
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఉద్యోగ జీవితం ప్రశాంతంగా, సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆదాయం కొద్దిగా వృద్ధి చెందుతుంది. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. అనారోగ్య సమస్యల నుంచి కొద్దిగా ఉపశమనం పొందుతారు. తలపెట్టిన ప్రతి పనినీ సకాలంలో పూర్తి చేస్తారు. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో సరైన నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు. కుటుంబ ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. ఇంటా బయటా మాటకు విలువ పెరుగుతుంది. మిత్రులతో విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు. తండ్రి వైపు నుంచి ఆశించిన సహాయం లభిస్తుంది. పిల్లలు చదువుల్లో ఉత్తమ ఫలితాలు గడిస్తారు. నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. పెళ్లి ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఈ రాశివారికి ఈ వారం బాగా అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులను మీ పనితీరుతో ఆకట్టుకుంటారు. వ్యాపారాలు బాగా లాభసాటిగా పురోగమిస్తాయి. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు కొద్ది శ్రమతో చక్కబడతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న ఒకటి రెండు వ్యక్తి గత, కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. సమాజంలో మంచి గుర్తింపుతో పాటు కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో విహార యాత్ర చేసే అవకాశం ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా మంచి ఆఫర్లు అందే సూచనలు న్నాయి. రియల్ ఎస్టేట్ వారికి బాగా లాభాలు అందుతాయి. ఆశించిన శుభవార్తలు వింటారు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఉద్యోగ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఉద్యోగులు మరింత మంచి ఉద్యోగంలోకి మారే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా అనుకూల ఫలి తాలనిస్తుంది. ముఖ్యంగా గృహ, వాహన ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆదాయానికి లోటుండకపోవచ్చు. తలపెట్టిన ప్రతి పని నెరవేరుతుంది. పిల్లలు చదువులో పురోగతి సాధిస్తారు. జీవిత భాగస్వామితో ఇష్టమైన పుణ్య క్షేత్రాన్ని సందర్శిస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు చిన్న ప్రయత్నంతో సొంత ఊర్లో మంచి ఉద్యోగం లభిస్తుంది. స్వల్ప అనారోగ్యాలు ఇబ్బంది పెడతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలకు సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): శుభ గ్రహాల అనుకూల సంచారం వల్ల కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. దాదాపు అన్ని రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగుతుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపో తాయి. ఉద్యోగంలో ప్రాభవం పెరుగుతుంది. అధికారుల సహాయ సహకారాలుంటాయి. బాకీలు, బకాయిలు వసూలవుతాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. ఆకస్మిక ధనలాభం ఉంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఈ రాశివారికి ఈ వారం చాలావరకు మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఆర్థిక పరిస్థితి కొద్దిగా అనుకూలంగానే ఉన్నప్పటికీ, ఉచిత సహాయాలను, దాన ధర్మాలను తగ్గించుకోవడం మంచిది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల ఇబ్బంది పడతారు. ముఖ్యమైన వ్యవ హారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఉంటుంది. వ్యాపారపరంగా కొంత అను కూల వాతావరణం ఉంటుంది. బంధుమిత్రులతో అపార్థాలు తలెత్తకుండా చూసుకోవాలి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. కుటుంబ జీవితం సుఖసంతోషాలతో సాగుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. షేర్లు లాభిస్తాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో ఆచి తూచి అడుగువేయడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో అనుభవజ్ఞుల సలహాలు కూడా తీసుకోవలసిన అవసరం ఉంది. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా, ప్రోత్సాహక రంగా సాగుతాయి. వృథా ఖర్చుల విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరగడం వల్ల కొద్దిగా విశ్రాంతి లోపిస్తుంది. గతంలో మీ నుంచి ఆర్థిక సహాయం పొందినవారు ముఖం చాటేయడం జరుగుతుంది. ఆస్తి వివాదాల్లో అనుకోని అడ్డంకులు ఎదురవుతాయి. దీర్ఘకాలిక రుణాల విషయంలో కొద్దిగా ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. బంధుమిత్రులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. దాంపత్య జీవితం హ్యాపీగా సాగిపోతుంది. పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): గురు, శుక్ర గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల ఈ వారం రాజపూజ్యాలు కలుగుతాయి. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థికంగా శుభ యోగాలు అనుభవానికి వస్తాయి. పెండింగ్ పనులు, వ్యవహారాలన్నీ సునాయాసంగా పూర్త వుతాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. అనారోగ్యం నుంచి చాలావరకు ఉపశమనం లభి స్తుంది. జీవిత భాగస్వామితో వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వ్యవహారాల్లో లాభాలు పొందుతారు. పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. మిత్రులు సహాయ సహకారాలు అందిస్తారు. కుటుంబంలో సామరస్య వాతావరణం ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్ది శ్రమతో అధిక లాభాలు పొందుతారు. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగుతుంది. నిరుద్యోగులు శుభవార్తవింటారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ఈ రాశివారికి ఈ వారమంతా చాలావరకు అనుకూలంగా గడిచిపోతుంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ తక్కువ లాభం ఎక్కువగా ఉంటుంది. కొద్ది ప్రయత్నంత ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. అనుకోకుండా అదృష్టం కలిసి వస్తుంది. ముఖ్యమైన వ్యవహా రాలు, పనులు పూర్తవుతాయి. ఇంటా బయటా చాలావరకు అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన దాని కంటే ఎక్కువ రాబడి ఉంటుంది. కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. కుటుంబంలో శుభ కార్యం జరిగే సూచనలున్నాయి. ఉన్నత స్థాయి వ్యక్తు లతో పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. విద్యా ర్థులు ఉత్తమ ఫలితాలు పొందుతారు. బంధువర్గంలో ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ఈ రాశివారికి శుక్ర, బుధ గ్రహాల అనుకూలత వల్ల ఏ రంగంలో ఉన్నా ఆశించిన పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలకు మించి పెరుగుతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు, పనుల్లో బంధుమిత్రుల నుంచి సహాయం లభిస్తుంది. ఆస్తి వివాదాల్లో రాజీ మార్గాలను అనుసరిస్తారు. దాయాదులతో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. సమాజంలో పలుకుబడి మరింతగా విస్తరిస్తుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగులు శ్రమకు తగ్గ ప్రతిఫలం అందుకుంటారు. విద్యా ర్థులు పోటీ పరీక్షల్లో ఆశించిన ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఆర్థిక విషయాల్లో మాట ఇవ్వడం మంచిది కాదు. జీవిత భాగస్వామికి ఊహించని అదృష్టం పడుతుంది. ఆరోగ్యం మెరుగ్గాఉంటుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఈ వారం వ్యక్తిగత జీవితంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ జీవి తం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపా రాల్లో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో కాస్తంత అప్రమ త్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రయాణాలు ఇబ్బంది కలిగిస్తాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో వైద్యులను సంప్రదించాల్సి వస్తుంది. ఇంటా బయటా ఒత్తిడి పెరుగుతుంది. నిరుద్యో గుల ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కానీ, ఒక పట్టాన చేతిలో డబ్బు నిలవదు. వారాంతంలో మొండి బాకీలు వసూలవుతాయి. రాజకీయ వర్గాలతో పరిచయాలు పెరుగుతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): సమస్యల ఒత్తిడి ఉన్నప్పటికీ మొత్తం మీద వారమంతా హ్యాపీగానే సాగిపోతుంది. ఉద్యోగంలో సహోద్యోగుల నుంచి సహకారం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి నిలకడగా సాగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఇల్లు కొనుగోలు ప్రయత్నాలు చాలా వరకు సానుకూలపడతాయి. తోబుట్టువులతో ఆస్తి వివాదం తలెత్తే అవకాశం ఉంది. బంధువు లతో మాట పట్టింపులు రాకుండా జాగ్రత్తపడాలి. జీవిత భాగస్వామితో ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థులకు, ఉద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆర్థికంగా కొందరు బంధుమిత్రులకు మాట ఇవ్వకపోవడం మంచిది. నిరుద్యోగులకు సానుకూల సమాచారం అందుతుంది. సమాజంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఆశాజనకంగా, ప్రోత్సాహకరంగా సాగిపోతాయి. ఉద్యోగులకు కొత్త అవ కాశాలు లభిస్తాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. ఆర్థికంగా ఆశించిన దాని కంటే ఎక్కువగా పురోగతి సాధిస్తారు. భారీగా వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. బంధువుల నుంచి శుభ కార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. సోదర వర్గంతో ఆస్తి వివాదానికి సంబంధించి రాజీ మార్గం అనుసరిస్తారు. నిరుద్యో గులకు సొంత ఊర్లో ఆశించిన ఆఫర్లు అందుతాయి. పిల్లల చదువుల విషయంలో సానుకూల సమాచారం అందుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి దైవ కార్యాల్లో పాల్గొంటారు. పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు అందుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు.