ని చేసేందుకు లూయిస్ తండ్రి ఏకంగా నాలుగు పనులు చేసేవాడు.

3 / 5
హామిల్టన్ క్యాథలిక్ స్కూల్‌లో చదివాడు. ఇక్కడ అతను చాలా వేధింపులకు గురయ్యాడు. దాని కారణంగా అతను తనను తాను రక్షించుకోవడానికి ఐదు సంవత్సరాల వయస్సులో కరాటే నేర్చుకోవడం ప్రారంభించాడు. అతను పాఠశాలలో ఫుట్‌బాల్, క్రికెట్ ఆడేవాడు. F1 డ్రైవర్‌గా మారకపోతే, అతను ఫుట్‌బాల్ ఆటగాడు లేదా క్రికెటర్‌గా మారేవాడినని హామిల్టన్ చెప్పేవాడు.

4 / 5
1998లో మెక్‌లారెన్ యంగ్ డ్రైవర్ ప్రోగ్రామ్‌లో చేరారు. 2007 సంవత్సరంలో, లూయిస్ మొదటిసారిగా ఈ రేసులో పాల్గొని అనేక రికార్డులను కూడా నెలకొల్పాడు. దీని తర్వాత అతను మరుసటి సంవత్సరం టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఆ సమయంలో ఫార్ములా వన్ టైటిల్‌ను గెలుచుకున్న అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు. నాలుగు సంవత్సరాల తర్వాత అతను మెర్సిడెస్‌లో చేరాడు. ఇక్కడే అతని కెరీర్ కొత్త రూపాన్ని సంతరించుకుంది. దీంతో అతనో సూపర్ స్టార్‌గా మారాడు.

5 / 5
ఎఫ్1 టైటిల్‌ను అత్యధికంగా 7 సార్లు గెలుచుకున్న ఆటగాడిగా హామిల్టన్ పలు రికార్డులు నెలకొల్పాడు. ఈ విషయంలో దిగ్గజ ఆటగాడు మైఖేల్ షూమాకర్‌ను సమం చేశాడు. ఇది కాకుండా, అతను అత్యధిక విజయాలు (103), పోల్ పొజిషన్లు (103), పోడియం ముగింపులు (182) సాధించిన ఆటగాడిగాను నిలిచాడు.