
హిందూ మతంలో పవిత్రమైన పండుగల్లో శ్రీరామనవమి ఒకటి. శ్రీ రాముడు చైత్ర మాసంలోని శుక్ల పక్షంలో తొమ్మిదవ రోజు జన్మించాడు. అందువలన ప్రతి సంవత్సరం శుక్లపక్షంలోని తొమ్మిదవ రోజున శ్రీరామ నవమి పండుగను పల్లెల్లో, పట్టణంలో ఘనంగా, భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు.

కాగా, 2026 సంవత్సరంలో శ్రీరామ నవమి ఏ రోజు వచ్చిందనేదానిపై చాలా మందికి గందరగోళం ఉంటుంది. కాగా, ఇప్పుడు మనం దాని గురించి వివరంగా తెలుసుకుందాం. మార్చి 26, 2026 గురువారం ప్రారంభ తిథి, ఈరోజు కొందరు శ్రీరామనవమి వేడుకలను జరుపుకుంటారు.

ఇక 27 మార్చి శుక్రవారం రోజున ఉదయ తిథి సూర్యోదయం తిథిని అనుసరించే వారు ఈ రోజున సంప్రదాయాల ప్రకారం శ్రీరామ నవమి వేడుకను ఆలయాల్లో, చాలా ఘనంగా నిర్వహించుకుంటారు. అంగరంగ వైభవంగా శ్రీరాముడికి ప్రత్యేక పూజలు చేసి, సీతారాముల కళ్యాణం మహోత్సవాన్ని నిర్వహిస్తారు.

అంటే, పండితుల సూచన ప్రకారం, ఈ సంవత్సరం శ్రీరామ నవమి మార్చి 27 శుక్ర వారం రోజున చైత్ర మాసం, శుక్ల పక్షం నవమి రోజు జారుకుంటారు. శ్రీరాముడు మధ్యాహ్నం వేళ , పునర్వసు నక్షత్రం, కర్కాటక లగ్నం, అభిజిత్ ముహూర్తంలో జన్మించాడు అని చెబుతుంటారు కాబట్టి, శుక్ర వారం రోజు 11.30 గంటల నుంచి 1.41 గంటల వరకు శ్రీరాముడి జయంతి పూజలు చేసుకోవచ్చు.

ఇక శ్రీరామ నవమి రోజు ఎవరు అయితే ఉదయం లేచి, స్నానం ఆచరించి, రామనామ జపం చేస్తారో వారికి చాలా పుణ్యం లభిస్తుందని చెబుతుంటారు. నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు