Luxury Life: శుక్రుడి వల్ల లక్ష్మీ కటాక్షం.. ఇక నుంచి ఆ రాశులకు విలాస జీవితం..!

Edited By:

Updated on: Feb 13, 2026 | 6:13 PM

Shukra Exalted in Pisces: ప్రస్తుతం తన మిత్ర క్షేత్రమైన కుంభ రాశిలో సంచారం చేస్తున్న శుక్రుడు మార్చి 1 నుంచి ఉచ్ఛ స్థితిలో కూడా ఉండబోతున్నందు వల్ల కొన్ని రాశుల వారి జీవితాలు సమూలంగా మారిపోయే అవకాశం ఉంది. మార్చి ఆఖరు వరకూ తనకు ఉచ్ఛ క్షేత్రమైన మీన రాశిలోనే సంచారం చేయడం జరుగుతుంది. రెండు నెలల పాటు అనుకూలంగా ఉండబోతున్న శుక్రుడి వల్ల కొన్ని రాశుల వారికి లక్ష్మీ కటాక్షం ఎక్కువగా ఉంటుంది. శృంగార జీవితానికి, భోగ భాగ్యాలకు కారకుడైన శుక్రుడు కుంభ, మీన రాశుల్లో గడపడం వల్ల తప్పకుండా ధన ప్రవాహం ఉంటుంది. ఫలితంగా వృషభం, మిథునం, కన్య, తుల, వృశ్చికం, మకర రాశుల వారు విలాస జీవితం అనుభవించడం జరుగుతుంది.

1 / 6
వృషభం: ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు దశమ, లాభ స్థానాలో సంచారం చేయడం వల్ల అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో జీతభత్యాలు అంచనాలను మించుతాయి. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. సంపద బాగా వృద్ధి చెందుతుంది. ఆస్తి కలిసి వస్తుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వీటన్నిటి ఫలితంగా ఈ రాశివారు రెండు నెలలు భోగభాగ్యాలలో తులతూగే అవకాశం ఉంది.

2 / 6
మిథునం: ఈ రాశికి భాగ్య, దశమ స్థానాల్లో శుక్రుడి సంచారం వల్ల ధనానికి లోటుండని జీవితం ఏర్పడుతుంది. శృంగార జీవితం విస్తరిస్తుంది. భోగభాగ్యాల్లో జీవిస్తారు. విలాస జీవితానికి బాగా అల వాటుపడతారు. విహార యాత్రలు ఎక్కువగా చేస్తారు. కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. శుభ కార్యాలు జరగడానికి కూడా అవకాశం ఉంది. దాంపత్య జీవితం మరింత పటిష్ఠం అవుతుంది. మనసులోని ముఖ్యమైన కోరికలు చాలావరకు నెరవేరే అవకాశముంది.

3 / 6
కన్య: ఈ రాశికి అత్యంత శుభుడైన శుక్రుడు మిత్ర, ఉచ్ఛ క్షేత్రాల్లో సంచారం చేయడం వల్ల ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. పిత్రార్జితం లభిస్తుంది. ఉద్యోగంలో జీతభత్యాలు, హోదా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా వృద్ధి చెందుతాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. విలాసాల్లో మునిగి తేలడం జరుగుతుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది.

4 / 6
తుల: రాశ్యధిపతి శుక్రుడు బాగా అనుకూలంగా మారుతున్నందువల్ల ఉద్యోగంలో పదోన్నతులకు, జీతభత్యాల పెరుగుదలకు అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు రెట్టింపవుతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా బయటపడడం జరుగుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఫలితంగా ఈ రాశివారు విలాస జీవితానికి, సుఖ సంతోషాలకు బాగా అలవాటుపడే అవకాశం ఉంది. ప్రముఖులతో పరిచయాలవల్ల వీరి జీవితం పూర్తిగా మారిపోతుంది.

5 / 6
వృశ్చికం: ఈ రాశికి చతుర్థ, పంచమ స్థానాల్లో శుక్ర సంచారం వల్ల ఆకస్మిక ధన లాభానికి అవకాశముంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. విదేశీ సొమ్ము అనుభవించే యోగం కూడా ఉంది. లక్ష్మీ కటాక్షం బాగా ఎక్కువగా ఉన్నందువల్ల భోగభాగ్యాలకు, విలాస జీవితానికి, సుఖ సంతోషాలకు లోటుండదు. మనసులోని ముఖ్యమైన కోరికలు నెరవేరుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరు గుతాయి. అనవసర పరిచయాలు కూడా కలుగుతాయి. విలాసాల్లో మునిగి తేలే అవకాశం ఉంది.

6 / 6
మకరం: ఈ రాశికి ధన, తృతీయ స్థానాల్లో శుక్రుడు రెండు నెలలు ఉండబోతున్నందువల్ల ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరిగే అవకాశం ఉంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి కుదరడం, ప్రేమలో పడడం వంటివి జరుగుతాయి. జీవన శైలి పూర్తిగా మారిపోతుంది. అవసరానికి మించిన డబ్బు చేతిలో ఉంటుంది. విలాస జీవితాన్ని అనుభవించడంలో వీరు కొత్త పుంతలు తొక్కుతారు.