
వృషభం: ఈ రాశికి దశమ స్థానంలో ఉన్న బుధుడు వక్రించడం వల్ల ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. అధికారులకు మీ శక్తి సామర్థ్యాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఆధునిక నైపుణ్యాలను వృద్ధి చేసుకుంటారు. కొత్త అంశాల్లో శిక్షణ పొందడం జరుగుతుంది. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశీ ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు ప్రతి ప్రయత్నంలోనూ శుభవార్తలు అందుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి.

మిథునం: ఈ రాశికి అధిపతి అయిన బుధుడు భాగ్య స్థానంలో వక్రించడం వల్ల ఈ రాశివారికి విదేశీ అవకాశాలు అనేకం లభిస్తాయి. అనేక విధాలైన అదృష్టాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. ఆదాయం దినదినాభివృద్ధి చెంది, ముఖ్యమైన ఆర్థిక సమ స్యల నుంచి బయటపడడం జరుగుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో మీ శక్తిసామర్థ్యాలు అధికారులను ఆకట్టుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి.

తుల: ఈ రాశికి భాగ్యాధిపతి అయిన బుధుడు పంచమ స్థానంలో వక్రించడం వల్ల కొత్త నైపుణ్యాల్లో శిక్షణ పొందే అవకాశం ఉంది. విదేశాల నుంచి ఆఫర్లు, ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగంలో సహ చరుల కంటే అన్ని విషయాల్లోనూ ముందుంటారు. ఉన్నత విద్యలకు కూడా అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు అంచనాలకు మించి లాభిస్తాయి. అనేక విధాలుగా ఆదాయం పెరగడం, అనేక మార్గాల్లో లాభాలు కలగడం వంటివి జరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగుతాయి.

మకరం: ఈ రాశికి ధన స్థానంలో బుధుడి వక్ర సంచారం వల్ల సరికొత్త ఆదాయ మార్గాలు అందుబాటులోకి వస్తాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. మీ సలహాలు, సూచనల వల్ల మీరు పనిచేస్తున్న సంస్థకు, అధికారులకు లాభాలు కలుగుతాయి. నైపుణ్యాలు వృద్ధిచెందుతాయి. ఆస్తి సమస్యలు, వివాదాలు పరిష్కారమవుతాయి. వృత్తి, వ్యాపారాలను విస్తరించే అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ శక్తి సామర్థ్యాలకు సరైన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు కొన్ని విదేశీ ఆఫర్లు అంది వస్తాయి.

కుంభం: ఈ రాశిలో బుధుడు వక్రించడం వల్ల ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. మనసులోని ముఖ్యమైన కోరికలు నెరవేరుతాయి. ఎలాంటి ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. ఉద్యోగంలో మీ సలహాలు, సూచనల వల్ల సంస్థకు లాభాలు కలుగుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ సత్ఫలితాలనిస్తాయి. కొద్ది శ్రమతో అత్యధిక లాభాలను పొందుతారు. పిల్లలు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది.