
ఈ నెల(ఆగస్టు) 28 నుంచి మూడు రోజుల పాటు కుంభ రాశిలో సంచారం చేస్తున్న చంద్రుడితో రవికి సమ సప్తక దృష్టి కలిగి అరుదైన పౌర్ణమి ఏర్పడింది. చంద్ర, రవుల పరస్పర శుభ వీక్షణతో ఏర్పడిన ఈ పౌర్ణమి వల్ల మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, కుంభ రాశులకు అనేక శుభ యోగాలు అనుభవానికి రావడం జరుగుతుంది. ఈ పౌర్ణమి ఫలితాలు సెప్టెంబర్ 26 (పౌర్ణమి) వరకూ కొనసాగుతాయి. పౌర్ణమి చంద్రుడికి వృద్ది చంద్రుడనే పేరు కూడా ఉన్నందువల్ల ఈ రాశులకు ఆదాయ వృద్ధి, సంపద వృద్ధి, పదోన్నతులు, అధికారం, మంచి పరిచయాలు వంటి అదృష్టాలు కలుగుతాయి. నమ్మకం ఉన్న గురువుకు పూజ చేయడం వల్ల అనేక శుభ ఫలితాలు లభిస్తాయి.

మేషం: ఈ రాశికి పంచమ, లాభ స్థానాల్లో పౌర్ణమి ఏర్పడుతున్నందువల్ల ఈ రాశివారికి ఇంటా బయటా సుఖ సంతోషాలు వర్ధిల్లుతాయి. ఉద్యోగంలో అనుకూలతలు పెరుగుతాయి. ఆశించిన పదోన్నతి లభించే అవకాశం ఉంది. అధికారులు, సహోద్యోగుల నుంచి ఆదరణ పెరుగుతుంది. అనేక మార్గా లలో ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. కుటుంబంలో శుభ కార్యాలు జరిగే సూచనలు న్నాయి. సామాజికంగా హోదా, స్థాయి వృద్ధి చెందుతాయి. అనారోగ్యం నుంచి కొద్దిగా విముక్తి లభిస్తుంది.

వృషభం: ఈ రాశికి చతుర్థ, దశమ స్థానాల్లో పౌర్ణమి ఏర్పడుతున్నందువల్ల ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరగడంతో పాటు ఉన్నత పదవులు లభి స్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. విదేశీయానానికి, విదేశాల్లో ఉద్యోగాలకు అవ కాశం ఉంది. తల్లి వైపు నుంచి సంపద కలిసి వస్తుంది. సంపన్న కుటుంబంతో పెళ్లి నిశ్చయమ వుతుంది. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగుతాయి. వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.

సింహం: ఈ రాశిలో పౌర్ణమి ఏర్పడడం అత్యంత శుభదాయకం అవుతుంది. ప్రతిభా పాటవాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వమూలక ధన లాభం, సత్కారాలకు అవకాశం ఉంది. రాజపూజ్యాలు ఎక్కువగా కలుగుతాయి. పిల్లలు వృద్ధిలోకి రావడం, వారి నుంచి శుభ వార్తలు వినడం జరుగు తుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ప్రముఖులతో పరిచయాలు బాగా వృద్ధి చెందుతాయి. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందే అవకాశముంది.

తుల: ఈ రాశికి పంచమ, లాభ స్థానాల్లో పౌర్ణమి ఏర్పడుతున్నందువల్ల పట్టిందల్లా బంగారమవుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. కుటుంబ సౌఖ్యం వృద్ధి చెందుతుంది. గృహ, వాహన సౌకర్యాలు అమరుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో హోదా, పలుకుబడి పెరుగుతాయి. ఆస్తి సమస్య ఒకటి అనుకూలంగా పరిష్కారం అవుతుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.

ధనుస్సు: ఈ రాశికి తృతీయ, భాగ్య స్థానాల్లో పౌర్ణమి ఏర్పడుతున్నందువల్ల ఉద్యోగులు, నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంతో విదేశాల్లో ఉద్యోగం లభిస్తుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. పిత్రార్జితం లభిస్తుంది. విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురు తుంది. ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. వ్యక్తిగత, కుటుంబ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు నష్టాల నుంచి బయటపడతాయి. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది.

కుంభం: ఈ రాశిలో పౌర్ణమి ఏర్పడుతున్నందువల్ల జీవితంలో ఊహించని పురోగతి ఉంటుంది. రాజ పూజ్యాలు కలుగుతాయి. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. ప్రతిభా పాటవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఉన్నత స్థాయి పరిచయాలు వృద్ది చెందుతాయి. కుటుంబ జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. నిరుద్యోగులు, ఉద్యో గులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలు వెళ్లడం కూడా జరుగుతుంది.