Shukra Blessings: శుక్రుడి అనుకూలత.. వారికి ప్రేమ, పెళ్లి ప్రయత్నాలు సఫలం..!

Edited By:

Updated on: Jan 19, 2026 | 1:59 PM

Shukra Gochar 2026: జనవరి 13 నుంచి మకర రాశిలో సంచారం చేస్తున్న శుక్రుడు.. ఫిబ్రవరి 6 వరకు అదే రాశిలో కొనసాగుతాడు. శుక్రుడితో ఈ నెల 18 నుంచి రవి, కుజ, బుధ గ్రహాలు కలిసి ఉంటున్నందువల్ల అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. శుభ పరిణామాలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి. ప్రేమ వ్యవహారాలు, పెళ్లి ప్రయత్నాలు, దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతాయి. శృంగార సంబంధమైన ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. మేషం, వృషభం, కర్కాటకం, తుల, ధనుస్సు, మకర రాశులకు ఈ రకమైన అదృష్టం, వైభవం పట్టబోతున్నాయి.

1 / 6
మేషం: ఈ రాశికి దశమ స్థానంలో శుక్ర గ్రహ సంచారం వల్ల ప్రేమ వ్యవహారాలు సుఖ సంతోషాలతో సాగి పోతాయి. ఈ రాశికి చెందిన యువతీ యువకులు విహార యాత్రలు ప్రేమ యాత్రలు ఎక్కు వగా చేసే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నవారికి సానుకూల స్పందన లభిస్తుంది. కొందరికి వివాహేతర సంబంధాలు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. దాంపత్య జీవితంలో ఎలాంటి సమస్యలున్నా తొలగిపోయి, సఖ్యత, సామరస్యం పెరుగుతాయి. సంతాన యోగానికి అవకాశముంది.

2 / 6
వృషభం: రాశ్యధిపతి శుక్రుడు భాగ్య స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారు సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి కుదరడం జరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా పురోగమించడంతో పాటు తప్పకుండా పెళ్లికి, అన్యోన్య దాంపత్యానికి దారితీస్తాయి. అను కోకుండా పెళ్లి సంబంధాలు ఖాయం అవుతాయి. ప్రేమ యాత్రలు ఎక్కువగా జరుగుతాయి. దాంపత్య జీవితంలో ఎటువంటి సమస్యలున్నా తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

3 / 6
కర్కాటకం: ఈ రాశికి సప్తమ స్థానంలో శుక్ర సంచారం వల్ల ఈ రాశివారు తప్పకుండా ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం జరుగుతుంది. ఇప్పటికే ప్రేమల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ప్రేయసీ ప్రియుల మధ్య మధ్యా సాన్నిహిత్యం పెరుగుతుంది. కొద్దిపాటి ప్రయత్నంతో పెళ్లి సంబంధాలు ఖాయం అవుతాయి. ఇష్టమైన వ్యక్తులతో పెళ్లి ఖాయం కావచ్చు. దాంపత్య జీవితంలో సమస్యలు తొలగిపోయి, అన్యోన్యత పెరుగుతుంది. సంతాన ప్రాప్తి కలుగుతుంది.

4 / 6
తుల: రాశ్యధిపతి శుక్రుడు సుఖ సంతోషాలకు సంబంధించిన చతుర్థ స్థానంలో ప్రవేశించడం వల్ల ప్రేమ వ్యవహారాల్లోనూ, పెళ్లి ప్రయత్నాల్లోనూ తప్పకుండా విజయం సాధించడం జరుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో అన్యోన్యత, సామరస్యం పెరుగుతాయి. పెద్దల నుంచి అంగీకారం లభిస్తుంది. బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. దాంపత్య జీవితంలో సఖ్యత పెరుగుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెంది ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. జీవనశైలి మారిపోతుంది.

5 / 6
ధనుస్సు: ఈ రాశికి ద్వితీయ స్థానంలో శుక్ర సంచారం జరుగుతున్నందువల్ల దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు బాగా వృద్ధి చెందుతాయి. జీవితం నిత్య కల్యాణం పచ్చతోరణంగా సాగిపోతుంది. దంపతుల మధ్య ఎటువంటి పొరపచ్చాలు, మనస్పర్థలున్నా తొలగిపోతాయి. ప్రేమ వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. ప్రేమ యాత్రలు, విహార యాత్రలు ఎక్కువగా జరుగుతాయి. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు పెళ్లికి దారితీస్తాయి.

6 / 6
మకరం: ఈ రాశిలో శుక్ర సంచారం వల్ల ఈ రాశివారిలో జనాకర్షణ పెరుగుతుంది. ఈ రాశికి చెందిన యువతీ యువకులు తప్పకుండా ప్రేమల్లో పడడం జరుగుతుంది. ఇప్పటికే ప్రేమ వ్యవహారంలో ఉన్నవారి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. పెళ్లి ప్రయత్నాలు సక్సెస్ అయి, ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి ఖాయమవుతుంది. దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. ప్రేమ యాత్రలు, విహార యాత్రలు ఎక్కువగా జరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.