రక్షాబంధన్.. రాఖీ కట్టే సమయంలో చేయకూడని, చేయాల్సిన పనులివే!

Updated on: Aug 26, 2026 | 4:23 PM

ఆగస్టు 28న రక్షాబంధన్ వచ్చేస్తుంది. అన్నా చెళ్లల్ల ప్రేమకు ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారు. ఈ రోజున సోదరీమణులు తమ సోదరులకు ప్రేమగా రాఖీ కడుతారు. ఇక సోదరులు తమ సోదరీమణులకు బహుమతులు ఇచ్చి జీవితాంతం వారికి ఏ కష్టం రాకుండా చూసుకుంటూ, వారికి అండగా ఉంటాం అని వాగ్దానం చేస్తారు. అయితే ఈ పవిత్రమైన పండుగ రోజు కొన్ని రకాల పనులు అస్సలే చేయకూడదంట. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

1 / 5
రక్షా బంధన్ రోజు అస్సలే చేయకూడని పనులు ఏవి అంటే. ఈ రోజు మీ సోదరుడికి రాఖీ కట్టేటప్పుడు దక్షిణం వైపు ముఖం పెట్టకూడదు. అలాగే తల కప్పుకోకుండా రాఖీ కట్టకూడదంట. కొంత మంది అపరిశుభ్రమైన , మురికి ప్రదేశాలలో వేడుకలు నిర్వహించుకుంటారు. అయితే అలాంటి ప్రదేశంలో ఎట్టిపరిస్థితుల్లో రాఖీ కట్టకూడదు.

2 / 5
అంతే కాకుండా ఎప్పుడూ రాఖీ కట్టినా సరే, సమయం చూసుకోవడం చాలా అవసరం, అందువలన భద్రకాలం, రాహు కాలం వంటి అశుభ సమయాల్లో రక్షాబంధన్ వేడుకలు జరుపుకోకూడదు. అదే విధంగా నలుపు రంగులో ఉన్న రాఖీలు, అశుభ చిహ్నాలు ఉన్న రాఖీలను మీ సోదరుడి చేతికి కట్టకూడదు. అంతే కాకుండా ఎడమ చేతికి కూడా అస్సలే రాఖీ కట్టకూడదు. అలాగే పదునైన వస్తువులను మీ సోదరులకు బహుమతిగా ఇవ్వకూడదు.

3 / 5
రక్షా బంధన్ రోజు తప్పకుండా చేయాల్సిన పనుల్లోకి వెళ్లితే, ఈ రోజు తప్పకుండా మీ సోదరులతో కలిసి ఆలయాన్ని సందర్శించడం చాలా మంచిది. అంతే కాకుండా సోదరులకు తూర్పు లేదా ఉత్తర దిశ వైపు ముఖం పెట్టి రాఖీ కట్టేలా చూసుకోవాలి. రాఖీ కట్టడానికి ముందు హారతి ఇవ్వడం అస్సలే మర్చిపోకూడదు.

4 / 5
అంతే కాకుండా మీ సోదరుడికి రాఖీ కట్టే ముందు గణేశుడికి, ఇతర దేవతలకు రాఖీ కట్టి, వారికి కట్టాలి. ఎప్పుడూ కూడా రాఖీ పసుపు, కుంకుమ రంగులో ఉండేలా చూసుకవాలి. ఓం, స్వస్తిక్ గుర్తులు ఉన్న రాఖీలను ఎంచుకోవడం చాలా మంచిది. ప్రేమగా రాఖీ కట్టాలి. ఎల్లప్పుడూ కుడిచేతి మణికట్టుపైనే రాఖీ కట్టాలి.

5 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Loading...
Unable to load recommendations.
Follow Us