
మిథునం: ఈ రాశికి దశమ, పంచమ స్థానాల్లోని శని, శుక్ర, బుధ గ్రహాలు వక్ర సంచారం చేయడం వల్ల ఆర్థిక, ఉద్యోగ సంబంధమైన అదృష్టాలు కలుగుతాయి. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. అధికారులు, యజమానుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయ వంతమవుతుంది. ఆర్థిక ప్రయత్నాలు నూరు శాతం ఫలితాలనిస్తాయి. సంపద బాగా వృద్ధి చెందు తుంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. రావలసిన సొమ్ము అందుతాయి.

కర్కాటకం: ఈ రాశికి చతుర్థంలో ఉన్న శుక్ర, బుధులు, భాగ్య స్థానంలో ఉన్న శని వక్రించడం వల్ల ఎటువంటి విదేశీ ప్రయత్నాలు చేపట్టినా సక్సెస్ అవుతాయి. విదేశీ సంపాదన యోగం పడు తుంది. పిత్రార్జితం లభిస్తుంది. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారమై విలువైన ఆస్తి చేతికి అందుతుంది. ఆదాయ ప్రయత్నాలన్నీ రెట్టింపు ఫలితాలనిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాల్ని దాటుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు రెట్టింపవుతాయి. శుభవార్తలు ఎక్కువగా వింటారు.

కన్య: రాశ్యధిపతి బుధుడితో పాటు శని, శుక్ర గ్రహాలు కూడా వక్రించడం వల్ల ఈ రాశివారికి ధన యోగాలు, రాజయోగాలు ఎక్కువగా కలుగుతాయి. అనేక విధాలుగా ఆదాయం వృద్ది చెంది ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగంలో జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. సొంత ఇంటి కల, విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న కల తప్పకుండా నెరవేరుతాయి.. షేర్లు, స్పెక్యులేషన్లు విశేషంగా లాభిస్తాయి. ఆర్థిక వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.

తుల: రాశ్యధిపతి శుక్రుడు, భాగ్యాధిపతి బుధుడు, ఈ రాశికి అత్యంత శుభుడైన శనీశ్వరుడు వక్రించడం వల్ల సుమారు నెల రోజుల పాటు ఈ రాశివారి జీవితం ఉజ్వలంగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యో గాల్లో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. ఉన్నత పదవులు లభిస్తాయి. జీతభత్యాలు బాగా పెరు గుతాయి. వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఇతరులకు ఆర్థిక సహాయం చేయగల స్థితిలో ఉంటారు. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి.

మకరం: రాశ్యధిపతి శనితో పాటు, దశమంలో శుక్రుడు, బుధుడు కూడా వక్రించడం వల్ల ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమవుతుంది. రాజయోగాలు, ధన యోగాలు ఎక్కువగా కలగడానికి అవకాశం ఉంది. షేర్లు, ఆర్థిక లావాదేవీలతో పాటు అనేక మార్గాలో ఆదాయం వృద్ధి చెందడంతో పాటు జీత భత్యాలు పెరగడం, రాబడి అంచనాల్ని మించడం వంటివి కూడా జరిగే అవకాశం ఉంది. పేరు ప్రతిష్ఠలు విస్తరిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులు కలుగుతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.

కుంభం: రాశ్యధిపతి శని ధన స్థానంలో, శుక్ర, బుధులు భాగ్య స్థానంలో వక్రించడం ఈ రాశివారికి అనేక విధాలుగా అదృష్టాలను తీసుకువస్తుంది. ప్రతి పనీ, ప్రతి ప్రయత్నమూ విజయవంతం అవుతుంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా సఫలమవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికార యోగం పట్టే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల అపార లాభాలు కలుగుతాయి. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారమవుతుంది.