Weekly Horoscope: ఈ రాశుల వారికి ఆర్థికంగా ఊరట.. మీ రాశికి ఎలా ఉందంటే..?

Edited By:

Updated on: Oct 03, 2026 | 5:47 PM

వార ఫలాలు (అక్టోబర్ 4-10, 2026): మేష రాశి వారికి ఈ వారమంతా చాలావరకు సంతృప్తికరంగా, సుఖ సంతోషాలతో గడిచిపోతుంది. ఆర్థిక విషయాలకు సమయం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలోనూ, ఆర్థికంగానూ ఆశించిన స్థిరత్వం లభిస్తుంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా, ఎటువంటి పని ప్రారంభించినా తప్పకుండా విజయవంతం అవుతుంది. మిథున రాశి వారికి ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగుపడుతుంది. ఆర్థిక సమస్యల నుంచి, ఒత్తిళ్ల నుంచి క్రమంగా విముక్తి లభిస్తుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..?

1 / 12
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): సప్తమంలో బుధ, శుక్రుల బలం వల్ల వారమంతా చాలావరకు సంతృప్తికరంగా, సుఖ సంతోషాలతో గడిచిపోతుంది. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. ప్రయత్నాలన్నీ నెరవేరుతాయి. ఆర్థిక విషయాలకు సమయం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన ప్రయత్నాలు, కార్యక్రమాలు కలిసి వస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన స్థాయిలో సంపాదన పెరుగుతుంది. మిత్రుల మీదా, విలాసాల మీదా ఎక్కువగా ఖర్చు చేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో మాట చెలామణీ అవుతుంది. వ్యాపారాలు లాభదాయకంగా పురోగమిస్తాయి. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. దాంపత్య జీవితంలో సాను కూలత ఏర్పడుతుంది.   వాగ్దానాలు చేయకపోవడం, హామీలు ఉండకపోవడం ఎంతో శ్రేయస్కరం.

2 / 12
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): శుభ గ్రహాలతో పాటు శనీశ్వరుడు కూడా బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఉద్యోగంలోనూ, ఆర్థి కంగానూ ఆశించిన స్థిరత్వం లభిస్తుంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా, ఎటువంటి పని ప్రారం భించినా తప్పకుండా విజయవంతం అవుతుంది. ఆర్థిక విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండడం మంచిది. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్ వంటి విషయాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. వృత్తి, వ్యాపారాల్లో శత్రువులు, పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు అదుపులో ఉంటాయి. సమాజంలో ప్రముఖులతో లాభదాయక పరిచ యాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

3 / 12
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): శుభ గ్రహాల సంచారం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగుపడుతుంది. ఆర్థిక సమస్యల నుంచి, ఒత్తిళ్ల నుంచి క్రమంగా విముక్తి లభిస్తుంది. ఆదాయం బాగా పెరగడం, ఆర్థిక ప్రయత్నాలు కలిసి రావడం, ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాలనివ్వడం వంటివి జరిగే అవకాశం ఉంది. రాదనుకున్న డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. ఆస్తి వివాదంలో తోబుట్టువుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగం బాగా సానుకూలంగా  సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగానే పెరుగుతాయి. ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. మిత్రుల వివాదాల్లో మధ్య వర్తిగా వ్యవహరించే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

4 / 12
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): వారమంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. గ్రహ బలం బాగా అనుకూలంగా ఉంది. అష్టమ రాహువు ప్రభావం వల్ల అనవసర ఖర్చులు, ధన నష్టాలు ఎక్కువగా ఉంటాయి. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను, పెండింగ్ పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల మీద ఖర్చు పెరుగుతుంది. అనుకోకుండా ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు సమసిపోతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభదాయక పరిస్థితులు నెలకొం టాయి. ఉద్యోగంలో అధికారుల  తోడ్పాటు ఉంటుంది. ఆహార, విహారాల్లో తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలి. చిన్ననాటి మిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. జీవిత భాగస్వామి వృత్తి, ఉద్యో గాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. ఒకటి రెండు శుభ పరిణామాలు సంభవిస్తాయి.

5 / 12
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): వృత్తి, ఉద్యోగాలపరంగా ఆశించిన శుభవార్తలు వింటారు. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. గ్రహ బలం మిశ్రమంగా ఉన్నందువల్ల కొద్దిగా ఆరోగ్య సమస్యలు, ఇంటా బయటా ఒత్తిడి, వ్యయ ప్రయాసలు ఉండే అవకాశముంది. అయితే, ఏ రంగానికి చెందిన వారైనప్పటికీ ఎక్కువగా సానుకూల ఫలితాలు అనుభవానికి వస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతికి లేదా హోదా పెరగడానికి అవకాశముంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలతో పాటు కుటుంబ వ్యవహారాలను కూడా సంతృప్తికరంగా చక్కబెడతారు. వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద శ్రద్ధ పెట్టడం మంచిది.  ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది.

6 / 12
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): వారమంతా చాలావరకు అనుకూలంగా గడిచిపోతుంది. ముఖ్యమైన పనులన్నీ సంతృప్తికరంగా పూర్తవుతాయి. శని, రవుల ప్రతికూలత వల్ల కుటుంబంలో కొన్ని ఒడిదుడుకులు తప్పకపోవచ్చు. ముఖ్యమైన వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు. ఒకటి రెండు ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు అనుకోకుండా పరిష్కారం అవుతాయి. అతి తక్కువ శ్రమతో అతి ఎక్కువ ఫలితం పొందుతారు. ఉద్యోగ బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. కుటుంబంలో సుఖ సంతో షాలు వెల్లివిరుస్తాయి. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. బంధువుల్లో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రయాణాల్లో కొద్దిగా ఇబ్బంది పడతారు.

7 / 12
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఈ వారమంతా చాలావరకు హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆర్థిక సమస్యలు కొంత మేరకు పరిష్కారమవుతాయి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. పెళ్లి ప్రయత్నాల్లో బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన ఆర్థిక లాభాలు పొందుతారు. ఉన్నతస్థాయి వ్యక్తులు పరిచయం అవుతారు. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను మిత్రుల సహాయంతో పూర్తి చేస్తారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది.

8 / 12
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ఈ రాశికి శుభ గ్రహాల అనుకూలత కాస్తంత తక్కువగా ఉన్నందువల్ల అటు ఉద్యోగాల్లోనూ, ఇటు కుటుంబంలోనూ చిన్నా చితకా సమస్యలు ఉండే అవకాశం ఉంది. సుఖ సంతోషాలు, మన శ్శాంతి కొద్దిగా తగ్గుతాయి. ఆర్థిక వ్యవహారాలు కాస్తంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. గురు, కుజులు అనుకూలంగా ఉన్నందువల్ల శుభ వార్తలు వినడం, అనుకోకుండా ఒక శుభ పరిణామం కూడా చోటు చేసుకోవడం వంటివి జరుగుతాయి. ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. కానీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఆశించిన స్థిరత్వం లభిస్తుంది. వృత్తి జీవితం బాగా బిజీగా సాగుతుంది. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది. వ్యక్తిగత సమస్యలు కొద్దిగా టెన్షన్లు పెడతాయి. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి.

9 / 12
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): గ్రహ బలం చాలావరకు అనుకూలంగా ఉన్నందువల్ల వారమంతా సంతృప్తికరంగా గడిచిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో గౌరవమర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కొద్దిగా ఖర్చులు కూడా పెరిగే అవకాశముంది. ముఖ్యమైన వ్యవహారాల్లో మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి ఆశించిన శుభ వార్త అందుతుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారమయ్యే అవకాశముంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మంచి ఉద్యోగంలోకి మారే సూచనలు కనిపిస్తు న్నాయి. మిత్రులతో విభేదాలు తలెత్తుతాయి. ఆర్థిక విషయాల్లో బంధువులు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. ఎవరికీ హామీలు ఉండకపోవడం మంచిది. పెళ్లి ప్రయత్నం సఫలం అవుతుంది.

10 / 12
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఈ వారమంతా చాలావరకు అనుకూలంగానే గడిచిపోతుంది. సప్తమ స్థానంలో గురువు, దశమ స్థానంలో బుధ, శుక్రుల సంచారం వల్ల ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. అయితే, ఆదాయా నికి మించి కుటుంబ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. తలపెట్టిన పనులు, వ్యవహారాలు వ్యయ ప్రయాసలతో పూర్తవుతాయి. ఉద్యోగంలో అధికారుల ఆదరణ లభిస్తుంది.  వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో రాబడి పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఒకటి రెండు శుభవార్తలు అందుతాయి. కుటుంబ పరిస్థితులకు, ఆర్థిక పరిస్థితులకు ఢోకా ఉండదు. వ్యక్తిగత సమస్యల విషయంలో కొద్దిగా చికాకులు తలెత్తే సూచనలున్నాయి. ఒక శుభకార్యంలో బాగా ఇష్టమైన బంధువులను కలుసుకునే అవకాశం ఉంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

11 / 12
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగుపడుతుంది. నవమ స్థానంలో బుధ, శుక్రుల సంచారం, రాశ్యధిపతి శని ధన స్థానంలో ఉండడం వల్ల ఆదాయానికి లోటుండకపోవచ్చు. ముఖ్యమైన వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు ఒక వెలుగు వెలుగుతాయి. ఉద్యోగంలో అధికారులకు బాగా ఉపయోగపడతారు. బంధువులతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ఈ రాశిలో రాహువు, సప్తమ స్థానంలో కేతువు సంచారం వల్ల కుటుంబంలో టెన్షన్లు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా పిల్లల విషయంలో ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు తేలికగా పూర్తవుతాయి. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. సొంత పనుల మీద దృష్టి పెట్టడం మంచిది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఇతరుల వివాదాల్లో తలదూర్చవద్దు.

12 / 12
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): రాశ్యధిపతి గురువు పంచమ స్థానంలో కుజుడితో యుతి చెందడం వల్ల ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాలతో పురోగమిస్తా‍యి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అనవసర ఖర్చులు బాగా పెరిగి ఇబ్బంది పడతారు. కొద్దిపాటి ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ఇంటా బయటా గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు, పెండింగ్ పనులను చాలావరకు పూర్తి చేస్తారు. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. ఆహార, విహారాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. నిరుద్యోగులకు, ఉద్యోగులకు మంచి ఆఫర్లు అందివస్తాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us