
మేషం: ఈ రాశికి చతుర్థ స్థానంలో రాశ్యధిపతి కుజుడు ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువును, చంద్రుడిని కలవడం వల్ల రాజయోగాలు, రాజపూజ్యాలు కలుగుతాయి. సన్మానాలు, సత్కారాలు లభిస్తాయి. ధన యోగాలు, ధన ధాన్య సమృద్ధి యోగాలు కలుగుతాయి. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు. కుటుంబంలో శుభకార్యాలకు అవకాశం కలుగుతుంది. ఆర్థిక, వ్యక్తిగత కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

మిథునం: ఈ రాశికి ధన స్థానంలో గురు, కుజ, చంద్రుల కలయిక వల్ల ఆదాయ వృద్ధికి అనేక అవకాశాలు లభిస్తాయి. కుటుంబంలో శుభ కార్యాలకు రంగం సిద్ధమవుతుంది. సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. మాటకు విలువ పెరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఇతర పెట్టుబడులు అంచనాలకు మించి లాభిస్తాయి. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగుతాయి.

కర్కాటకం: రాశ్యధిపతి చంద్రుడు, కుజుడు, ఉచ్ఛ గురువు ఈ రాశిలో కలవడం వల్ల వృత్తి, ఉద్యోగాల్లోనే కాక, సామాజికంగా కూడా రాజయోగాలు కలుగుతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. రాజకీయ ప్రాబల్యం పెరుగుతుంది. అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. త్వరలో గృహ, వాహన యోగాలు కలిగే అవకాశం ఉంది.

తుల: ఈ రాశికి దశమ స్థానంలో గురు, చంద్ర, కుజుల కలయిక జరగడం వల్ల ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ వృద్ధి చెందుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోవడంతో పాటు ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. రాజకీయ ప్రాబల్యం పెరుగుతుంది..

మకరం: ఈ రాశికి సప్తమ స్థానంలో ఉచ్ఛ గురువుతో కుజ, చంద్రులు కలవడం వల్ల ధన యోగాలు, ధనధాన్య సమృద్ధి యోగాలు కలిగే అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో అపార ధనలాభం కలుగుతుంది. రాజకీయాలు, సినిమా రంగం, రియల్ ఎస్టేట్ వంటి రంగాలకు చెందినవారు ఏనుగు కుంభ స్థలాన్నికొడతారు. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు నూరు శాతం సత్ఫలితాలనిస్తాయి. ఉన్నత కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి.

మీనం: రాశ్యధిపతి గురువు ఉచ్ఛ స్థితిలోఉండడంతో పాటు, కుజ, చంద్రులతో యుతి చెందడం వల్ల ఈ రాశివారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆడింది ఆటగా పాడింది పాటగా సాగిపోతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు అపారంగా లాభిస్తాయి. ఏ ప్రయత్నం చేపట్టినా సక్సెస్ అవుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. నిరు ద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధం కుదురుతుంది.