Maha Bhagya Yoga: ఆరు రాశులకు మహా భాగ్య యోగం! ఆర్థికంగా తిరుగే ఉండదు..

Edited By:

Updated on: Nov 16, 2026 | 6:39 PM

Maha Bhagya Yoga: బుధ, శుక్రులు రెండూ శుభ గ్రహాలు. ఇందులో బుధుడు ప్రణాళికలు, పథకాలు, ఒప్పందాలు, సంబంధ బాంధవ్యాలకు, తెలివితేటలకు కారకుడు. కాగా, శుక్రుడు ధన వృద్ధికి సంబంధించిన గ్రహం. ఇవి రెండూ ఎప్పుడు ఎక్కడ కలిసినా మహా భాగ్య యోగాల్ని కలిగిస్తాయి. ఈ నెల(నవంబర్) 22న శుక్రుడు తన స్వస్థానమైన తులా రాశిలోకి ప్రవేశించి, ప్రస్తుతం అదే రాశిలో సంచారం చేస్తున్న బుధుడితో డిసెంబర్ 2 వరకు కలిసి ఉండడం జరుగుతుంది. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల కుబేర యోగం, ధన లక్ష్మీయోగం, మహా భాగ్య యోగం వంటివి ఏర్పడతాయి. ఇవి మేషం, మిథునం, కన్య, తుల, ధనుస్సు, కుంభ రాశులవారికి ఈ అదృష్ట యోగాలు పట్టబోతున్నాయి.

1 / 6
మేషం: శుభ గ్రహాలైన బుధ, శుక్రులు ఈ రాశికి సప్తమ స్థానంలో కలుస్తున్నందు వల్ల ఈ రాశివారికి ఈ పది రోజుల కాలంలో సంపద బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక ప్రయత్నాలన్నీ సత్ఫలితాలనిస్తాయి. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. స్థిరాస్తి క్రయ విక్రయాల ద్వారా కూడా సంపద పెరుగుతుంది. తల్లి వైపు నుంచి కానీ, జీవిత భాగస్వామి వైపు నుంచి కానీ ఆస్తి కలిసి వచ్చే అవకాశముంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా కూడా ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది.

2 / 6
మిథునం: ఈ రాశికి పంచమ స్థానంలో బుధ, శుక్రులు కలుస్తున్నందువల్ల ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంటుంది. ఆర్థికంగా ప్రాభవం, వైభవం పెరుగుతుంది. సాధారణ ఆర్థిక స్థాయి నుంచి ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశముంటుంది. భారీగా వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. సంపన్న వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. జీవనశైలి, స్థితిగతులు మారిపోవడం జరుగుతుంది. విలాస జీవితానికి అలవాటు పడే అవకాశం ఉంది. గృహ, వాహన యోగాలు పడతాయి.

3 / 6
కన్య: ఈ రాశికి ధన స్థానంలో బుధ, శుక్రుల కలయిక జరుగుతున్నందువల్ల ఈ రాశివారికి నూరు శాతం మహాలక్ష్మీ యోగం పట్టే అవకాశం ఉంది. అన్ని విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది.  ఆస్తి వివాదం సానుకూలంగా పరిష్కారం కావడం, ఆస్తి విలువ పెరగడం, ఆస్తిపాస్తులు కలిసి రావడం వంటివి జరుగుతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు.

4 / 6
తుల: ఈ రాశిలో బుధ, శుక్రుల సంచారం వల్ల ఉద్యోగంలో హోదా పెరగడానికి, ఉన్నత స్థాయికి చేరుకోవ డానికి బాగా అవకాశముంది. నిరుద్యోగులకు కలలో కూడా ఊహించని ఆఫర్లు అందుతాయి. ఉద్యోగులు మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశముంటుంది. ఇతర దేశాల నుంచి కూడా నిరుద్యోగులకు, ఉద్యోగులకు ఆఫర్లు అందుతాయి. ప్రముఖులతో లాభదాయక పరిచ యాలు ఏర్పడతాయి. అనేక విధాలుగా సంపద వృద్ధి చెందుతుంది. ఆస్తి బాగా కలిసి వస్తుంది.

5 / 6
ధనుస్సు: ఈ రాశికి లాభ స్థానంలో బుధ, శుక్రులు కలుస్తున్నందువల్ల ఈ రాశివారికి తప్పకుండా మహా భాగ్య యోగం పట్టే అవకాశముంది. సంపన్న వ్యక్తితో వివాహం నిశ్చయం కావడం గానీ, సంపన్న వ్యక్తితో ప్రేమలో పడడం గానీ జరుగుతుంది. జీవన విధానంలో మార్పు వస్తుంది. వృత్తి, వ్యాపా రాల్లో లాభాలు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవు తాయి. మనసులోని కోరికలు కొన్ని నెరవేరుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది.

6 / 6
కుంభం: ఈ రాశికి భాగ్య స్థానంలో ఈ రెండు శుభ గ్రహాల యుతి జరుగుతున్నందువల్ల ఏ ప్రయత్నం తల పెట్టినా విజయం సాధించడం జరుగుతుంది. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడ తాయి. వారసత్వంగా ఆస్తిపాస్తులు కలిసి వచ్చే అవకాశముంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగాల్లో జీతభత్యాలు అంచనాలకు మించి పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. కుటుంబంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us