
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): రాశ్యధిపతి కుజుడు ఇదే రాశిలో ఉండడం, ధన స్థానంలో రవి, బుధుల యుతి ఏర్పడడం వల్ల అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలావరకు తగ్గు ముఖం పడతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారు బాగా వృద్ధిలోకి వస్తారు. కుటుంబ ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యమైన వ్యవహారాలు, పనుల్లో జీవిత భాగస్వామి నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ఇష్టమైన ప్రాంతానికి బదిలీ అయ్యే సూచనలున్నాయి. ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): రాశ్యధిపతి శుక్రుడు ధన స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల ఒత్తిడి బాగా తగ్గుతుంది. ఆరోగ్య సమస్యల నుంచి కూడా చాలా వరకు విముక్తి లభిస్తుంది. వృత్తి జీవితం సాఫీగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. ఉద్యోగంలో ఆశించిన ప్రోత్సాహం, ఆదరణ లభిస్తాయి. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. మాట తొందరపాటును తగ్గించుకోవడం మంచిది. కుటుంబంలో విభేదాలు, అపార్థాలకు అవకాశం ఉంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్త వింటారు. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): శని, శుక్ర, కుజ గ్రహాల అనుకూలత వల్ల ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు, ప్రయత్నాలు సానుకూల ఫలితాలనిస్తాయి. వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా, సానుకూలంగా సాగిపోతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, వృథా ఖర్చులు ఇబ్బంది పెడతాయి. పిల్లల చదువుల పట్ల శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంటుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. దైవ కార్యాలకు ఆర్థికంగా సహాయపడతారు. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆహార, విహారాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): రవి, బుధ, కుజ గ్రహాలు అనుకూల స్థానాల్లో సంచారం చేస్తున్నందువల్ల సర్వత్రా ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో పెట్టుబడులకు మించిన లాభాలు అందుకుంటారు. కొద్ది ప్రయత్నంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ముఖ్యమైన వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలను పూర్తి చేస్తారు. పిల్లల చదువులకు సంబంధించి సంతృప్తికరమైన సమాచారం అందుతుంది. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి సారిస్తారు. ఆరోగ్యం పరవాలేదు. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ఆర్థికంగా ఎవరికీ హామీలు ఇవ్వకపోవడం మంచిది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి సానుకూల స్పందన లభించవచ్చు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): దశమ, లాభ స్థానాలు బలంగా ఉన్నందువల్ల ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. పదోన్నతి లభించే అవకాశం ఉంది. నిరుద్యోగులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది. ఒక ముఖ్యమైన వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. ఆదాయ వృద్ధి సూచనలున్నాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు సైతం వసూలవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేసుకోవడం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. మీ నుంచి సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. దాంపత్య జీవితం వ్యవహారాల హ్యపీగా సాగుతుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో సమస్యలుండే అవకాశం ఉంది. మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. బంధువుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

కన్య (ఉత్తర 1,2,3, హస్త, చిత్త 1,2): రాశ్యధిపతి బుధుడు భాగ్య స్థానంలోను, శుక్ర, గురువులు దశమ స్థానంలోనూ ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులు సంతృప్తి చెందు తారు. మీ మీద నమ్మకం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు చాలావరకు సానుకూలంగా సాగిపోతాయి. స్నేహితులకు బాగా ఆర్థిక సాయం చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు సునాయాసంగా పూర్తవుతాయి. వ్యాపారాల్లో కూడా అంచనాలను అందుకుంటారు. ఆహార, విహారాల్లో బాగా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు చదువుల్లోనూ, పోటీ పరీక్షల్లోనూ విజయాలు సాధిస్తారు. పెళ్లి ప్రయత్నాలు ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్లకపోవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు చాలావరకు సానుకూల ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): భాగ్య స్థానంలో రాశ్యధిపతి శుక్రుడితో పాటు గురువు సంచారం చేస్తున్నందువల్ల వారమంతా వైభవంగా సాగిపోతుంది. ఉద్యోగంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగం మారడం గానీ, బాధ్యతలు మారడం గానీ తప్పకుండా జరిగే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. ఇంటా బయటా ఒత్తిడి ఎక్కువగానే ఉన్నా ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. ఆర్థిక వ్యవహారాల్లో కాస్తంత ఆలోచించి అడుగు వేయడం మంచిది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు సహాయం చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు అనుకోకుండా పరిష్కారం అవుతాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): శుక్ర, బుధ, రవుల అనుకూల సంచారం వల్ల ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగు పడుతుంది. అనుకోకుండా కొన్ని శుభవార్తలు వినడం, ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకోవడం వంటివి జరుగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయ వృద్ధి కారణంగా ఒకటి రెండు దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. మొండి బాకీ ఒకటి వసూలవుతుంది. వృత్తి, ఉద్యోగాలలో అవకాశాలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు మిత్రుల సహాయంతో పూర్తవుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగి పోతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆర్థిక విషయాల్లో ఎవరికీ వాగ్దానాలు ఉండవద్దు. కుటుంబసమేతంగా ఆలయాలను సందర్శిస్తారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): రాశ్యధిపతి గురువు సప్తమ స్థానంలో శుక్రుడితో కలవడం, తృతీయంలో రాహువు సంచారం వల్ల ఆదాయానికి లోటుండకపోవచ్చు. ముఖ్యమైన ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడ తారు. ఏ ప్రయత్నమైనా సఫలమవుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తయి ఊరట కలుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరి చయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కానీ, కుటుంబం మీద ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలలోనే కాక సామాజికంగా కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. ఉద్యోగంలో అధికారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తారు. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్ అందుతుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): బుధ, రవి, శనులు బాగా అనుకూలంగా స్థానాలు బలంగా ఉన్నందువల్ల వారమంతా సజావుగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. ఆదాయానికి, సుఖ సంతోషాలకు, మానసిక ప్రశాంతతకు ఏమాత్రం లోటుండదు. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆర్థిక వ్యవహారాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. కొత్త ఉద్యోగానికే కాకుండా, ఉద్యోగం మారడానికి కూడా అవకాశాలు కలిసి వస్తాయి. చేపట్టిన పనుల్లో తప్పకుండా కార్యసిద్ధి కలుగుతుంది. జీవిత భాగ స్వామితో కలిసి దైవ దర్శనాలు చేసుకుంటారు. పెళ్లి ప్రయత్నాల్లో బంధువుల నుంచి శుభవార్త అందుతుంది. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం మీద శ్రద్ద పెట్టడం మంచిది. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): చతుర్థ, పంచమ స్థానాల్లో శుభ గ్రహాల సంచారం వల్ల అటు కుటుంబంలోనూ, ఇటు ఉద్యోగం లోనూ శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. రాశ్యధిపతి రవి నీచ స్థితిలో ఉన్నందువల్ల ఆరోగ్యం విషయంలో శ్రద్ద పెట్టడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు, ప్రయత్నాలు నిదానంగా పూర్తవుతాయి. కుటుంబపరంగా యాక్టివిటీ బాగా పెరుగుతుంది. బయట పనులు, వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్య తలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. బంధుమిత్రులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఢోకా ఉండదు. కొన్ని నష్టదాయక వ్యవహారాలతో బాగా ఇబ్బంది పడడం జరుగుతుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): రాశ్యధిపతి గురువు చతుర్థ స్థానంలో శుక్రుడితో కలిసి ఉన్నందువల్ల వారమంతా ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా సాగిపోతుంది. ఆర్థిక లావాదేవీలు విజయవంతం అయ్యే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలలో ముఖ్యమైన సమస్యలను అధిగమిస్తారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగిపోతాయి. కుటుంబసమేతంగా పుణ్యక్షేత్రానికి వెడతారు. పిల్లలు చదువుల్లో ఘన విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆర్థిక సమస్యల ఒత్తిడి బాగా తగ్గుతుంది. స్పెక్యులేషన్, షేర్లు వంటివి లాభాలనిస్తాయి. పెళ్లి సంబంధానికి సంబంధించి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. వ్యయ స్థానంలో రాహువు సంచారం వల్ల వాహన ప్రమాదాలతో జాగ్రత్తగా ఉండాలి. ఒకరిద్దరు మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది.