అక్టోబర్ నెలంతా వీరికి సుఖ సంతోషాలు, సిరిసంపదలు! ఇందులో మీ రాశి ఉందా?

Edited By:

Updated on: Oct 05, 2026 | 6:17 PM

October 2026 Horoscope: జ్యోతిషశాస్త్రం ప్రకారం చతుర్థ స్థానాన్ని బట్టి సుఖ సంతోషాలను అంచనా వేయడం జరుగుతుంది. చతుర్థ స్థానాధిపతి, చతుర్థ స్థానం అనుకూలంగా ఉన్న పక్షంలో కుటుంబంలోనే కాక వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. అంతేకాదు, గృహ, వాహన సౌకర్యాలు పెరగడం, ఆస్తిపాస్తులు సమకూరడం, సామాజిక హోదా పెరగడం, మాతృ సౌఖ్యం లభించడం వంటివి కూడా తప్పకుండా జరుగుతాయి. ప్రస్తుతం మేషం, కర్కాటకం, కన్య, తుల, మకరం, కుంభ రాశులకు చతుర్థ స్థానం, చతుర్థాధిపతి బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వీరి జీవితాలు అక్టోబర్ నెలంతా నల్లేరు కాయల మీద బండిలా సాగిపోతాయి.

1 / 6
మేషం: ఈ రాశికి చతుర్థ స్థానంలో రాశ్యదిపతి కుజుడు ఉచ్ఛ గురువుతో యుతి చెందడం వల్ల సుఖ సంతోషాలకు లోటుండదు. ఆశించిన మానసిక ప్రశాంతత లభిస్తుంది. దాంపత్య జీవితం హ్యాపీగా సాగుతుంది. కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తారు. గృహ, వాహన యోగాలు పట్టే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లోనే కాక, సామాజికంగా కూడా హోదా పెరుగుతుంది. ఆస్తి సమస్యలు అను కూలంగా పరిష్కారమవుతాయి. ఆస్తి విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది.

2 / 6
కర్కాటకం: ఈ రాశికి చతుర్థ స్థానంలో చతుర్ధాధిపతి శుక్రుడి సంచారం వల్ల ఈ రాశివారికి అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. మరో నెల రోజుల పాటు వీరి సుఖ సంతోషాలకు లోటుండదు. గృహ, వాహన యోగాలు పట్టే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో సమర్థతకు  గుర్తింపు లభిస్తుంది. హోదా పెరిగే సూచనలున్నాయి. మాతృ సౌఖ్యం లభిస్తుంది. తల్లి ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు తగ్గి ఆశించిన మానసిక ప్రశాంతత కలుగుతుంది.

3 / 6
కన్య: ఈ రాశికి చతుర్థ స్థానాధిపతి అయిన గురువు లాభ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉండడం వల్ల ఈ రాశివారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవు తాయి. భూ లాభం, ఆస్తి లాభం కలుగుతాయి. సమస్యలు, ఒత్తిళ్ల నుంచి విముక్తి లభిస్తుంది. విజయాలు, సాఫల్యాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ జీవితం సుఖప్రదంగా సాగిపోతుంది. కుటుంబంలో శుభ కార్యాలు జరగడానికి అవకాశాలు కలుగుతాయి. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది.

4 / 6
తుల: ఈ రాశికి చతుర్థ స్థానమైన మకర రాశి మీద గురు, కుజుల దృష్టి పడడం వల్ల ధన లాభం, ఆస్తి లాభం కలుగుతాయి. అనేక వైపుల నుంచి ఆదాయం పెరిగి, ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. గృహ, వాహన సౌకర్యాలు తప్పకుండా ఏర్పడతాయి. ఉద్యోగ స్థిరత్వం లభి స్తుంది. సమాజంలో పలుకుబడి వృద్ధి చెందుతుంది. కుటుంబ సౌఖ్యానికి లోటుండదు. ఏ ప్రయ త్నం తలపెట్టినా విజయాలు సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగుపడుతుంది.

5 / 6
మకరం: ఈ రాశికి చతుర్థ స్థానాధిపతి అయిన కుజుడు సప్తమ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువుతో యుతి చెందడం వల్ల కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఆశయాలు, లక్ష్యాలను సకాలంలో పూర్తి చేస్తారు. మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమై, విలువైన ఆస్తి చేతికి అందుతుంది. సొంత ఇంటి కల నెరవేరుతుంది. వాహన యోగం పడుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరగడానికి అవకాశాలు కలుగుతాయి.

6 / 6
కుంభం: ఈ రాశికి చతుర్ధాధిపతి అయిన శుక్రుడు భాగ్య స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల దాంపత్య జీవితంలో సమస్యలు, వివాదాలు పరిష్కారం కావడం, సుఖ సంతోషాలు పెరగడం జరుగుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. తల్లి ఆస్తులు కలిసి వస్తాయి. ఆదాయానికి లోటుండదు.

Loading...
Unable to load recommendations.
Follow Us