
జ్యోతిషశాస్త్ర గ్రంథాల్లో లక్ష్మీదేవి, కుబేరుడు, సూర్యుడు, వినాయకుడికి ఇష్టమైన రాశులను ప్రత్యేకంగా గుర్తించి, ప్రస్తావించడం జరిగింది. ఆ దేవతలను పూజించడం వల్ల ఈ రాశులకు శుభ ఫలితాలు మరింత ఎక్కువగా అనుభవానికి వస్తాయని కూడా పేర్కొనడం జరిగింది. వినాయకుడిలో ఉన్న నిదానం, ప్రణాళికాబద్ధమైన వ్యవహారం, ఓర్పు, సహనాలు, అల్ప సంతోషం వంటి లక్షణాలు కలిగిన వృషభం, కర్కాటకం, కన్య, తుల, మకరం, కుంభ రాశుల వారికి కొద్దిపాటి పూజతో శుభ యోగాలు కలిగే అవకాశం ఉంది. ఈ నెల(సెప్టెంబర్) 14న వస్తున్న వినాయక చవితి రోజున ఆయన భక్తి శ్రద్ధలతో ప్రార్థించడంవల్ల ఈ రాశుల వారికి తప్పకుండా వినాయకుడి అనుగ్రహం కలుగుతుంది.

వృషభం: ఓర్పు, సహనాలు, దూరదృష్టి కలిగిన ఈ రాశివారికి పట్ల వినాయకుడు ధన ధాన్యాలు అనుగ్ర హిస్తాడని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. ఈ రాశివారు వినాయక చవితిని ఎంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటే ఆయన అంతగా అనుగ్రహిస్తాడని, ప్రసన్నుడవుతాడని చెబుతారు. ఆయన కటా క్షంతో వీరు సంపన్నులయ్యే అవకాశం ఉంది. అనేక సమస్యలు మటుమాయమవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆస్తి వివాదాల్లో విజయాలు సాధిస్తారు.

కర్కాటకం: ఇతరుల పట్ల ఆదరాభిమానాలతో వ్యవహరించడంతో పాటు, ఓర్పు, సహనాలు కూడా కలిగిన ఈ రాశివారికి వినాయకుడు సొంత ఇల్లు, ఆస్తులు అనుగ్రహించే అవకాశం ఉంది. ఈ నెల 14న శ్రద్ధగా చేసే పూజతో వీరికి మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. కుటుంబంలో శుభ కార్యాలు చోటు చేసుకుంటాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగు తాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి.

కన్య: మానసిక సమతౌల్యంతో పాటు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించే ఈ రాశివారికి వినాయకుడు ఈ నెల 14 నుంచి ఉన్నత పదవులు, విదేశీయానం, సరైన ఉద్యోగం, సరైన గుర్తింపు అనుగ్రహించే అవకాశం ఉంది. గణపతిని ఆ రోజున ఎంత భక్తి శ్రద్ధలతో పూజిస్తే అంత మంచిది. ఈ రాశివారికి త్వరలో తప్పకుండా అధికార యోగం పడుతుంది. విశేషంగా ఆర్థి కాభివృద్ధి కలుగుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగుతాయి.

తుల: నాయకత్వ లక్షణాలతో పాటు, దూరదృష్టి, స్థితప్రజ్ఞత వంటి లక్షణాలు కలిగిన ఈ రాశివారికి వినాయకుడి దయ వల్ల ఈ నెల 14 తర్వాత అధికారయోగం పట్టే అవకాశం ఉంది. ఈ రాశివారికి వినాయకుడు విదేశీ ఉద్యోగాలను, విదేశీ పర్యటనలను అనుగ్రహించే అవకాశం ఉంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారే ప్రయత్నాలు ఫలిస్తాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. తండ్రి వైపు నుంచి ఆస్తిపాస్తులు సంక్రమించే అవకాశం ఉంది.

మకరం: ఈ రాశివారిలోని కర్తవ్యనిష్ఠ, కార్యదక్షత, శ్రద్ధాసక్తులు వినాయకుడికి బాగా ఇష్టమైన లక్షణాలు. వినాయక చవితి నుంచిఈ రాశివారికి దశ తిరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో అందలాలు ఎక్కు తారు. వృత్తి, వ్యాపారాలు బాగా విస్తరించే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావా దేవీలు లాభాల పంట పండిస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి.

కుంభం: ఈ రాశివారిలోని ఆధ్యాత్మిక చింతన, పట్టుదల, మానవత్వ ధోరణి వినాయకుడికి ఇష్టమైన లక్ష ణాలు. వినాయక చవితి నుంచి ఆయన అనుగ్రహం వీరికి ఎక్కువగా కలిగే అవకాశం ఉంది. అను కున్న పనులన్నీ నిర్విఘ్నంగా పూర్తవుతాయి. సొంత ఇంటి కల, విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న కల తప్పకుండా నెరవేరుతాయి. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి.