
వృషభం: ఈ రాశికి ధన స్థానాధిపతి అయిన బుధుడు చతుర్థ స్థానంలో కేతువుతో యుతి చెందడం వల్ల ఆదాయం దిన దినాభివృద్ధి చెందడానికి బాగా అవకాశం ఉంది. అనేక వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. ఆస్తి సమస్యలు పరిష్కారం కావడానికి, ఆస్తి లాభం కలగడానికి ఎక్కువ అవకాశా లున్నాయి. ఆస్తులు, అద్దెల ద్వారా వచ్చే ఆదాయం బాగా పెరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తితో పాటు, రావలసిన సొమ్ము చేతికి అందడం, బాకీలు, బకాయిలు వసూలు కావడం జరుగుతాయి.

కర్కాటకం: ఈ రాశికి ధన స్థానంలోనే బుధ, కేతువుల యుతి జరుగుతున్నందువల్ల ఆదాయానికి లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరడంతో పాటు ఆర్థిక, రుణ సమస్యలు పూర్తిగా పరిఫ్కారమవుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. ఉద్యోగంలో జీతభత్యాలు పెరగడం, కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగవడం, వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని మించడం జరుగుతాయి.

సింహం: ఈ రాశిలో బుధ, కేతువుల సంచారం వల్ల ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగుపడుతుంది. ఇతరులకు ఆర్థికంగా సహాయం చేయగల స్థితిలో ఉంటారు. ఆదాయాన్ని పెంచుకో వడం మీద దృష్టి కేంద్రీకరిస్తారు. షేర్లు, స్పెక్యులేషన్లతో సహా అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందడం వల్ల ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ఆస్తి వివాదాలు బాగా అనుకూలంగా పరిష్కార మవుతాయి. ఆస్తుల విలువ పెరుగుతుంది. ఆశించిన లాభదాయక ఒప్పందాలు కుదురుతాయి.

తుల: ఈ రాశికి లాభ స్థానంలో బుధ, కేతువులు కలవడం వల్ల దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు, వడ్డీ వ్యాపారాలు అంచనాలను మించి లాభి స్తాయి. కొంత ప్రయత్నపూర్వకంగానూ, కొంత అప్రయత్నంగానూ ఆదాయం పెరుగుతుంది. రావ లసిన సొమ్ము, రాదనుకున్న సొమ్ము తప్పకుండా చేతికి అందుతాయి. ఉద్యోగంలో జీతభ త్యాలు, వృత్తి, వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందుతాయి. లాటరీ గెలుచుకునే సూచనలున్నాయి.

ధనుస్సు: ఈ రాశికి భాగ్య స్థానంలో బుధ, కేతువుల యుతి వల్ల అనేక విధాలుగా అదృష్టం కలిసి వస్తుంది. ఆదాయ వృద్ధిలో విశేషమైన పురోగతి ఉంటుంది. ఉద్యోగుల జీతభత్యాలు భారీగా పెరుగుతాయి. ఉద్యోగులు మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. విదేశీ సంపాదన అనుభవించే యోగం పడుతుంది. పిత్రార్జితం లభిస్తుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. షేర్లు, లాభిస్తాయి.

కుంభం: ఈ రాశికి సప్తమ స్థానంలో ఈ రెండు గ్రహాల కలయిక వల్ల ఆదాయ వృద్ధికి ఎటువంటి ప్రయత్నం చేపట్టినా సక్సెస్ అవుతుంది. పొదుపులు, మదుపులు ఆదాయాన్ని పెంచుతాయి. భారీగా జీత భత్యాలిచ్చే సంస్థలోకి ఉద్యోగులు మారడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు రాబడిపరంగా దూసుకుపోతాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభాలని స్తాయి. బాగా సంపన్న వ్యక్తితో ప్రేమలో పడడం, పెళ్లి నిశ్చయం కావడం వంటివి జరుగుతాయి.