
భారత ప్రామాణిక సమయం ప్రకారం, రెండో సూర్యగ్రహణం ఆగస్టు 12 రాత్రి సమయంలో సంభవిస్తుంది. రాత్రి 9 : 04 గంటలకు ప్రారంభమై ఉదయం 4:25 గంటలకు ముగుస్తుంది. అందువలన ఇది భారత్‌లో కనిపించదు. ఈ గ్రహణం కేవలం గ్రీన్ ల్యాండ్, ఐస్ ల్యాండ్ స్పెయిన్ వంటి దేశాలలో కనిపిస్తుంది. అయితే ఇది నాలుగు రాశులపై చాలా ప్రభావం చూపనున్నదంట. వీలైనంత వరకు వీరు సూర్య గ్రహణం అస్సలే చూడకూడదంట.ఇది ఆరోగ్యంపై ప్రభావం చూపనున్నదంట

మేష రాశి : మేష రాశి వారికి ఈ రెండో సూర్య గ్రహం కష్టాలను తీసుకొస్తుందని చెబుతున్నారు పండితులు. అందువలన వీలైనంత వరకు వీరు అస్సలే ఈ సూర్య గ్రహణాన్ని చూడూడదంట. లేకపోతే ఇది అనేక సమస్యలకు కారణం అవుతుందని వారు హెచ్చిరిస్తున్నారు.

వృషభ రాశి : వృషభ రాశి వారు కూడా వీలైనంత వరకు సూర్యగ్రహణం చూడకపోవడమే మంచిది . ఇది ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలకు కారణం అవుతుంది. అంతే కాకుండా ఇది మీకు మానసిక ఆందోళనను కలిగించే ఛాన్స్ ఉంది. అందువలన వృషభ రాశి వారు కూడా ఆగస్టు 12న ఏర్పడబోయే సూర్య గ్రహణాన్ని చూడకూడదంట.

కన్యా రాశి : కన్యా రాశి వారికి ఈ గ్రహణం అస్సలే మంచిది కాదు, వీరికి అనేక సమస్యలు ఎదురు అవుతాయి. బంధువులు, స్నేహితులతో ఈ రాశుల వారికి విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వీరు మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించడం మంచిది. ఒత్తిడి పెరుగుతుంది. మానసిక ఆందోళనలు అధికం అవుతాయి.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు