
శ్రీరాముడి అనుగ్రహంతో మేష రాశి వారు విజయాలు సాధిస్తారు. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి వీసా దొరుకుతుంది. పాత భూములకు రేట్లు పెరగడంతో ఆకస్మిక డబ్బు వస్తుంది. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. పని చేస్తున్న చోట మంచి పేరు వస్తుంది.

మిథున రాశి : రాహు, కేతువులు సంచారం వలన ఈ రాశుల వారు అనుకున్నవన్నీ సాధిస్తారు. లాభాల వల్ల డబ్బును కూడా ఆదా చేస్తారు. బ్యాంక్ బ్యాలెన్స్ కూడా విపరీతంగా పెరుగుతుంది . ఇంకా విదేశీ పర్యటనకు కూడా వెళ్తారు. ఇంకా వీరి కోర్టు సమస్యలు కూడా పరిష్కారమవుతాయి.

కర్కాటకం: ఈ రాశికి దశమంలో చతుర్థ, లాభాధిపతి అయిన శుక్రుడి సంచారం వల్ల జీవితంలో కొన్ని కీలక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఏ రంగంలో ఉన్నవారికైనా ఆదాయం బాగా పెరగడంతో పాటు అధికార యోగం పడుతుంది. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంతో విదేశీ అవకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగుతాయి. ఆర్థికపరంగా ఆశించిన స్థిరత్వం ఏర్పడుతుంది. గృహ, వాహన సౌకర్యాలు కలుగుతాయి.

సింహం: ఈ రాశికి భాగ్య స్థానంలో శుక్రుడి సంచారం వల్ల అతి తక్కువ ప్రయత్నంతో నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. పెళ్లి ప్రయత్నాల్లో కూడా విదేశీ సంబంధం కుదురుతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు తరచూ వెళ్లే అవకాశం కలుగుతుంది. ఏ రంగంలోని వారికైనా ఉన్నత స్థానాలు లభిస్తాయి. ఆర్థికంగా బాగా ఉన్నత స్థాయికి చేరుకోవడం జరుగుతుంది. విదేశాల్లో ఉద్యోగాల్లో ఉన్నవారు స్థిరత్వం పొందుతారు. తండ్రి వైపు నుంచి ఆస్తిపాస్తులు సంక్రమిస్తాయి.

ధనుస్సు: ఈ రాశికి పంచమ స్థానంలో షష్ట, లాభాధిపతి అయిన శుక్రుడు సంచారం చేస్తుండడం వల్ల ఉద్యోగంలో తప్పకుండా అధికార యోగం పడుతుంది. ఏ రంగంలో ఉన్నా ఉన్నత స్థానాలకు వెళ్లే అవకాశముంటుంది. నిరుద్యోగులకు అనేక ఆఫర్లు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. సంపన్న కుటుంబంతో పెళ్లి కుదరడం లేదా ప్రేమలో పడడం జరుగుతుంది. అనేక విధాలుగా ఆదాయం బాగా కలిసి వస్తుంది.

మకరం: ఈ రాశికి పంచమ, దశమాధిపతిగా అత్యంత శుభుడైన శుక్ర గ్రహం చతుర్థ స్థానంలో సంచారం చేయడం వల్ల ఉద్యోగంలోనూ, సామాజికంగానూ ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ప్రముఖుడుగా గుర్తింపు పొందే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్లు, షేర్లు వంటివి బాగా లాభాలనిస్తాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.