
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): గ్రహ బలం బాగా అనుకూలంగా ఉంది. ఆత్మవిశ్వాసంతో వ్యవహరించడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులతో అనుకూలతలు బాగా పెరుగుతాయి. బాధ్యతల నిర్వహణలో ముందుంటారు. వృత్తి, వ్యాపారాలు సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. రాదనుకున్న డబ్బు చేతికి వస్తుంది. అనుకోకుండా ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు అనుకూల ఫలితాలనిస్తాయి. ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. సమయస్ఫూర్తితో వ్యవహరించి కుటుంబ వ్యవహారాలను చక్కబెడతారు. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు బాగా ఉత్సాహంగా సాగిపోతాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఈ వారం ఆశించినంత అనుకూలంగా సాగిపోతుంది. శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు, ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆర్థికంగా బాగానే ఉంటుంది. ధనపరంగా ఇతరులకు వాగ్దానాలు చేయకపోవడం, హామీలు ఉండకపోవడం మంచిది. అదనపు ఆదాయ అవకాశాలు విస్తరిస్తాయి. కుటుంబ సభ్యుల మీద ఖర్చు పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా పురోగమిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ప్రముఖు లతో పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు తప్పకపోవచ్చు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): గ్రహ బలం బాగా అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నమైనా బాగా కలిసి వస్తుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో ఒత్తిడి నుంచి బయటపడతారు. వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడతాయి. నిరుద్యోగులకు కలిసి వచ్చే సమయం ఉంది. పెళ్లికి సంబంధించి సరైన ప్రయత్నాలు చేయడంతో పాటు, అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. ఆదాయ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. మొండి బాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబసమేతంగా ఇష్ట మైన ఆలయాల్ని సందర్శిస్తారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. విద్యార్థులు కొద్ది శ్రమతో మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): వృత్తి, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా, ఆశాజనకంగా సాగిపోతాయి. అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఆదాయానికి లోటుండదు. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. కొత్త ఆదాయ మార్గాలు చేపడతారు. ప్రతి పనిలోనూ కొద్దిగా ఒత్తిడి, శ్రమ తప్పకపోవచ్చు. ఆదాయానికి మించి ఖర్చులు ఉండే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. బంధుమిత్రులతో ఆచి తూచి వ్యవహరించడం మంచిది. జీవిత భాగస్వామితో కలిసి ఆలయ దర్శనం చేసుకుంటారు. నిరుద్యోగులు కొద్ది ప్రయత్నంతో మంచి ఉద్యోగం సంపాదించుకుంటారు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. విద్యార్థులు సాధారణ ఫలితాలు పొందుతారు. ప్రేమ వ్యవహారాలు సంతృప్తి కలిగిస్తాయి. ప్రయాణాలు బాగా లాభిస్తాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): వృత్తి, ఉద్యోగాల్లో బాగా రాణిస్తారు. వ్యాపారంలో కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి సమయం అను కూలంగా లేదు. ఆర్థిక వ్యవహారాల్లో కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల వల్ల కొద్దిగా ఒత్తిడికి గురవుతారు. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. కొందరు బంధువుల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. శ్రమ, తిప్పట ఎక్కువగా ఉంటాయి. కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవ హరించడం మంచిది. ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. విద్యార్థులు కొద్దిగా శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): గ్రహ బలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఉద్యోగంలో పదోన్నతి లభించడానికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ ప్రాధాన్యం, ప్రాభవం కొనసాగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఇంటాబయటా మాటకు విలువ పెరుగుతుంది. ముఖ్యమైన ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. ఆదాయానికి లోటుండకపోవచ్చు. ఆర్థిక పరిస్థితులు చాలావరకు అనుకూలంగా ఉంటాయి. ఇతరులకు ఆర్థికంగా సాయం చేస్తారు. తోబుట్టువులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక వ్యవహారాలకు సమయం అనుకూలంగా ఉంది. బంధుమిత్రులతో సఖ్యత, సాన్ని హిత్యం పెరుగుతాయి. ఆరోగ్యం చాలావరకు చక్కబడుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): శుభ గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వారమంతా సుఖ సంతోషాలతో సాగిపోతుంది. ఇంటా బయటా మీ మాట చెల్లుబాటవుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ముఖ్యమైన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడు పుతారు. బాగా ఇష్టమైన స్నేహితులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాల్లో ఆర్థి కంగా ఆశించిన పురోగతి సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు, లక్ష్యాలతో పాటు హోదాలు పెరిగే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. కుటుంబ వ్యవహారాలను చక్క బెడతారు. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. ఆరోగ్యానికి లోటుండదు. మంచి పరిచయాలు కలుగుతాయి. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ఉద్యోగ జీవితం సాఫీగా, సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా శ్రమ పెరుగుతుంది. పోటీదార్ల సమస్య కాస్తంత ఎక్కువగా ఉంటుంది. కొద్ది శ్రమతో అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు ఒక పట్టాన పూర్తి కాక ఇబ్బంది పడతారు. ఆదాయం కొద్దిగా మాత్రమే పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయాల్లో బాగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆదాయ ప్రయత్నాలు నిలకడగా సాగిపోతాయి. కుటుంబ సభ్యులతో తొందర పాటుతో మాట్లాడడం మంచిది కాదు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. అదనపు ఆదాయానికి అవకాశం ఉంది. విద్యార్థులకు శ్రమ తప్పదు. ప్రేమ వ్యవహారాలు పరవాలేదనిపిస్తాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): గ్రహ బలం అనుకూలంగా ఉన్నందువల్ల ఉద్యోగంలో అధికారులతో సామరస్య వాతావరణం ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఇంటా బయటా ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. ఆదాయపరంగా ఊహించని అనుకూలతలుంటాయి. కొన్ని కష్టనష్టాల నుంచి చాలావరకు బయటపడే అవకాశం ఉంది. సోదరులతో రాజీమార్గంలో ఆస్తి వివాదం ఒకటి పరి ష్కారమవుతుంది. ఆర్థిక సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. చేపట్టిన పనుల్లో అవరోధాలు, ఆటంకాలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యు లతో కలిసి ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. ప్రయాణాల వల్ల లాభాలుంటాయి. ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగుతాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ధన స్థానంలో గ్రహాల సంఖ్య పెరగడం వల్ల ఈ వారంలో ఆదాయం బాగా పెరగడమే తప్ప తగ్గడం ఉండకపోవచ్చు. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. వృత్తి, ఉద్యోగాలు కూడా సానుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగంలో మీ పనితీరుకు అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. అనుకున్న పనులు, వ్యవహారాలు అనుకున్నట్టు పూర్తి చేస్తారు. అదనపు ఆదాయ ప్రయత్నాల వల్ల ఆశించిన ఫలితాలు కలుగుతాయి. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులు ఆశించిన శుభ వార్తలు వింటారు. చిన్ననాటి మిత్రులతో విందులో పాల్గొంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులు కొద్ది శ్రమతో పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు బాగా సానుకూలపడతాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి కొద్దిపాటి ఒత్తిడి ఉంటుంది. ఆదాయం నిలకడగా సాగుతుంది. ఆర్థిక వ్యవహారాలు సవ్యంగా సాగిపోతాయి. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ప్రతి ముఖ్యమైన వ్యవహారంలోనూ ఆచితూచి వ్యవహరించడం మంచిది. సొంత పనుల మీద దృష్టి పెట్టడం ఉత్తమం. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. కొందరు బంధువులతో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా కొనసాగుతుంది. సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. అవసరానికి డబ్బు లభించక ఇబ్బందిపడే సూచనలున్నాయి. వ్యాపారాలు సాదా సీదాగా సాగిపోతాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు. ప్రేమ వ్యవహారాల్లో సాన్నిహిత్యం పెరుగుతుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలను స్వీకరించాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా సాగి పోతాయి. అనేక మార్గాల్లో ధన లాభం పొందుతారు. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. ఆర్థికపరంగా వారమంతా అనుకూలంగా సాగి పోతుంది. ముఖ్యమైన వ్యవహారాలు తేలికగా పూర్తయి ఊరట కలుగుతుంది. తలపెట్టిన పనులు, వ్యవహారాలు సకాలంలో, సంతృప్తికరంగా పూర్తవుతాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు కొన్ని మంచి ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలించి ఆశించిన సంబంధం కుదురుతుంది. భాగస్వామ్య వ్యాపారాలకు కొత్త పెట్టుబడులు లభిస్తాయి. కుటుంబసమేతంగా ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి.