October 2026: అక్టోబర్‌లో వీరికి ధన వర్షం..! ఆదాయం పెరిగి ఆర్థిక సమస్యలకు చెక్

Edited By:

Updated on: Sep 28, 2026 | 2:00 PM

October 2026 Money Horoscope: జ్యోతిషశాస్త్రం ప్రకారం ద్వితీయ స్థానం వ్యక్తిగత ధనాధాయం గురించి తెలియజేస్తుంది. ముఖ్యంగా వృత్తి, ఉద్యోగాల ద్వారా వచ్చే కష్టార్జితం గురించి ఇది తెలియజేస్తుంది. అక్టోబర్ నెలలో జీతభత్యాలు ఏమైనా పెరగబోతున్నాయా? కొత్త ఆదాయ మార్గాలు లభిస్తాయా? ఆర్థిక సమస్యలు, రుణ బాధలు పరిష్కారమవుతాయి. శుభ గ్రహాల అనుకూలతలు, పాప గ్రహాల అనుకూల సంచారం వగైరా కారణాలను బట్టి కొన్ని రాశుల వారికి కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుత గ్రహ సంచారం ప్రకారం మేషం, మిథునం, కన్య, తుల, వృశ్చికం, మకర రాశుల రాశుల వారికి అక్టోబర్ నెలలో ఆదాయ వృద్ధి అవకాశాలు కనిపిస్తున్నాయి.

1 / 6
మేష రాశి: ఈ రాశికి ధన స్థానాధిపతి అయిన శుక్రుడు సప్తమ స్థానంలో స్వస్థానంలో ఉండడం, ధన కారకుడు గురువు ఉచ్ఛ స్థితిలో చతుర్థ స్థానంలో ఉండడం వల్ల ఈ రాశివారికి అక్టోబర్ లో ఆదాయం పెరగడం తప్ప తగ్గే అవకాశం లేదు. ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువుతో ఈ నెలంతా రాశ్యధిపతి కుజుడు యుతి చెందడం వల్ల ఆదాయ వృద్ధికి ఎలాంటి ప్రయత్నం చేపట్టినా సక్సెస్ అవుతుంది.  షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఆర్థిక సమస్యలు పూర్తిగా తగ్గుతాయి.

2 / 6
మిథున రాశి: ఈ రాశికి అక్టోబర్ నెలంతా ధన స్థానంలో గురువు ఉచ్ఛ స్థితిలో ఉండడంతో పాటు, రాశ్యధిపతి బుధుడు పంచమ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఉద్యోగంలో ఈ రాశివారి జీతభత్యాలు బాగా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కూడా రాబడి అంచనాలను మించి వృద్ధి చెందు తుంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా విశేషంగా లాభిస్తాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. కొన్ని ముఖ్యమైన ఆర్థిక అవసరాలు తీరిపోవడం కూడా జరుగుతుంది.

3 / 6
కన్య రాశి: అక్టోబర్ 31 వరకు గురువు  ఈ రాశికి లాభ స్థానంలో సంచారం చేయడం, ధన స్థానంలో ధనాధి పతి శుక్రుడితో రాశ్యధిపతి బుధుడు యుతి చెందడం వల్ల ఈ రాశివారికి నెలంతా ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండకపోవచ్చు. రావలసిన సొమ్ము పూర్తిగా చేతికి అందుతుంది. బాకీలు, బకాయిలు వసూలవుతాయి. కుటుంబపరంగా, ఆస్తిపాస్తుల పరంగా కూడా ఆదాయం వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతాయి.

4 / 6
తుల రాశి: రాశ్యధిపతి శుక్రుడు భాగ్యాధిపతి బుధుడితో తులా రాశిలోనే కలవడం, ధన కారకుడు గురువు దశమ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉండడం వల్ల అక్టోబర్ నెలంతా ఆదాయం దిన దినాభివృద్ధి చెందు తుంది. అనేక వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. ముఖ్యమైన ఆర్థిక అవసరాలు తీరిపోవ డంతో పాటు, ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. బంధుమిత్రుల నుంచి రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. షేర్లు, ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి.

5 / 6
వృశ్చిక రాశి: ఈ రాశికి ధనాధిపతి, ధన కారకుడు అయిన గురువు ప్రస్తుతం భాగ్య స్థానంలో ఉచ్ఛస్థితిలో ఉండడం వల్ల అక్టోబర్ నెలలో ఈ రాశివారి జీతభత్యాలు పెరగడంతో పాటు అదనపు ఆదాయ మార్గాలు కూడా సత్ఫలితాలనిస్తాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. బ్యాంక్ బ్యాలెన్స్ తోపాటు, పొదుపు కూడా వృద్ధి చెందుతుంది. ఖర్చులు తగ్గించుకోవడం మీద శ్రద్ధ పెరు గుతుంది. షేర్లు, ఆర్థిక లావాదేవీల వల్ల లబ్ధి కలుగుతుంది. ఆర్థిక సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి.

6 / 6
మకర రాశి: ఈ రాశికి ధన స్థానాధిపతి అయిన శనీశ్వరుడు తృతీయ స్థానంలో ఉండడంతో పాటు, ధన కార కుడు గురువు సప్తమ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉండడంవల్ల ఆదాయం పెరగడమే తప్ప తగ్గే అవకాశం ఉండదు. మరింత ఎక్కువగా జీతభత్యాలిచ్చే ఉద్యోగంలోకి మారడానికి బాగా అవకాశం ఉంది. ఆర్థికంగా ఆశించిన స్థిరత్వం లభిస్తుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారమవు తాయి. విదేశీ సంపాదన అనుభవించే యోగం పడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో జీతభత్యాలు పెరుగుతాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us