Rare Maha Yogas: అబ్బబ్బా.. మూడు మహా యాగాలు.. వీరికి పట్టిందల్లా బంగారమే..!

Edited By:

Updated on: Oct 07, 2026 | 1:25 PM

ఒక్కొక్కసారి గ్రహ చారంలో ఎన్నడూ లేని విధంగా కొన్ని అరుదైన మహా యోగాలు చోటు చేసుకుంటాయి. ఇటువంటి యోగ కాలం గురించి ముందే తెలిసినప్పుడు ఆ సమయంలో కొత్త కార్యక్రమాలు, ప్రయత్నాలు చేపట్టే పక్షంలో అవి తప్పకుండా గ్రాండ్ సక్సెస్ అవుతాయి. ఈ నెల (అక్టోబర్) 11, 12, 13 తేదీల్లో తులా రాశిలో రాశ్యధిపతి శుక్రుడు, బుధుడు, చంద్రుడు యుతి చెందడం జరుగుతోంది. బుధ, శుక్రులతో చంద్రుడు కలవడం వల్ల ధన ధాన్య సమృద్ధి యోగం, గురు, కుజులతో చంద్రుడి కేంద్ర స్థితి వల్ల గజకేసరి, చంద్ర మంగళ యోగాలు కలుగుతాయి. వీటి వల్ల మేషం, మిథునం, కర్కాటకం, కన్య, తుల, మకర రాశుల వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది.

1 / 6
మేషం: కొత్త ప్రయత్నాలు, కార్యక్రమాలు చేపట్టడానికి ఈ రాశివారికి ఇంతకన్నా మంచి సమయం ఉండ కపోవచ్చు. ఆదాయాన్ని వృద్ధి చేసుకోవడానికి ఎంత ప్రయత్నిస్తే అంత మంచిది. వృత్తి, వ్యాపా రాల్లో మార్పులు చేపట్టి బాగా లబ్ధి పొందే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావా దేవీలు, వడ్డీ వ్యాపారాలు అంచనాల్ని మించి లాభిస్తాయి. వివాదంలో ఉన్న ఆస్తి చేతికి అందే అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో విదేశీ సంపాదన యోగం కూడా తప్పకుండా పడుతుంది.

2 / 6
మిథునం: ఈ రాశికి ధన, పంచమ స్థానాల్లో కలుగుతున్న ఈ మూడు మహా భాగ్య యోగాల వల్ల అపర కుబేర యోగం పట్టే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు అంచనాల్ని మించి లాభించడంతో పాటు ఆకస్మిక ధన లాభం కూడా ప్రాప్తిస్తుంది. రాజయోగాలు, రాజపూజ్యాలు కలుగుతాయి.  సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి నిశ్చయం కావడం జరుగు తుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది.

3 / 6
కర్కాటకం: ఈ రాశిలో ఉన్న గురు, కుజులు, చతుర్థ స్థానంలో ఉన్న శుక్ర, బుధులతో ఈ రాశినాథుడు చంద్రు డికి కలిగిన మూడు మహా భాగ్య యోగాల వల్ల ఈ రాశివారికి ఆకస్మిక ధన ప్రాప్తికి బాగా అవ కాశం ఉంది. షేర్లు, ఆర్థిక లావాదేవీలు, లాటరీల వల్ల ధన వృద్ధి కలుగుతుంది. భారీ జీతభత్యాలు, హోదాతో కూడిన ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమై విలువైన ఆస్తి లభిస్తుంది.

4 / 6
కన్య: ధన, లాభ స్థానాల్లో ఈ మూడు మహా భాగ్య యోగాలు చోటు చేసుకున్నందువల్ల ఈ రాశివారికి విపరీత రాజయోగాలు, ధన యోగాలు కలుగుతాయి. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. అంచనాల్ని మించి జీతభత్యాలు పెరుగుతాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవ కాశం ఉంది. నిరుద్యోగులకు అనేక ఆఫర్లు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని దాటుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల వల్ల ఆశించిన ధన లాభాలు కలుగుతాయి.

5 / 6
తుల: ఈ రాశిలో ఉన్న బుధ, శుక్రులతోనూ, దశమంలో ఉన్న గురు, కుజులతోనూ ఈ మూడు మహా యోగాలు చోటు చేసుకున్నందువల్ల రాజయోగాలు, రాజపూజ్యాలు బాగా పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లోనే కాక, సామాజికంగా కూడా హోదా, స్థాయి పెరుగుతాయి. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా బయటపడతారు. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. సొంత ఇల్లు అమరే అవకాశం కూడా ఉంది.

6 / 6
మకరం: ఈ రాశికి సప్తమ, దశమ కేంద్రాల్లో ఈ మూడు యోగాలు చోటు చేసుకున్నందు వల్ల ఈ రాశి వారు అత్యధికంగా లబ్ధి పొందే అవకాశం ఉంది. ఆదాయ వృద్ధికి ఎంత ప్రయత్నిస్తే అంతమంచిది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరడంతో పాటు, ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. సొంత ఇంటి ప్రయత్నాలకు ఇది బాగా అనుకూల సమయం. ఉద్యోగంలో తప్పకుండా  పదోన్నతి కలుగుతుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us