Job Astrology: భాద్రపద మాసంలో ఈ రాశులకు చెందిన ఉద్యోగులకు పట్టిందల్లా బంగారమే..!

Edited By:

Updated on: Sep 10, 2026 | 3:39 PM

సెప్టెంబర్ 11 నుంచి అక్టోబర్ 10 వరకు కొనసాగే భాద్రపద మాసంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించిన మూడు గ్రహాలు రాశులు మారుతున్నాయి. సెప్టెంబర్ 17న రవి కన్యా రాశిలోకి, 18న కుజుడు కర్కాటక రాశిలోకి, బుధుడు 26న తులా రాశిలోకి మారడం జరుగుతోంది. ఈ గ్రహాల మార్పు వల్ల కెరీర్ ప్రభావితమవుతుంది. ఈ గ్రహ సంచారం ప్రకారం ఏడు రాశుల వారికి కెరీర్ లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ప్రభుత్వంలోనూ, విదేశాల్లోనూ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నవారికి కూడా శుభవార్తలు అందుతాయి. మిథునం, కర్కాటకం, కన్య, తుల, ధనుస్సు, మకర రాశులకు ఉద్యోగ జీవితం సమూలంగా మారిపోతుంది.

1 / 6
మిథున రాశి: ఈ రాశికి కుజ, రవి, బుధ గ్రహాలు బాగా అనుకూలంగా మారుతున్నందువల్ల ఈ రాశివారికి ప్రైవేట్ రంగంలో ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో విదేశీ ఉద్యోగం లభించే అవకాశం కూడా ఉంది. ఉద్యోగ రీత్యా విదేశీ ప్రయాణాలు చేయవలసి వస్తుంది. డాక్టర్లు, లాయర్ల వంటి వృత్తులవారికి డిమాండ్ పెరగడంతో పాటు రాబడి కూడా బాగా పెరుగుతుంది. ఏద యినా వ్యాపారంలో ప్రవేశించినా రాణించడం జరుగుతుంది. ఉద్యోగంలో శీఘ్ర పురోగతికి అవకాశం ఉంది.

2 / 6
కర్కాటక రాశి: ఈ రాశిలో దశమాధిపతి కుజుడు ప్రవేశించడం ఒక విశేషం కాగా, తృతీయ స్థానంలో రవి బుధుల సంచారం మరో విశేషం. ఈ రాశివారు ప్రభుత్వ ఉన్నతోద్యోగాలకు ప్రయత్నించడం మంచిది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల్లో రికార్డు స్థాయి విజయాలు సాధిస్తారు. అక్టోబర్ 5 లోపు కొద్ది ప్రయత్నంతో ఉన్నతోద్యోగం లభిస్తుంది. వీరికి విదేశీ ఉద్యోగం లభించడానికి కూడా అవకాశాలున్నాయి. ప్రైవేట్ రంగంలోని ఉద్యోగులకు అధికార యోగం పడుతుంది. వృత్తి, వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి.

3 / 6
కన్య రాశి: ఈ రాశికి రాశ్యధిపతి, దశమ స్థానాధిపతి అయిన బుదుడు ఉచ్ఛ, మిత్ర క్షేత్రాల్లో సంచారం  చేస్తు న్నందువల్ల ఉద్యోగంలో తప్పకుండా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈ రాశికి చెందిన ఉద్యోగులు, నిరుద్యోగులకు ప్రైవేట్ రంగం నుంచే కాక, ప్రభుత్వ రంగం నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. భాద్రపద మాసంలో వీరు ఉద్యోగంలో స్థిరపడతారు. విదేశీ ఉద్యోగాలు లభించే అవ కాశం కూడా ఉంది. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. అధికార యోగం పడుతుంది.

4 / 6
తుల రాశి: రాశ్యధిపతి శుక్రుడితో రవి, కుజులు కూడా అనుకూల సంచారం చేస్తున్నందువల్ల భాద్రపద మాసం ఈ రాశివారికి కెరీర్ పరంగా అదృష్టాలను తీసుకు వస్తుంది. అక్టోబర్ 5 లోగా ఈ రాశివారికి తప్పకుండా తప్పకుండా ఉద్యోగావకాశాలు అంది వస్తాయి. ప్రైవేట్ రంగంలో కానీ, విదేశాల్లో కానీ ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో డిమాండ్ బాగా పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది.

5 / 6
ధనుస్సు రాశి: ఈ రాశికి బుధ, శుక్రుల రాశి మార్పు వల్ల దశమ, లాభస్థానాలు బలపడడంతో ఉద్యోగ జీవితం కొత్త పుంతలు తొక్కుతుంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. ఒక సంస్థలో అగ్ర స్థానం లభించే అవకాశం ఉంది. ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది. ఉద్యోగులకు డిమాండ్ పెరుగు తుంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల్లో విజయాలు సాధించి, ప్రభుత్వ ఉద్యోగంలోకి ప్రవేశించే అవ కాశం ఉంది. ఉద్యోగరీత్యా విదేశాలు వెళ్లవలసి వస్తుంది. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగుతాయి.

6 / 6
మకర రాశి: ఈ రాశికి సప్తమ, భాగ్య, దశమ స్థానాలు రవి, కుజ, బుధులతో బలపడడంతో పాటు, ఉద్యోగ స్థానంలో శుక్రుడు స్వస్థాన సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారికి విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొద్ది ప్రయత్నంతో ప్రైవేట్ రంగంలో ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం కూడా ఉంది. అతి తక్కువ కాలంలో భారీ జీతభత్యాలతో ఉద్యోగంలో స్థిరత్వం లభించే సూచనలున్నాయి. నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా విదేశీ ఆఫర్లు అందే అవకాశం ఉంది.

Loading...
Unable to load recommendations.
Follow Us