
వృషభం: ఈ రాశికి చతుర్థ, దశమ స్థానాలలో చంద్ర గ్రహణం ఏర్పడుతున్నందువల్ల ఉద్యోగానికి సంబం ధించి మానసికంగా కొద్దిగా ఆందోళన, అలజడి ఉంటాయి. అనవసర భయాలు, అనుమానాలు ఇబ్బంది పెట్టవచ్చు. గ్రహణం రోజున ఈ రాశివారు కొత్త నిర్ణయాలు తీసుకోకపోవడం, కొత్త ప్రయ త్నాలు చేయకపోవడం మంచిది. దీర్ఘకాలిక అనారోగ్యాలు కొద్దిగా ప్రకోపించే అవకాశం ఉంది. సుందరకాండ లేదా ఆదిత్య హృదయం పఠించడం వల్ల గ్రహణ దోష నివారణ జరుగుతుంది.

కర్కాటకం: ఈ రాశికి ద్వితీయ, అష్టమ స్థానాల్లో గ్రహణం చోటు చేసుకుంటున్నందువల్ల నిద్రపట్టకపోవడం, నేత్ర సంబంధమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వృధా వ్యయానికి అవకాశం ఉంది. డబ్బు నష్టపోవడం జరుగుతుంది. శత్రుబాధ, పోటీదార్ల బెడద పెరగవచ్చు. కొద్దిగా ఆత్మవిశ్వాసం తగ్గే అవకాశం ఉంటుంది. బంధువుల ఆరోగ్యానికి సంబంధించి దుర్వార్తలు వినే సూచనలు న్నాయి. లలితా సహస్ర నామం లేదా సుందరకాండ పారాయణం వల్ల గ్రహణ దోషం తొలగిపోతుంది.

సింహం: ఈ రాశిలో ఉన్న రవి, కేతువులతో సప్తమ స్థానంలో ఉన్న చంద్ర రాహువులకు సమసప్తక దృష్టి ఏర్పడడం వల్ల గ్రహణం పడుతున్నందువల్ల కొద్దిగా మానసిక ఒత్తిడి ఉండవచ్చు. కొత్తగా ఆదాయ ప్రయత్నాలు చేయవద్దు. కొత్త నిర్ణయాలు తీసుకోవద్దు. ఎక్కడా సంతకాలు చేయకపో వడం మంచిది. ప్రమోషన్ల గురించి, ఇంక్రిమెంట్ల గురించి అధికారులతో మాట్లాడడానికి ఇది సమయం కాదు. ఆర్థిక లావాదేవీలు చేపట్టవద్దు. విష్ణు సహస్ర నామ స్తోత్రం పఠించడం ఉత్తమం.

వృశ్చికం: ఈ రాశికి చతుర్థ, దశమ స్థానాల్లో గ్రహణం పట్టడం వల్ల, ఈ రాశివారు ఉద్యోగంలో పొరపాట్లు ఎక్కువగా చేయడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కొద్దిగా సమస్యలు తలెత్తే అవ కాశం ఉంటుంది. అధికారులతో ఇతరులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. మిత్రులు తప్పు దోవ పట్టించే సూచనలున్నాయి. పేరు ప్రతిష్ఠలు దెబ్బతినడం, అవమానాల పాలుకావడం వంటివి జరగవచ్చు. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఆదిత్య హృదయం పఠించడం శ్రేయస్కరం.

మకరం: ఈ రాశికి ధన, అష్టమ స్థానాల్లో గ్రహణం ఏర్పడుతున్నందువల్ల కొత్త ప్రయత్నాలు చేపట్టకపోవడం, కొత్త నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. యథాతథ స్థితిని కొనసాగించడం అవసరం. విదేశాల నుంచి లేదా దూర ప్రాంతాల నుంచి ఆశించిన శుభవార్త అందకపోవచ్చు. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభించే అవకాశం లేదు. ముఖ్యమైన వ్యవహారాల్లో నిర్ణ యాలు తీసుకోవడం ఇబ్బందవుతుంది. సుందరకాండ పారాయణం వల్ల గ్రహణ దోషం తగ్గుతుంది.

కుంభం: ఈ రాశిలో చంద్ర గ్రహణం ఏర్పడుతున్నందువల్ల స్వల్ప అనారోగ్యాలకు అవకాశం ఉంటుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వాహన ప్రమాదాలకు కూడా అవకాశం ఉంది. గ్రహణం రోజున డబ్బు ఇవ్వడం లేదా తీసుకోవడం వంటివి పెట్టుకోవద్దు. పెన్షన్లు, బీమా సొమ్ము, వారసత్వపు ఆస్తి చేతికి అందడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఆధ్యాత్మిక చింతన వల్ల, ధ్యానం వల్ల గ్రహణ ప్రభావం తగ్గుతుంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది.