Lord Shani Dev: శని అతివక్రంతో వీరికి జాక్‌పాట్..! అదృష్టం తలుపు తట్టడం ఖాయం

Edited By:

Updated on: Sep 11, 2026 | 1:23 PM

Shani Ativakra 2026: మీన రాశిలో వక్రగతిలో సంచరిస్తున్న శనీశ్వరుడు.. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 16 వరకు అతి వక్రగతిలో సంచరించనున్నాడు. ఈ ప్రత్యేక శని సంచారం వల్ల వృషభం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, మకర రాశుల వారికి అనుకూల ఫలితాలు కలిగే అవకాశం ఉందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా ఉద్యోగం, ఆర్థిక పరిస్థితి, పురోగతి వంటి విషయాల్లో శీఘ్ర మార్పులు కనిపించే అవకాశం ఉంది. ఈ సమయంలో శివార్చన, శనికి దీపారాధన చేయడం శుభప్రదంగా భావిస్తారు.

1 / 7
ప్రస్తుతం మీన రాశిలో వక్రించి ఉన్న శనీశ్వరుడు ఈ నెల(సెప్టెంబర్) 17 నుంచి అక్టోబర్ 16 వరకు అదే రాశిలో అతి వక్రం చెందడం జరుగుతోంది. రవి గ్రహానికి ఏడవ స్థానంలో సంచారం చేస్తున్నప్పుడు శనీశ్వరుడికి అతి వక్ర దోషం కలుగుతుంది. సాధారణంగా మందగమనంతో వ్యవహరించే శని అతి వక్రగతిలో మరింత స్వతంత్రంగా, మరింత వేగంగా వ్యవహరిస్తాడు. దీనివల్ల కొన్ని రాశుల వారికి శీఘ్ర పురోగతికి అవకాశం ఉంటుంది. వృషభం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, మకర రాశులవారికి శని అతి వక్ర కాలంలో అనేక అదృష్టాలను కలిగించడం జరుగుతుంది. ఈ రాశుల వారు తరచూ శివార్చన చేయించడం, శనికి దీపం వెలిగించడం చాలా మంచిది.

2 / 7
వృషభం: ఈ రాశికి లాభ స్థానంలో సంచారం చేస్తున్న శని అతిగా వక్రిస్తున్నందువల్ల ఈ రాశివారు ఏ రంగంలో ఉన్నా శీఘ్ర పురోగతి ఉంటుంది. ఉద్యోగపరంగా ఆదాయం వృద్ధి చెందడం, ఉద్యోగంలో పదోన్నతి లభించడం వంటివి చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగు తాయి. మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. విదేశీ సంపాదన యోగం పడుతుంది. నిరుద్యోగులకు అనేక ఆఫర్లు అందుతాయి. ఇష్టమైన ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది.

3 / 7
మిథునం: ఈ రాశికి దశమ స్థానంలో సంచారం చేస్తున్న శనికి అతి వక్రం కలిగినందువల్ల ఉద్యోగంలో కొన్ని కీలకమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా విదేశీ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగంలో శీఘ్ర పురోగతి ఉంటుంది. ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని మించుతాయి. ఉన్నత వర్గాలతో సన్ని హిత సంబంధాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది.

4 / 7
కర్కాటకం: ఈ రాశికి భాగ్యస్థానంలో శని అతి వక్ర సంచారం వల్ల ఈ రాశివారికి ఆస్తిపాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ముఖ్యంగా ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందే అవకాశం ఉంది. విదేశీయానానికి సంబంధించిన ఆటంకాలన్నీ తొలగిపోతాయి. పెళ్లి ప్రయత్నాల్లో కూడా విదేశీ సంబంధం కుదిరే అవకాశం ఉంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది.  వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శీఘ్ర పురోగతి ఉంటుంది.

5 / 7
తుల: ఈ రాశికి అత్యంత శుభుడైన శనీశ్వరుడు షష్ట స్థానంలో అతిగా వక్రించినందువల్ల ఉద్యోగంలో శీఘ్ర పురోగతికి అవకాశం ఉంది. తప్పకుండా అధికార యోగం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభించడంతో పాటు, లాభాలు అంచనాల్ని మించుతాయి. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. అనారోగ్యాల నుంచి బయటపడతారు. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది.

6 / 7
వృశ్చికం: ఈ రాశికి పంచమ స్థానంలో సంచారం చేస్తున్న శని అతి వక్రం చెందినందువల్ల ఏ రంగంలో ఉన్నా రాజయోగాలు కలుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. సామాజికంగా ఊహించని గుర్తింపు లభిస్తుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల వల్ల అంచనాల్ని మించిన లాభాలు కలుగుతాయి. ఆదాయం ఇబ్బడి ముబ్బ డిగా పెరిగే అవకాశం ఉంటుంది. ఎటువంటి ప్రయత్నం చేపట్టినా తప్పకుండా విజయం సాధిస్తారు.

7 / 7
మకరం: ఈ రాశికి అధిపతి, ధనాధిపతి అయిన శనీశ్వరుడు అతిగా వక్రించినందువల్ల దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. అనేక వైపుల నుంచి ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. రావలసిన ధనం చేతికి అందుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. నిరు ద్యోగుల కలలు సాకారం అవుతాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి కుదురుతుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us