Venus Transit: దుస్థానంలో శుక్రుడు.. ప్రేమ, పెళ్లి వ్యవహారాల్లో వారికి అడ్డంకులు..!

Edited By:

Updated on: Feb 04, 2026 | 3:41 PM

Shukra Gochar 2026: ఈ నెల (ఫిబ్రవరి) 6న కుంభ రాశిలో ప్రవేశిస్తున్న శుక్రుడు కొన్ని రాశులకు మోదం కలిగించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నప్పటికీ, కొన్ని రాశులకు ఖేదం కలిగించే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా కర్కాటకం, సింహం, కన్య, ధనుస్సు, మీన రాశుల వారిని మార్చి 1 వరకు కొద్దిగా ఇబ్బందులు పెట్టే సూచనలున్నాయి. సుఖ సంతోషాలకు, సిరిసంపదలకు, ప్రేమలు, పెళ్లిళ్లు, శృంగార జీవితానికి కారకుడైన శుక్రుడు దుస్థానాల్లో సంచారం చేసే పక్షంలో ఈ అంశాలన్నీ దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఈ రాశుల వారు ఎంత జాగ్రత్తగా, ఓర్పుగా ఉంటే అంత మంచిది.

1 / 5
కర్కాటకం: ఈ రాశికి అష్టమ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆర్థిక విషయాల్లో అదుపు తప్పే అవకాశం ఉంది. మిత్రుల వల్ల దారి తప్పే సూచనలున్నాయి. ఆస్తి వివాదాలు బాగా నష్టం కలిగిస్తాయి. ప్రేమ వ్యవహారాల్లో అసంతృప్తి, అసహనం, అపార్థాలు తలెత్తుతాయి. వైవాహిక సంబంధాలు కూడా ఎడమొహం, పెడమొహంగా మారతాయి. కుటుంబ జీవితంలో సుఖ సంతోషాలు తగ్గుతాయి. రావలసిన డబ్బు రాక ఇబ్బంది పడతారు.

2 / 5
సింహం: ఈ రాశికి సప్తమ స్థానంలో శుక్ర సంచారం ఈ రాశివారికి ఏమంత అనుకూల ఫలితాలనివ్వకపోవచ్చు. జీవిత భాగస్వామితో విభేదాలు, వివాదాలు తలెత్తుతాయి. జీవిత భాగస్వామి అనారోగ్యానికి గురయ్యే అవకాశం కూడా ఉంటుంది. పెళ్లి సంబంధాలు ఆశాభంగం కలిగిస్తాయి. దాంపత్యంలో సుఖ సంతోషాలు లోపిస్తాయి. ఉద్యోగంలో ప్రాభవం తగ్గుతుంది. ఇంటా బయటా అవమానాలు ఎదురవుతాయి. ఆదాయ వృద్ధి ప్రయత్నాల్లో శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది.

3 / 5
కన్య: ఈ రాశికి అత్యంత శుభుడైన శుక్రుడు ఆరవ స్థానంలో సంచారం చేయడం వల్ల ఆర్థిక విషయాల్లో గానీ, ఆస్తి విషయాల్లో గానీ సహాయం చేయలేని పరిస్థితిలో ఉంటాడు. ఆదాయాన్ని మించి ఖర్చులు పెరుగుతాయి. రావలసిన డబ్బు అందదు. ఇవ్వాల్సిన చోట బాగా ఒత్తిడి ఉంటుంది. సంసార జీవితంలో కలతలు తలెత్తుతాయి. ప్రేమ వ్యవహారాల్లో తరచుగా వాదోపవాదాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో అధికారుల వేధింపులు ఎక్కువగా ఉంటాయి. రాబడి తగ్గుతుంది.

4 / 5
ధనుస్సు: ఈ రాశికి తృతీయ స్థానంలో శుక్ర సంచారం వల్ల ఎంత శ్రమపడ్డా ఆదాయం ఆశించిన స్థాయిలో వృద్ధి చెందకపోవచ్చు. ఉద్యోగంలో ప్రాధాన్యం తగ్గుతుంది. జీతభత్యాలు పెరిగే అవకాశం ఉండదు. మిత్రుల వల్ల ఖర్చులు పెరగడంతో పాటు, నష్టపోయే అవకాశం కూడా ఉంది. ఎవరికీ ధనపరంగా వాగ్దానాలు చేయకపోవడం, హామీలు ఉండకపోవడం మంచిది. శుభవార్తలు తక్కువగానూ, దుర్వార్తలు ఎక్కువగానూ వింటారు. ప్రయాణాల వల్ల నష్టపోతారు. పెళ్లి ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి.

5 / 5
మీనం: ఈ రాశికి వ్యయ స్థానంలో శుక్ర సంచారం వల్ల శారీరక, మానసిక శ్రమ, ఒత్తిడి పెరుగుతాయి. మనశ్శాంతి లోపిస్తుంది. దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు లోపిస్తాయి. కొద్దిపాటి ఆదాయానికి కూడా ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. జీవిత భాగస్వామితో అపార్థాలు తలెత్తుతాయి. ప్రయాణాల్లో విలువైన వస్తువులు, పత్రాలు కోల్పోయే అవకాశం ఉంది. ప్రతి ప్రయత్నంలోనూ, ప్రతి పనిలోనూ వ్యయ ప్రయాసలు ఎక్కువగా ఉంటాయి. ఇష్టమైన బంధువులు దూరమవుతారు.