
ప్రస్తుతం తనకు మిత్రక్షేత్రమైన మిథున రాశిలో సంచారం చేస్తున్న గ్రహరాజు రవి అక్టోబర్ 15 వరకు తన మిత్ర, స్వక్షేత్రాల్లో సంచారం చేస్తున్నందువల్ల కొన్ని రాశుల వారికి రాజయోగాలు కలిగించే అవకాశం ఉంది. నాయకత్వ లక్షణాలు, దృఢ సంకల్పం, పట్టుదల, సాహసం, ప్రణాళిక, వ్యూహం వంటి లక్షణాలున్న రాశులకు రవి ఊహించని శుభ ఫలితాలనిస్తాడు. తనకు అనుకూలమైన లక్షణాలు కలిగిన మేషం, మిథునం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనూ రాశుల వారికి రవి తప్పకుండా అధికారయోగాన్నిస్తాడు. రాజపూజ్యాలు, ప్రభుత్వం నుంచి గుర్తింపు, రాజకీయ ప్రాబల్యం వంటివి కలుగుతాయి.

మేషం: ఈ రాశికి అధిపతి అయిన కుజుడు రవికి అత్యంత సన్నిహితుడు. ఈ రాశికి మూడవ స్థానం నుంచి ఆరవ స్థానం వరకు నాలుగు నెలల పాటు సంచారం చేస్తున్న రవి వల్ల ఈ రాశివారు కొద్ది ప్రయత్నంతో అత్యధికంగా లాభాలు పొందుతారు. అందలాలు ఎక్కుతారు. ఈ రాశివారిలోని నాయకత్వ లక్షణాలు, కలుపుకునిపోయే తత్వం, పట్టుదల వంటివి బాగా రాణించి రాజయోగా లను కలిగిస్తుంది. ఆదాయంలోనే కాక, వృత్తి, ఉద్యోగాల్లో కూడా ఉన్నత స్థాయికి చేరుకుంటారు.

మిథునం: రాశినాథుడు బుధుడికి అత్యంత సన్నిహితుడైన రవి ప్రస్తుతం ఈ రాశిలోనే సంచారం చేయడం, అక్టోబర్ 15 వరకు మిత్ర, స్వక్షేత్రాల్లో సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారు ఏ ప్రయత్నం తల పెట్టినా విజయవంతం అవుతుంది. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. వీరిలోని ప్రణాళికాబద్ధ మైన జీవితం, పట్టుదల, దూరదృష్టి వల్ల రవి వీరిని అన్ని విధాలా అనుగ్రహిస్తాడు. ఆర్థికంగానే కాక, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా తమ ప్రతిభను నిరూపించుకుని అందలాలు ఎక్కుతారు.

కర్కాటకం: రాశినాథుడైన చంద్రుడికి మిత్రుడైన రవికి ఈ రాశివారిలోని ప్రణాళికాబద్ధమైన జీవితం, దూర దృష్టి, నిర్ణయాత్మక ధోరణి బాగా నచ్చుతాయి. అందువల్ల మరో నాలుగు నెలల పాటు ఈ రాశి వారికి రవి వల్ల అనేక విధాలుగా లాభాలు కలుగుతాయి. ఆదాయాన్ని వృద్ధి చేసుకోగలుగుతారు. ఈ నెల 15 నుంచి జీవితం సానుకూల మలుపులు తిరుగుతుంది. కొద్ది ప్రయత్నంతో అందలాలు ఎక్కుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగుతాయి.

సింహం: రాశినాథుడైన రవి మరో నాలుగు నెలలపాటు అనుకూల సంచారం కూడా చేస్తున్నందువల్ల ఉద్యో గంలో తప్పకుండా పదోన్నతులు కలుగుతాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. ఒక సంస్థకు సర్వాధికారి అయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగులకు అరుదైన ఆఫర్లు, అవకాశాలు అందుతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడు తుంది. అనేక విధాలుగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది.

వృశ్చికం: రాశ్యధిపతి కుజుడితో రవికి ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఈ రాశివారి జీవితంలో కొన్ని ముఖ్య మైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది. సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఆస్తి సమస్యలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం అవు తాయి. రుణ సమస్యలు తీరిపోతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. కుటుంబంలో సుఖసంతోషాలు నెలకొంటాయి. శుభకార్యాలు చేసే అవకాశం ఉంది.

ధనుస్సు: రాశినాథుడైన గురువుతో సాన్నిహిత్యం ఉన్నందువల్ల, ఈ రాశివారిలోని నాయకత్వ లక్షణాలు, పట్టుదల, సాహసం, తెగింపులంటే ఇష్టం ఉన్నందువల్ల రవి ఈ నాలుగు నెలల కాలంలో ఈ రాశి వారికి అనేక విధాలుగా చేయూతనివ్వడం జరుగుతుంది. ఉద్యోగంలో ఉన్నత స్థానాలకు ఎదిగే అవకాశం ఉంది. విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న ఉద్యోగులు, నిరుద్యోగుల కల తప్పకుండా నెరవే రుతుంది. రాజకీయ ప్రాబల్యం బాగా పెరుగుతుంది. ఒకటికి రెండుసార్లు ధనయోగాలు పడతాయి.