Sep 2026 Horoscope: సెప్టెంబర్ నెలలో వీరే మహా అదృష్టవంతులు..! లిస్ట్‌లో మీ రాశి ఉందా?

Edited By:

Updated on: Aug 25, 2026 | 5:54 PM

September 2026 Horoscope: సెప్టెంబర్ నెలలో రవి, బుధ, శుక్ర, కుజ గ్రహాలు రాశుల మారబోతున్నాయి. రవి సెప్టెంబర్ 16న కన్యా రాశిలోకి, శుక్రుడు సెప్టెంబర్ 3 నుంచి స్వస్థామైన తులా రాశిలోకి, బుధుడు 7వ తేదీ నుంచి స్వస్థానమైన కన్యా రాశిలోకి, కుజుడు 19 నుంచి కర్కాటక రాశిలోకి మారడం జరుగుతుంది. ఈ గ్రహాల రాశి మార్పు వల్ల అన్ని రాశుల వారి జీవితాల్లోనూ మార్పులు జరిగే అవకాశం ఉన్నప్ప టికీ ప్రధానంగా కొన్ని రాశుల వారి జీవితాల్లో మాత్రం శుభ యోగాలు ఎక్కువగా చోటు చేసు కుంటాయి. మేషం, మిథునం, కర్కాటకం, తుల, మకరం, మీన రాశుల వారి జీవితాలు గడ్డు పరిస్థితుల నుంచి బయటపడి సుఖ సంతోషాలతో కాలం గడిపే అవకాశం ఉంది.

1 / 6
మేషం: ఈ రాశికి చతుర్థ స్థానంలోకి రాశ్యధిపతి కుజుడు, సప్తమ స్థానంలోకి శుక్రుడు ప్రవేశిస్తున్నందు వల్ల ఈ నెలంతా ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండడంతో పాటు కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. షష్ట స్థానంలో రవి, బుధులు కలవడం వల్ల తప్పకుండా మనసులోని ముఖ్యమైన కోరికలు నెరవేరుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఊహించని శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతులు కలుగుతాయి.

2 / 6
మిథునం: ఈ రాశికి ఈ రవి, బుధ, శుక్రులు బాగా అనుకూలంగా మారుతున్నందువల్ల కొన్ని శుభ పరిణా మాలు జీవితాన్ని మలుపు తిప్పుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఇంట్లో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. అనారోగ్యాల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. ఆస్తి పాస్తులు కలిసి వస్తాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడతాయి.

3 / 6
కర్కాటకం: ఈ రాశిలో కుజుడు, తృతీయ, చతుర్థ స్థానాల్లోకి బుధ, శుక్ర గ్రహాలు ప్రవేశించడం వల్ల ఆకస్మిక ధన లాభానికి, ఆదాయం దిన దినాభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. కుటుంబ సమస్యలుపరి ష్కారమై, ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఇష్టమైన బంధువుల రాకపోకలుంటాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి నిశ్చయమయ్యే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతాయి.

4 / 6
తుల: ఈ రాశిలో రాశ్యధిపతి శుక్రుడు ప్రవేశించడం వల్ల అనేక రకాలుగా అదృష్టాలు కలుగుతాయి. వ్యయ స్థానంలో రవి, బుధుల కలయిక వల్ల విదేశీ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగంలో హోదాలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు నష్టాల నుంచి బయటపడి అభివృద్ధి బాటపడతాయి. నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశీ ఆఫర్లు అందులాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశంఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి.

5 / 6
మకరం: ఈ రాశికి భాగ్య, దశమ స్థానాల్లో శుభ గ్రహాల సంచారం వల్ల ఉద్యోగంలో ఉన్నత స్థానాలు లభి స్తాయి. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. విదేశీయానానికి సంబంధించిన ఆటం కాలు తొలగిపోతాయి. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో కూడా విదేశీ సంబంధం ఖాయమవుతుంది. కుటుంబంలో శుభ  పరిణామాలు చోటు చేసుకుం టాయి. దాంపత్య జీవితం సుఖప్రదంగా సాగిపోతుంది. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది.

6 / 6
మీనం: ఈ రాశికి పంచమంలో కుజుడు ప్రవేశించడం, సప్తమంలో బుధాదిత్య యోగం కలగడం వివాదాలు, విభేదాలు, సమస్యల నుంచి గట్టెక్కడం జరుగుతుంది. వ్యక్తిగత, కుటుంబ సమస్యలు కొద్ది ప్రయత్నంతో పరిష్కారమవుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందడం వల్ల రుణ సమస్యలు  తగ్గుముఖం పడతాయి. అనారోగ్యాల నుంచి ఊరట లభిస్తుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడికి లోటేమీ ఉండదు.

Loading...
Unable to load recommendations.
Follow Us