
వృషభం: తన గురువైన శుక్రుడికి చెందిన వృషభ రాశివారికి రాహువు ఉద్యోగ సంబంధమైన విషయాల్లో శుభయోగాలనుకలిగించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ రాశికి దశమ స్థానంలో ఉన్న రాహువు ఈ రాశివారికి ఉన్నత పదవులను ఇవ్వడం, ఉద్యోగం విషయంలో మనసులోని కోరికలను చాలా వరకు నెరవేర్చడం జరుగుతాయి. రాహువు విదేశీ సంపాదనను కూడా అనుగ్రహిస్తాడు. ఉద్యో గంలో జీతభత్యాలు పెంచడం, వృత్తి, వ్యాపారాల్ని లాభాల బాటపట్టించడం వంటివి జరుగుతాయి.

సింహం: ఈ రాశికి సప్తమంలో సంచారం చేస్తున్న రాహువు సర్వస్వతంత్రంగా వ్యవహరించి రాజ యోగా లనివ్వడం జరుగుతుంది. ఈ రాశివారు ఆర్థికంగా, సామాజికంగా ఎదగడానికి అవకాశాలను ఇస్తాడు. కుంభ రాశి నుంచి నిష్క్రమించే లోగా, ఉద్యోగంలోనే కాక, రాజకీయంగా కూడా ప్రాబల్యం పెరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేయ డానికి అవకాశం లభిస్తుంది. ఒకటికి రెండుసార్లు ఆకస్మిక ధన ప్రాప్తి కలిగే అవకాశం బాగా ఉంది.

కన్య: ఈ రాశికి షష్ట స్థానంలో సంచారం చేస్తున్న రాహువు రాశినాథుడైన బుధుడికి మిత్రుడైనందువల్ల ఈ రాశివారికి ధన ధాన్యాలకు లోటు ఉండని పరిస్థితి కలుగుతుంది. శీఘ్రగతిన పదోన్నతులు లభిస్తాయి. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఇతర దేశాల్లో ఉద్యోగం సంపాదించుకో వడానికి, అక్కడే స్థిరపడడానికి అవకాశాలు లభిస్తాయి. సంపన్న వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి సంబంధం కుదరడం వంటివి తప్పకుండా జరుగుతాయి. శుభవార్తలు ఎక్కువగా వింటారు.

తుల: ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడి పట్ల రాహువుకు గురు భావం ఉన్నందువల్ల ఈ రాశివారికి రాహువు పూర్తి స్థాయిలో అదృష్టాలు కలిగిస్తాడు. ఈ రాశికి పంచమ స్థానంలో ఉన్న రాహువు సగటు వ్యక్తిని సైతం సంపన్నుడిని చేయడం జరుగు తుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. గౌరవ మర్యాదలకు, స్థితిగతులకు లోటుండదు. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు అంది వస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి.

మకరం: ఈ రాశికి అధిపతి అయిన శనీశ్వరుడు రాహువుకు మిత్ర గ్రహం అయినందు వల్ల ఈ రాశివారిని రాహువు అనేక విధాలుగా అనుగ్రహించడం, ఆదుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ రాశివారికి రాహువు ధన స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతుంది. కుటుంబంలో శుభకార్యాలు చోటు చేసుకుంటాయి. సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. అనారోగ్య సమస్యల నుంచి బయపడతారు. ఆకస్మిక ధనప్రాప్తికి కూడా బాగా అవకాశం ఉంది.

కుంభం: రాశినాథుడైన శని రాహువుకు మిత్రుడయినందువల్ల రాహువు ఈ రాశివారికి వృద్ధిలోకి రావడా నికి అనేక అవకాశాలు కల్పిస్తాడు. ప్రస్తుతం కుంభ రాశిలోనే ఉన్న రాహువు ఈ రాశి వారిని ఉద్యోగపరంగా తప్పకుండా ఉచ్ఛ స్థితికి తీసుకు వెళ్లే అవకాశం ఉంది. ఉద్యోగంలో పదో న్నతులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల దశ తిరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. విదేశీ సొమ్ము అనుభవించే యోగం కూడా పడుతుంది.