Real Estate Luck: రియల్ ఎస్టేట్ రంగంలో ఈ రాశుల వారికి లాభాల పంట..!

Edited By:

Updated on: Aug 27, 2026 | 4:06 PM

Real Estate Astrology: జ్యోతిషశాస్త్రం ప్రకారం రియల్ ఎస్టేట్, స్థిరాస్తుల క్రయ విక్రయాల్లో విజయానికి కుజుడి బలం, నాలుగో స్థానం వంటి అంశాలను ముఖ్యంగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో సింహ రాశితో పాటు రవి, కుజుల అనుకూలత ఉన్నవారికి రియల్ ఎస్టేట్ రంగంలో మంచి అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా మేషం, కర్కాటకం, సింహం, తుల, వృశ్చికం, ధనుస్సు రాశుల వారికి వచ్చే మూడు నెలలు భూములు, స్థలాలు, ఇళ్ల క్రయ విక్రయాలు, నిర్మాణ రంగంలో అనుకూల ఫలితాలు ఉండే అవకాశముంది.

1 / 7
రియల్ ఎస్టేట్ లేదా స్థిరాస్తుల క్రయ విక్రయాల్లో విజయాలు సాధించడానికి రవి, కుజులు అనుకూలంగా ఉండాలి. జ్యోతిషశాస్త్రం ప్రకారం సింహ రాశి సహజసిద్దమైన రియల్ ఎస్టేట్ రాశి. రవి, కుజులతో పాటు సింహ రాశి కూడా అనుకూలంగా ఉన్నవారికి ఈ రంగంలో పట్ట పగ్గాలు ఉండవు. వచ్చే మూడు నెలల కాలంలో సింహ రాశితో పాటు, రవి, కుజులు కూడా అనుకూలంగా ఉన్న రాశులు మేషం, కర్కాటకం, సింహం, తుల, వృశ్చికం, ధనుస్సు. పొలాలు, స్థలాలు, ఇళ్ల క్రయ విక్రయాల్ని వ్యాపారంగా చేసుకున్న రియల్ ఎస్టేట్ వారికి, బిల్డర్లకు ఇది అనుకూల సమయం. ఈ రాశులవారికి ఈ రంగంలో లాభాల పంట పండే అవకాశం ఉంది.

2 / 7
మేష రాశి: రాశ్యధిపతి కుజుడు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో అనుకూల స్థానాల్లో సంచారం చేస్తు న్నందువల్ల ఇళ్లు, స్థలాల క్రయ విక్రయాల్లో ఈ రాశివారు తప్పకుండా అంచనాల్ని దాటే అవ కాశం ఉంది. నాయకత్వ లక్షణాలు కలిగి ఉండడంతో పాటు వ్యాపార నైపుణ్యాలు, మాటకారితనం, దూసుకుపోయే తత్వం కలిగిన ఈ రాశివారు వచ్చే మూడు నెలల్లో తప్పకుండా విజయాలు, సాఫల్యాలు సాధించే అవకాశం ఉంది. బిల్డర్లు గానూ, ఇంటీరియర్ డెకరేటర్స్ గానూ స్థిరపడతారు.

3 / 7
కర్కాటక రాశి: ఈ రాశికి కుజ, రవులు సెప్టెంబర్ నెల నుంచి బాగా అనుకూలంగా మారుతున్నందువల్ల రియల్ ఎస్టేట్ రంగంలో ఈ రాశివారు పట్టిందల్లా బంగారం అవుతుంది. అపర కుబేర యోగాలు పట్టడంతో పాటు పేరు ప్రఖ్యాతులు బాగా వ్యాపిస్తాయి. గృహ అవసరాలు, సౌకర్యాల విషయంలో ఆరితేరిన వారయినందువల్ల వీరు ఆధునిక పద్ధతుల ద్వారా ఉన్నత స్థాయికి చేరే అవకాశం ఉంది. వీరికి అక్టోబర్ 31 తర్వాత కూడా ఈ రంగంలో అపారమైన ధన లాభాలు కలిగే అవకాశం కనిపిస్తోంది.

4 / 7
సింహ రాశి: ఈ రాశి రియల్ ఎస్టేట్ రంగానికి సంబందించిన సహజ రాశి అయినందువల్ల ఈ రాశివారు రవి అనుకూలతతో ఈ రంగంలో స్థిరత్వం సంపాదించుకునే అవకాశం ఉంది. ఇళ్లు, పొలాల అమ్మకం, కొనుగోళ్ల విషయంలో వీరు పోటీదార్ల మీద తప్పకుండా పైచేయి సాధిస్తారు. ఈ రంగంలో వీరికి అనేక పర్యాయాలు దన యోగాలు కలగడంతో పాటు రాజయోగాలు కూడా కలుగుతాయి. ఈ రంగంలో వీరు అనేక విధాలుగా రాణించే అవకాశం ఉంది. ఆశించిన గుర్తింపు కూడా లభిస్తుంది.

5 / 7
తులా రాశి: ఈ రాశివారిలో వ్యాపార లక్షణాలు సహజసిద్ధంగా ఉన్నందువల్ల ఇతర వ్యాపారాలతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా బాగా రాణించే అవకాశం ఎక్కువగా ఉంది. ధనాధిపతి కుజుడు, లాభాధిపతి రవి బాగా అనుకూల సంచారం చేస్తున్నందువల్ల స్థిరాస్తుల క్రయ విక్రయాల్లో తమ సత్తాను నిరూపించుకుంటారు. మంచి గుర్తింపుతో పాటు పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. ఇళ్లు, స్థలాల క్రయ విక్రయాల ద్వారా అక్టోబర్ లోపే అపర కుబేరులయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.

6 / 7
వృశ్చిక రాశి: రాశ్యధిపతి కుజుడితో పాటు రవి కూడా సింహ, కన్యా రాశుల్లో అనుకూల సంచారం చేస్తు న్నం దువల్ల ఈ రాశివారికి అక్టోబర్ 17 వరకు ఈ రంగంలో తిరుగులేదు. రియల్ ఎస్టేట్ రంగంలో ఆదాయం బాగా వృద్ది చెందుతుంది. పట్టిందల్లా బంగారమవుతుంది. బిల్డర్లుగానూ, ఇంటీరియర్స్ డెకరేటర్స్ గానూ అభివృద్ధి చెందడంతో పాటు అపారంగా ఆదాయం గడించే అవకాశం ఉంది. వీరికిక ఈ రంగంలో పట్టపగ్గాలుండకపోవచ్చు. పోటీదార్లు, ప్రత్యర్థుల మీద విజయాలు సాధిస్తారు.

7 / 7
ధనుస్సు రాశి: నాయకత్వ లక్షణాలు, ఉన్నత స్థానాలపై ఆశ, దూరదృష్టి కలిగిన ఈ రాశివారు ఏ రంగంలో ఉన్నా రియల్ ఎస్టేట్ మీద కూడా శ్రద్ద పెట్టే అవకాశం ఉంది. ఇళ్లు, స్థలాల క్రయ విక్రయాల్లో త్వరలో అంచనాలకు మించి లాభాలు గడించే అవకాశం ఉంది. భారీ లక్ష్యాలు, భారీ ప్రాజెక్టులతో ఈ రంగంలో రికార్డులు సృష్టించే సూచనలు కనిపిస్తున్నాయి. బిల్డర్లుగా కూడా ఎదిగే అవకాశం ఉంది. వీరు ఎటువంటి ప్రయత్నాలు చేపట్టినా, ప్రయోగాలు చేసినా ఘన విజయాలు సిద్ధిస్తాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us