Weekly Horoscope: ఈ రాశులకు ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో శుభవార్తలు

Edited By:

Updated on: Aug 29, 2026 | 7:07 PM

వార ఫలాలు (ఆగస్టు 30-సెప్టెంబర్ 5, 2026): మేష రాశి వారికి ఈ వారం ఉద్యోగంలో పని తీరుతో అధికారులను బాగా ఆకట్టుకుంటారు. అధికారుల నుంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి. వృషభ రాశి వారికి ఉద్యోగంలో ఆశించిన ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నా ప్రతిఫలం ఉంటుంది. మిథున రాశి వారికి ఈ వారమంతా సానుకూలంగా గడిచిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..?

1 / 12
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఉద్యోగంలో పని తీరుతో అధికారులను బాగా ఆకట్టుకుంటారు. అధికారుల నుంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో మంచి మార్పులు చేపట్టి లబ్ధి పొందుతారు. ఆదాయ, ఆరోగ్య సమస్యలేవీ ఉండకపోవచ్చు. దూర ప్రాంతం నుంచి పిల్లలు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. వ్యక్తి గత, ఆర్థిక సమస్యల పరిష్కారం మీద దృష్టిసారిస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు కూడా తీసుకోవడం మంచిది. ఆస్తి వివాదాన్ని పెద్దల తోడ్పాటుతో పరిష్కరించుకుంటారు. ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కొందరు మిత్రుల వల్ల మోసపోయే అవకాశం ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. తల్లితండ్రుల తోడ్పాటు లభిస్తుంది.

2 / 12
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఉద్యోగంలో ఆశించిన ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నా ప్రతిఫలం ఉంటుంది. వృత్తి జీవితంలో క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశం ఉంది.  పెళ్లి, ప్రేమ ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. బంధుమిత్రులకు అండగా నిలబడతారు.  పిల్లలు కొద్ది శ్రమతో చదువుల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ, దైవ కార్యాల్లోనూ పాల్గొంటారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఇంటా బయటా బయటా ఒత్తిడి ఉన్నా ముఖ్యమైన వ్యవహారాలనన్నిటినీ సకాలంలో పూర్తి చేస్తారు. ఆరోగ్యానికి ఇబ్బం దేమీ ఉండదు. ఆస్తి వివాదానికి సంబంధించి అనుకోకుండా ఆశించిన శుభవార్తలు అందుతాయి.

3 / 12
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): వారమంతా సానుకూలంగా గడిచిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది. కుటుంబపరంగా ఒకటి రెండు సమస్యలున్నా వాటిని తేలికగా అధిగమిస్తారు. ఆర్థిక విషయాలకు సమయం అన్ని విధాలుగానూ కలిసివస్తుంది.  కొద్ది ప్రయత్నంతో ముఖ్యమైన వ్యవహారాలన్నీ పూర్తవుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారులకు మీ మీద నమ్మకం వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ, ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితికి లోటుండదు. పిల్లలు తేలికగా విజ యాలు సాధిస్తారు. సాధారణంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా కలిసి వస్తుంది.

4 / 12
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఆశించిన ప్రతిఫలం అందుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. మనసులోని ఒకటి రెండు కోరికలు నెరవేరుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. జీవిత భాగస్వామి సహకారంతో ముఖ్యమైన కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తారు. జీతభత్యాలకు సంబంధించి అధికారుల నుంచి శుభవార్తలు వింటారు. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలన్నీ సంతృప్తికరంగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఆర్థికంగా ఊహించని అదృష్టం పడుతుంది. ఎవరికీ గుడ్డిగా నమ్మక పోవడం మంచిది.

5 / 12
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): వృత్తి, ఉద్యోగాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. పని భారం బాగా పెరుగుతుంది. పదోన్నతుల విషయంలో ఆశించిన శుభవార్తలు వింటారు. వృత్తి జీవితంలో శుభ పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి. వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. కొద్ది ప్రయత్నంతో ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యమైన  పనులు, వ్యవహారాల్లో కార్యసిద్ధి, వ్యవహార జయం ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. వృథా ఖర్చులను వీలైనంతగా తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు తలెత్తే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశాభంగం తప్పకపోవచ్చు. షేర్ల ద్వారా ఊహించని ధనలాభం కలుగుతుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.

6 / 12
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు నిర్వర్తించడం జరుగుతుంది. ప్రతిభా పాటవాలకు ఆశించిన గుర్తింపు, ప్రోత్సాహకాలు లభిస్తాయి. వ్యాపారాల్లో ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఉచిత సహాయాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. చిన్ననాటి మిత్రులతో సరదాగా గడుపుతారు.  ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తల్లితండ్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. గృహ, వాహన కొనుగోలు వ్యవహారాల మీద దృష్టి సారిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. పిల్లలకు శ్రమ తప్పకపోవచ్చు. కుటుంబ జీవితంలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.

7 / 12
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఈ వారమంతా సమయం బాగా అనుకూలంగా సాగిపోతుంది. ఉద్యోగంలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. అధికారులతో అనుకూలతలు పెరుగుతాయి. వృత్తి జీవితం లాభసాటిగా సాగిపోతుంది. వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని మించుతాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు, పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఏ ప్రయత్నం చేపట్టినా సఫలం అవుతుంది. కుటుంబ జీవితం ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగిపోతుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్ వంటివి లాభిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంది. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు.

8 / 12
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ఉద్యోగంలో మీ ప్రతిభా పాటవాలు బాగా వెలుగులోకి వస్తాయి. అధికారులకు మీ పని తీరు బాగా నచ్చుతుంది. వృత్తి, వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. కుటుంబానికి సంబంధించి కొత్త నిర్ణయాలు తీసు కుంటారు. జీవన శైలిలో మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యక్తిగత సమస్యలు చాలావరకు తగ్గు ముఖం పడతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. స్నేహితుల వల్ల కొద్దిగా డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆర్థిక అవసరాలు తీరడం, ఆర్థిక సమస్యలు తగ్గిపోవడం జరుగు తుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఊహించని ఆకస్మిక ధన లాభం కలుగుతుంది.

9 / 12
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలు బాగా పెరుగుతాయి. అధికారులకు బాగా ఉపయోగపడతారు. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు ఉండే అవకాశం ఉంది. నష్టాల నుంచి చాలావరకు బయటపడతారు. ఇంటా బయటా గౌరవ మర్యాదలకు లోటుండదు. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి.  ఆదాయం కొద్దిగా పెరుగుతుంది. ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. తల్లితండ్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. గృహ, వాహన యోగాలకు అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. బంధుమిత్రులకు వీలైనంతగా అండగా నిలబడతారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు అందు తాయి. వ్యక్తిగత జీవితంలో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

10 / 12
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఈ వారమంతా సరిస్థితులు బాగాఅనుకూలంగా సాగుతాయి. అనుకోకుండా కొద్దిపాటి అదృష్టం కలిసి వస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో భద్రత, స్థిరత్వంతో పాటు, అధికార యోగానికి కూడా అవకాశం ఉంది. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. బంధువుల రాకపోకలతో కుటుంబంలో సందడి నెలకొంటుంది. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటుండదు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఇతరులకు సహాయం చేసే పరిస్థితిలో ఉంటారు. కొందరు బంధుమిత్రులు ఎక్కువగా ఆధార పడతారు. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వస్తాయి. కుటుంబ సభ్యులతో విహార యాత్ర చేస్తారు. ప్రయాణాలు అనుకూలంగా సాగిపోతాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది.

11 / 12
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఇంటా బయటా సానుకూలతలు పెరుగుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది.  వృత్తి, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. తలపెట్టిన వ్యవహారాలన్నీ కొద్ది వ్యయ ప్రయాసలతో పూర్తవుతాయి. ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. బంధుమిత్రులతో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ముఖ్యమైన ప్రయత్నాల్లో విజయాలు సాధిస్తారు. ఆహార, విహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది.  ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాలి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమయ్యే సూచనలున్నాయి. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది.

12 / 12
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. ఇంటా బయటా మాటకు విలువ లభిస్తుంది. గౌరవ మర్యాదలకు లోటుండదు. వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ప్రతి ప్రయ త్నంలోనూ, ప్రతి వ్యవహారంలోనూ శ్రమాధిక్యత, వ్యయ ప్రయాసలుండే అవకాశం ఉంది. ఆర్థిక ప్రయత్నాలు చాలావరకు సఫలం అవుతాయి. అనవసర ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. సొంత పనుల మీద మరింతగా శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. పిల్లలు చదువుల్లో ఘన విజయాలు సాధిస్తారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. గట్టి పట్టుదలతో వ్యక్తిగత సమస్యల్ని చాలా వరకు పరిష్కరించుకుంటారు. ఆర్థిక సమస్యల ఒత్తిడి బాగా తగ్గుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.  ఆకస్మిక ధన ప్రాప్తికి బాగా అవకాశముంది.

Loading...
Unable to load recommendations.
Follow Us