Wealth Astrology: శుక్ర, చంద్రుల మధ్య పరివర్తన.. ఆ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..!

Edited By:

Updated on: Jun 11, 2026 | 8:01 PM

Rare Parivartan Yoga: జూన్ 13 నుంచి 15 వరకు శుక్రుడు, చంద్రుడి మధ్య ఏర్పడుతున్న అరుదైన పరివర్తన యోగం కొన్ని రాశుల వారికి అదృష్ట ద్వారాలు తెరవనుంది. ఆదాయ వృద్ధి, ఆర్థిక లాభాలు, సుఖసంతోషాలకు దోహదం చేసే ఈ యోగం ప్రభావంతో మేషం, వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకర రాశుల వారిపై లక్ష్మీదేవి ప్రత్యేక కటాక్షం కురవనుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

1 / 7
జ్యోతిషశాస్త్రంలో పరివర్తన యోగానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. శుభ గ్రహాల మధ్య పరివర్తన జరిగినప్పుడు ఉత్తమ స్థాయి శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ నెల(జూన్) 13, 14, 15 తేదీల్లో శుక్ర, చంద్రుల మధ్య మూడు రోజుల పాటు జరుగుతున్న పరివర్తన కూడా ఇటువంటిదే. చంద్రుడికి చెందిన కర్కాటక రాశిలో శుక్రుడు, శుక్ర గ్రహానికి చెందిన వృషభ రాశిలో చంద్రుడు సంచారం చేయడం వల్ల ఈ పరివర్తన కలిగింది. ఆదాయం పెరగడానికి ఈ మూడు రోజుల్లో కొద్ది ప్రయత్నం చేయడం మంచిది. ఈ పరివర్తన పూర్తిగా ఆదాయ వృద్ధికి, సుఖ సంతోషాలకు సంబంధించినది. మేషం, వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకర రాశుల వారిని లక్ష్మీదేవి కటాక్షించబోతోంది.

2 / 7
మేషం: ఈ రాశికి ధన, చతుర్థాధిపతుల మధ్య పరివర్తన జరగడం వల్ల ఈ రాశివారు దాదాపు పట్టిందల్లా బంగారమవుతుంది. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. అనేక విధాలుగా ఆదాయం కలిసి వస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులకు అవకాశం ఉండడం, జీతభత్యాలు ఇబ్బడిముబ్బడిగా పెరగడం, పేరు ప్రఖ్యాతులు వ్యాపించడం వంటి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు ఆశించిన కంపెనీలో కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. ఉన్నత స్థాయి పరిచయాలు కలుగుతాయి.

3 / 7
వృషభం: ఈ రాశిలో చంద్రుడు ఉచ్ఛపట్టడం, రాశ్యధిపతి శుక్రుడికి, చంద్రుడికి పరివర్తన జరగడం వల్ల ఈ రాశివారు ఏ ప్రయత్నం చేపట్టినా సక్సెస్ అవుతుంది. కొద్ది శ్రమతో ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. ఉద్యోగంలో హోదా లభిస్తుంది. జీతభత్యాలు భారీగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ వృద్ధి చెందుతుంది. నిరుద్యోగులకు భారీ వేతనాలతో ఉద్యోగం లభిస్తుంది. సంపన్నుడితో పెళ్లి సంబంధం కుదురుతుంది. సంపన్న వ్యక్తితో ప్రేమలో పడే అవకాశముంది.

4 / 7
కర్కాటకం: రాశ్యధిపతి చంద్రుడు లాభ స్థానంలో ఉచ్ఛపట్టడం, లాభాధిపతి శుక్రుడితో పరివర్తన చెందడం వల్ల సగటు వ్యక్తి సైతం సంపన్నుడయ్యే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి అపారంగా లాభిస్తాయి. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు రాబడిపరంగా కొత్త పుంతలు తొక్కుతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నవారు విజయం సాధిస్తారు.

5 / 7
కన్య: ఈ రాశికి భాగ్య, లాభాధిపతుల మధ్య పరివర్తన జరగడం వల్ల మనసులోని ముఖ్యమైన కోరిక లన్నీ నెరవేరుతాయి. గృహ, వాహన సౌకర్యాలు వృద్ధి చెందుతాయి. ఆస్తి వివాదాలు, ఆస్తి వ్యవహారాలు బాగా అనుకూలంగా మారుతాయి. వ్యక్తిగత స్థిరాస్తుల విలువ రెట్టింపవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. ఇంటా బయటా ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఆధ్యాత్మికంగా, సామాజికంగా పురోగమిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.

6 / 7
వృశ్చికం: ఈ రాశికి సప్తమ, భాగ్యాధిపతుల మద్య పరివర్తన జరగడం వల్ల ఆర్థిక పరిస్థితి ఊహించని స్థాయిలో మెరుగుపడుతుంది. ఇతరులకు సహాయం చేయగల స్థితికి చేరుకుంటారు. ఏ ఆదాయ వృద్ధి ప్రయత్నమైనా తక్కువ శ్రమతో అత్యధికంగా లాభిస్తుంది. నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభించే అవకాశం ఉంది.

7 / 7
మకరం: ఈ రాశికి పంచమ, సప్తమాధిపతుల మధ్య పరివర్తన జరగడం ఒక పెద్ద యోగం. ఏ ప్రయత్నం చేపట్టినా కలిసి వస్తుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు అరుదైన విదేశీ అవకాశాలు కలిసి వస్తాయి. విదేశీయానానికి ఆటంకాలు తొలగిపోతాయి. ఉద్యోగపరంగానే కాకుండా ఆర్థికంగా కూడా స్థిరత్వం లభిస్తుంది. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. ఎదురు చూస్తున్న శుభ వార్తలు వింటారు. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకోవడం జరుగుతుంది.

Follow Us