Yoga Dasa: నాలుగు గ్రహాల కటాక్షం..ఇక ఆ రాశుల వారి దశ తిరిగినట్టే..! ఇందులో మీ రాశి ఉందా?

Edited By:

Updated on: Jan 17, 2026 | 4:33 PM

జనవరి నెలలో రాశులు మారిన శుక్ర, కుజ, రవి, బుధుల వల్ల ఈ నెల 18 నుంచి కొన్ని రాశుల వారికి దశ తిరగడం ప్రారంభమైంది. సమయం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఎంత ఎక్కువగా సద్వినియోగం చేసుకుంటే అంత మంచిది. కొత్త నిర్ణయాలు, కొత్త ప్రయత్నాలు, కొత్త కార్యక్రమాలు బాగా కలిసి వస్తాయి. మేషం, వృషభం, కర్కాటకం, తుల, ధనుస్సు, మకర రాశుల వారు తమ తమ రంగాల్లో అంచనాలకు మించిన పురోగతి సాధించడం, సంపన్నులు, ప్రముఖులు, అధికారులు, అధిపతులు, ఆరోగ్యవంతులు కావడం తప్పకుండా జరుగుతుంది.

1 / 6
మేషం: రాశ్యధిపతి కుజుడితో పాటు, గురు, శుక్ర, రవి, రాహువులు బాగా అనుకూల సంచారం చేస్తున్నందువల్ల దాదాపు జూన్ వరకు ఈ రాశివారికి జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. ఆదాయ వృద్ధి, ఉద్యోగం, పెళ్లి, ఆరోగ్య ప్రయత్నాలు తప్పకుండా విజయవంతం అవుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు, ఆస్తుల క్రయ విక్రయాల ద్వారా ఆశించినంతగా సంపద పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది.

2 / 6
వృషభం: ఈ రాశికి అత్యంత శుభ గ్రహాలైన రవి, శని, బుధ, శుక్ర గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందు వల్ల  మరో ఆరు నెలల పాటు ఈ రాశివారు మహర్దశను అనుభవిస్తారు. రాజయోగాలు, ధన యోగాలు కలగడంతో పాటు రాజపూజ్యాలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం, ప్రాధాన్యం బాగా వృద్ధి చెందుతాయి. ఒక సంస్థకు అధిపతి అయ్యే అవకాశం కూడా ఉంది. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. ఒక ప్రముఖుడుగా గుర్తింపు లభిస్తుంది. అనేక విధాలుగా సంపద పెరుగుతుంది.

3 / 6
కర్కాటకం: ఈ రాశివారికి గురు, శుక్ర, బుధ, రవి, కుజ, రాహువులు కూడా అనుకూలంగా మారడం వల్ల తప్పకుండా జీవితంలో శీఘ్ర పురోగతి ఉంటుంది. రాజకీయ ప్రాబల్యం వృద్ధి చెందుతుంది. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. సహాయ కార్యక్రమాల ద్వారా కీర్తి ప్రతిష్ఠలు పెరిగే అవకాశం ఉంది. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికార యోగం పడుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఒకటి రెండుసార్లు ధన యోగాలు పడతాయి.

4 / 6
తుల: ఈ రాశివారికి బుధ, శుక్ర, శని, రవి, గురువులు అనుకూల సంచారం చేస్తుండడంతో ఆరు నెలల పాటు ఈ రాశివారికి తిరుగుండదు. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమై ఆస్తి లాభం, భూలాభం కలుగుతాయి. షేర్లు, స్టాకులు, ఆర్థిక లావాదేవీలతో సహా అనేక మార్గాల్లో ఆదాయం బాగా పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లోనే కాక సామాజికంగా కూడా హోదా, స్థాయి బాగా వృద్ధి చెందుతాయి. కీర్తి ప్రతిష్ఠలు బాగా పెరుగుతాయి.

5 / 6
ధనుస్సు: రాశ్యధిపతి గురువుతో పాటు, రాహువు, రవి, బుద, శుక్ర, కుజులు కూడా అనుకూల స్థానాల్లో సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారికి రాజయోగాలు, ధన యోగాలు కలుగుతాయి. అన్ని వైపుల నుంచి ఊహించని ధన లాభాలు కలుగుతాయి. అత్యున్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. జీవితం పూర్తిగా మారిపోతుంది. రాజకీయాల్లో ఉన్నవారికి తప్పకుండా అధికార యోగం పడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో హోదా, స్థాయితో పాటు ప్రాభవం కూడా పెరుగుతుంది.

6 / 6
మకరం: ఈ రాశికి రాశ్యధిపతి శనితో పాటు రాహువు, శుక్ర, బుధ, రవి, గురువుల అనుకూలత వల్ల ఏ రంగంలో ఉన్నా అందలాలు ఎక్కుతారు. ఆదాయం బాగా కలిసి వస్తుంది. ధన యోగాలు కలుగుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. రాజకీయంగా ప్రాబల్యం పెరుగుతుంది. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నతాధికార యోగం పడుతుంది. నిరుద్యోగులకు అరుదైన ఆఫర్లు అందుతాయి.