
నట్స్ బర్ఫీ : చాలా మంది ఈ మధ్య కాలంలో ఎక్కువగా బర్ఫీలు తయారు చేసుకుంటున్నారు. ఇక వీటిని తయారు చేయడానికి పాలు పంచదార సహజం. అయితే ఇప్పుడు మనం చక్కెర తక్కువగా ఉండే నట్స్ బర్పీనీ తయారు చేసుకొని తినడం వలన ఇందులో షుగర్ తక్కువగా ఉంటుందంట.

కేసర్ పిస్తా ఫిర్ని: ఫిర్నీ అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉంటారు. చక్కెర గురించి ఆలోచించకుండా చాలా మంది దీనిని తింటారు. అయితే ఈ సారి మీరు రాఖీ పండుగ సందర్భంగా ఈ తక్కువ షుగర్ ఉండే కేసర్ పిస్తా ఫిర్ని ఉపయోగించడం చాలా మంచిది.

మోదక్ : చాలా వరకు మోదకాలు గణేశుడికి మాత్రమే ప్రియమైనవి అనుకుంటారు. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అయితే చక్కెర లేకుండా బెల్లంతో కూడా దీనిని తయారు చేయవచ్చును. రాఖీ పండుగ రోజు మీరు తక్కువ చక్కెర ఉన్న స్వీట్ తినాలి అనుకుంటే ఇది బెస్ట్.

డ్రై ఫ్రూట్ లడ్డూ : డ్రై ఫ్రూట్ లడ్డూ ఎవరికి ఇష్టం ఉండదు. ఆరోగ్యానికి ఇది చాలా మంచిది అందువలన, చక్కెర పూర్తిగా తినని వారు ఈ రాఖీకి డ్రై ఫ్రూట్ లడ్డూ తింటూ పండుగను మరింత ఆనందంగా జరుపుకోవచ్చును.

చిలకడదుంప శ్రీఖండ్ : చాలా రుచికరమైన దానిలో చిలకడదుంప శ్రీఖండ్ కూడా ఒకటి. అయితే దీనిని గడ్డ పెరుగు, పంచదారతో తయారు చేస్తారు. అయితే దీనిని తయారు చేయడానికి చాలా తక్కువ మొత్తంలో చక్కెర అవసరం అవుతుంది కాబట్టి, మీరు స్వీట్ తక్కువ తినే వారు అయితే ఇది బెస్ట్.