అమ్మకు ప్రేమతో.. ఈ చిన్ని బహుమతులతో తన మనసును ఆనందపరచండి!

Updated on: May 09, 2026 | 5:44 PM

పెదవే పలికిన మాటల్లోనా తీయని మాటే అమ్మా.. కదిలే దేవత అమ్మా.. ఇలా అమ్మ ప్రేమ గురించి ఎన్ని పాటలు వచ్చినా, అమ్మ ప్రేమను వర్ణించడం మాత్రం వర్ణనాతీతమే అని చెప్పాలి. నవ మాసాలు మోసి కని పెంచిన అమ్మ గురించి, తన ప్రేమ గురించి రాయడానికి అక్షరాలే సరిపోవు.. అంత గొప్పది. మరి ఏంటీ అమ్మ గురించి ఇంతలా చెప్తోంది అనుకుంటున్నారా? మదర్స్ డే వచ్చేస్తోంది. 2026 మే 10న ప్రతి ఒక్కరూ మదర్స్ డే ను జరుపుకుంటారు.

1 / 5
ఇక మదర్స్ డే వస్తే చాలు చాలా మంది పిల్లలు తమ అమ్మకు ఏదైనా బహుమతి ఇవ్వాలని అనుకుంటారు. దీని కోసం వారం పది రోజుల నుంచే ఆలోచిస్తుంటారు. అయితే మీరు కూడా మీ అమ్మకు ప్రేమతో, తనకు ఇష్టమైన బహుమతి ఇవ్వాలి అనుకుంటున్నారా? ఏది ఇవ్వాలో ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదా? అయితే మీ కోసమే ఈ అద్భుతమైన చిట్కాలు. మీ అమ్మకు మదర్స్ డే రోజు ఈ బహుమతులు ఇస్తే తాను చాలా సంతోషిస్తుంది. ఇంతకీ అవి ఏవి అంటే?

2 / 5
 మీకు మీ అమ్మ అంటే ఎంత ఇష్టం ఉంటుందో, తనకు కూడా తన అమ్మ అంటే అంతే ఇష్టం ఉంటుంది. కాబట్టి మీరు ఈ మదర్స్ డేకు మీ మదర్‌కు, మీ అమ్మ వాళ్ల అమ్మతో, మీతో కలిసి దిగిన ఫొటోను డిజిటల్ ఫ్రేమ్ చేయించి, దానిని బహుమతిగా ఇవ్వండి.  అప్పుడు తన ఆనందం మాటల్లో చెప్పలేనిదిగా ఉంటుంది. తనకు మీరు ఇచ్చే బహుమతుల్లో ఇది చాలా స్పెషల్‌గా నిలుస్తుంది.

3 / 5
కొంత మంది సారీస్ అంటే ఇష్టం ఉంటుంది. అందువలన మదర్స్‌డే రోజు మీరు మీ అమ్మకు పూర్తి సమయం కేటాయించి. తనకు కావాల్సిన సారీ, తనకు కావాల్సినవి అన్నీ కొని ఇవ్వండి. ఈరోజు మొత్తం తనతో ఆనందంగా కలిసి గడపండి. ఇది తనకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. కోట్లు ఇచ్చినా కొనలేని ఆనందం మీరు తనతో గడపడం వలన వస్తుంది.

4 / 5
అమ్మకు ఖరీదైన బహుమతులు అంతగా ఇష్టం ఉండదు. వారికి మీరు ప్రేమతో చిన్న బహుమతి ఇచ్చినా సరే, తాను ఆనందంతో మురిసిపోతుంది. అందుకే తనపై మీకు ఉన్న ప్రేమను ఒక గిఫ్ట్ కార్డు తీసుకొని దానిలో మీ అమ్మ ఫొటోను అమర్చి, మీ ఫొటోను అమర్చి అందంగా గ్రీటింగ్ కార్డులా రెడీ చేయండి. దానితో పాటు తనకు ఇష్టమైన చిన్న చిన్న వస్తువులను కూడా ప్యాక్ చేసి మీ అమ్మకు అందజేయండి. తాను చాలా సంతోషిస్తుంది.

5 / 5
అదే విధంగా మీ అమ్మకు నచ్చిన ప్లేస్‌కు తీసుకెళ్లండి, ఒక వేళ మీరు మీ అమ్మకు దూరం ఉన్నట్లు అయితే వీడియో మెసేజ్ చేసి మీరు మీకు తనంటే ఎంతో ఇష్టమూ వీడియో సందేశం ద్వారా తెలియజేయండి. మీ అమ్మ చాలా సంతోషిస్తుంది.

Follow Us