అరటి పంటకు శ్రావణ శోభ.. రైతుల్లో ఆనందం

Edited By:

Updated on: Aug 22, 2026 | 11:12 AM

గత కొంతకాలంగా ఆర్థిక ఒడిదుడుకులతో అల్లాడిన అరటి వ్యాపారం ఊపందుకుంది. అరటికి అనూహ్య రీతిలో డిమాండ్ పెరగడంతో రైతుల్లో ఆనందం నెలకొంది. ఓవైపు శ్రావణమాసం.. మరోవైపు పండుగలు.. అలాగే పెళ్లిళ్లు గృహప్రవేశాలు వంటి శుభముహూర్తాలుతో ఇక్కడి అరటి పంటకు డిమాండ్ ఏర్పడింది.

1 / 5
 దీంతో జాతీయస్థాయిలో పేరుగాంచిన రావులపాలెంలోని అరటి మార్కెట్లో ఎగుమతులు పెరిగి ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించడంతో రైతులు లాభాలు కళ్ల చూస్తున్నారు. దీంతో కొంతకాలం క్రితం సేద్యం నుంచి తప్పుకోవాలనుకున్న రైతులు మళ్లీ అరటి పండించేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.

2 / 5
రావులపాలెం అరటి మార్కెట్ కు జాతీయ స్థాయిలో పేరు ఉంది. ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలోని రావులపాలెం, కొత్తపేట, ఆలమూరు, ఆత్రేయపురం, అయినవిల్లి, పి.గన్నవరం, పెరవలి, సిద్ధాంతం, ఖండవిల్లి, కడియం, కొవ్వూరు, దొమ్మేరు, తదితర ప్రాంతాల్లో దాదాపు 30 వేల ఎకరాల్లో పండే అరటి ఎగుమతికి రావులపాలెం మార్కెట్ యార్డ్ ప్రధాన కేంద్రంగా నిలుస్తోంది.

3 / 5
ఈ యార్డ్ నుంచి నిత్యం 15 వేల నుంచి 20 వేలు పైబడి అరటి గెలలు ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లోని ముఖ్య పట్టణాలతోపాటు ఒరిస్సా, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలకు ఇక్కడి నుంచి ఎగుమతి అవుతాయి. ఈ ఏడాది తుఫాను, ఈదురు గాలుల ప్రభావంతో అరటి తోటలు నేలకొరగడంతోపాటు మే, జూన్ నెలలో వర్షాలు లేకపోవడంతో చెట్టును ఉన్న గెల తయారవకుండానే ఎండ వేడి తట్టుకోలేక ముగ్గిపోవడం, ఒకవేళ గెల తయారైనా మూడం ప్రభావంతో ఇతర ప్రాంతాల వ్యాపారులు గెలలు కొనేందుకు రావులపాలెం మార్కెట్ యార్డ్ కు రాక ఎగుమతులు తగ్గిపోవడంతో రైతులు నష్టాలను చూశారు.

4 / 5
అయితే శ్రావణ మాసం మొదలుకొని వినాయక చవితి వరకు వరుసగా ముహూర్తాలు, పెళ్లిళ్లు, పండుగలు, గృహప్రవేశాలు, శుభకార్యాలు ఊపందుకోవడంతో ఒక్కసారిగా రావులపాలెం మార్కెట్ యార్డ్ రైతులు, వ్యాపారులతో కళకళలాడుతోంది. నిన్న మొన్నటి వరకు ఒక లోడ్ (ఆరు గెలలు) కర్పూర రకం రూ.1000 నుంచి రూ.1200 పలుకగా నేడు అదే లోడు 2500 నుంచి 3000 వరకూ, రూ.1600 నుంచి రూ.1800 వరకూ ఉన్న చక్రకెళ్లి రూ.3000 నుంచి రూ.3500 వరకు ధర పలుకుతుంది.

5 / 5
అలాగే రూ.2000లకు మించి అమ్ముడుపోని  అమృతపాణి రూ. 3000 దాటి పలకడంతో రైతుల కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. అరటి ఎగుమతులు పెరగడంతో రావులపాలెం అరటి మార్కెట్ యార్డులో ఉపాధి కూడా మెరుగుపడింది. ఇక్కడ కొన్న గెలలను ఇతర ప్రాంతాలకు తరలించాలంటే అరటి గెలలకు చెత్త చుట్టి ఎగుమతి చేస్తారు. ఈ చెత్త చుట్టుపై అనేకమంది, అలాగే చెత్త చుట్టడానికి ఉపయోగించే అరటి ఆకులు సరఫరాదారులకు మంచి డిమాండ్ ఏర్పడింది. దీంతో కూలీలు కూడా ఖాళీ లేకుండా పని చేసుకుంటూ అదనపు ఆదాయాన్ని అర్ధిస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us