Raja Yoga: ఈ రాశుల వారికి అఖండ రాజయోగం.. పట్టిందల్లా బంగారం..!

Edited By:

Updated on: Feb 01, 2026 | 6:01 PM

జ్యోతిషశాస్త్రం ప్రకారం జ్ఞాన కారకుడైన గురువు విజ్ఞాన కారకుడైన బుధుడిని నవమ దృష్టితో వీక్షించే పక్షంలో రాజయోగం, అధికార యోగం, ధన యోగం కలుగుతాయి.. ఈ రెండు గ్రహాల మధ్య త్రికోణ సంబంధం ఏర్పడడం కలలో కూడా ఊహించని పురోగతిని సూచిస్తుంది. ఫిబ్రవరి 4న కుంభ రాశిలో ప్రవేశించి రెండునెలల పాటు అక్కడే ఉండబోతున్న బుధుడిని మిథున రాశి నుంచి గురువు వీక్షించడం వల్ల కొద్ది ప్రయత్నంతో జీవితం అనేక విధాలుగా పురోగతి చెందుతుంది. దీనివల్ల మేషం, వృషభం, మిథునం, సింహం, తుల, కుంభ రాశులకు పట్టిందల్లా బంగారం అవుతుంది.

1 / 6
మేషం: ఈ రాశికి లాభ స్థానంలో ప్రవేశించిన బుధుడిని గురువు వీక్షించడం వల్ల ఈ రాశివారికి మార్చి నెలాఖరు వరకు ఆదాయం పెరగడమే కానీ, తగ్గడం ఉండదు. ఉద్యోగంలో అధికార యోగం పట్టే అవకాశం ఉంది. నిరుద్యోగులకు సొంత ఊర్లో ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. అత్యంత ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఆస్తిపాస్తుల సమస్యలు, వివాదాలు బాగా అనుకూలంగా పరిష్కారమవుతాయి.

2 / 6
వృషభం: ఈ రాశికి ధనాధిపతి అయిన బుధుడు దశమ స్థానంలో సంచారం చేయడం, దాన్ని ధన స్థానం నుంచి గురువు వీక్షించడం వల్ల అపార ధన లాభం కలిగే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు, వడ్డీ వ్యాపారాల వంటివి విశేషంగా లాభిస్తాయి. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. మీ వల్ల మీరు ఉద్యోగ సంస్థకు లాభాలు బాగా పెరుగుతాయి. మీ సలహాలు, సూచనల వల్ల అధికారులు బాగా లబ్ధి పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు.

3 / 6
మిథునం: ఈ రాశికి భాగ్య స్థానంలో ఉన్న రాశ్యధిపతి బుధుడిని గురువు వీక్షించడం వల్ల ఆదాయానికి లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోవడంతో పాటు ఆర్థిక సమస్యలు దాదాపు పూర్తిగా పరిష్కారమవుతాయి. ఒక ప్రముఖుడుగా గుర్తింపు పొందే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఒక ఉన్నత స్థితి లభించే అవకాశం ఉంది. అనారోగ్యాల నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో విదేశీ అవకాశాలు లభిస్తాయి. పిత్రార్జితం పొందుతారు.

4 / 6
సింహం: ఈ రాశికి సప్తమ స్థానంలో ఉన్న ధన, లాభాధిపతి బుధుడిని ధన కారకుడు గురువు చూడడం వల్ల ఉద్యోగంలో రాజయోగాలు కలుగుతాయి. రాజపూజ్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఒకటికి రెండుసార్లు ధన యోగాలు పట్టే అవకాశం ఉంది. పదోన్నతులకు, అధికార యోగానికి అవకాశం ఉంది. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. విదేశీ సంపాదన అనుభవించే యోగం ఉంది. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతుంది.

5 / 6
తుల: ఈ రాశికి పంచమ స్థానంలో ప్రవేశించిన బుధుడిని భాగ్య స్థానం నుంచి గురువు వీక్షించడం వల్ల అనేక విధాలుగా అదృష్టం పడుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. అనేక విధాలుగా సంపద వృద్ధి చెందుతుంది. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. సంతాన యోగం కలిగే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది.

6 / 6
కుంభం: ఈ రాశిలో ప్రవేశించిన బుధుడిని పంచమ స్థానం నుంచి ధనాధిపతి గురువు చూడడం వల్ల ఆదా యం బాగా వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు, వడ్డీ వ్యాపారాల వల్ల అంచనాలకు మించిన లాభాలు కలుగుతాయి. పిల్లలు విజయాలు సాధిస్తారు. సంతాన యోగా నికి అవకాశం ఉంది. ఉద్యోగంలో సమర్థతకు గుర్తింపు లభించడంతో పాటు ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు బాగా లాభిస్తాయి. ఏ ప్రయత్నం చేపట్టినా సఫలమవుతుంది.