
వృషభం: ఈ రాశికి దశమ స్థానంలో కుజుడి సంచారం వల్ల ఈ రాశివారికి దిగ్బల యోగం పట్టింది. దీనివల్ల ఉద్యోగంలో తప్పకుండా అధికార యోగం పడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. సామాజికంగా కూడా హోదా, స్థాయి పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు కలుగుతాయి. ఉన్నత స్థాయి జీవన శైలికి అవకాశం ఉంది. పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం జరుగుతుంది. ఆదాయం దినదినాభివృద్ధి చెందుతుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది.

మిథునం: ఈ రాశిలో గురువు సంచారం, దశమ స్థానంలో రవి సంచారం వల్ల ఈ రాశివారికి రెండు విధాలుగా దిగ్బల రాజయోగం కలిగింది. జూన్ మొదటి వారం వరకు కొనసాగే ఈ యోగం వల్ల ఈ రాశి వారికి ఉద్యోగంలో రాజయోగాలు కలుగుతాయి. జీవితం నల్లేరు కాయల మీద బండిలా సాగిపోతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. గృహ, వాహన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమై విలువైన ఆస్తి లభిస్తుంది.

కన్య: ఈ రాశికి సప్తమ స్థానంలో శనీశ్వరుడి సంచారం వల్ల ఈ రాశివారికి దిగ్బల రాజయోగం కలిగింది. ఈ యోగం వల్ల ఉద్యోగంలో అందలాలు ఎక్కడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఊహించని ఆదాయ వృద్ధి ఉంటుంది. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులతో పరిచయాలు పెరుగుతాయి. ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి ఖాయమవుతుంది. సంపన్న వ్యక్తితో ప్రేమలో పడే అవకాశం ఉంటుంది.

మకరం: ఈ రాశివారికి చతుర్థ స్థానంలో శుక్ర సంచారం వల్ల దిగ్బల యోగం పట్టింది. దీనివల్ల ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా ఇతర దేశాలకు వెళ్లే అవకాశం లభిస్తుంది. ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతికి ఆస్కారముంటుంది. నిరుద్యోగులకు కలలో కూడా ఊహించని ఉద్యోగం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్లను మించిపోవడం జరుగుతుంది. రాజకీయ ప్రముఖులతో, ఉన్నత వర్గాలతో సఖ్యత ఏర్పడుతుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది.

కుంభం: ఈ రాశిలో బుధ సంచారం వల్ల దిగ్బలం కలిగింది. ఏప్రిల్ 11 వరకు పని చేసే ఈ యోగం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాధాన్యం బాగా పెరుగుతాయి. ప్రతిభ, నైపుణ్యాలు వృద్ధి చెందు తాయి. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. ఆదాయ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఉద్యోగులకు విదేశాల నుంచి ఊహించని ఆఫర్లు, ఆహ్వానాలు అందే అవకాశం ఉంది.