Kuja Dosha: కుజుడి ప్రభావంతో దాంపత్య సమస్యలు.. వారు కాస్త జాగ్రత్త..!

Edited By:

Updated on: May 26, 2026 | 1:23 PM

Mangalya Dosha: జూన్ 20 వరకు మేష రాశిలో స్వస్థానంలో సంచరిస్తున్న కుజ గ్రహం ప్రభావంతో మేషం, వృషభం, కన్య, తుల, మకరం, మీన రాశుల వారికి స్వల్ప కుజ దోష ప్రభావం కనిపించే అవకాశం ఉంది. దీని వల్ల కుటుంబ, దాంపత్య జీవితంలో చిన్నచిన్న విభేదాలు తలెత్తవచ్చు. ఓర్పు, సహనం పాటిస్తూ సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం లేదా సుందరకాండ పఠించడం శ్రేయస్కరం.

1 / 7
ప్రస్తుతం మేష రాశిలో, తన స్వస్థానంలో జూన్ 20 వరకు సంచారం చేస్తున్న కుజ గ్రహం వల్ల కొన్ని రాశుల వారికి మాంగల్య దోషం (కుజ దోషం, అంగారక దోషం) ఏర్పడింది. కుజుడు ఏ రాశికైనా 1, 2, 4, 7, 8, 12 రాశుల్లో సంచారం చేస్తున్నప్పుడు కుజ దోషం ఏర్పడుతుంది. అయితే, కుజుడు తన స్వస్థానంలో ఉన్నందువల్ల ఈ దోషం బాగా తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ దోషం వల్ల వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తుతాయి. జీవిత భాగస్వామితో ఎంత ఓర్పు, సహనాలతో వ్యవహరిస్తే అంత మంచిది. ఈ కుజ సంచారం వల్ల మేషం, వృషభం, కన్య, తుల, మకరం, మీన రాశుల వారికి కుటుంబ సమస్యలు, దాంపత్య సమస్యలు తలెత్తవచ్చు. ఈ రాశుల వారు సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం గానీ సుందర కాండను గానీ పఠించడం మంచిది.

2 / 7
మేషం: ఈ రాశిలో సంచారం వల్ల కుజ దోషం లేదా మాంగల్య దోషం ఏర్పడింది. దీనివల్ల జీవిత భాగ స్వామితో ఎడబాటు కలిగే అవకాశం ఉంది. జీవిత భాగస్వామికి ప్రమాదాలు జరగడం గానీ, అనారోగ్యం పీడించడం గానీ జరుగుతుంది. జీవిత భాగస్వామితో ఈగో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. దంపతుల మధ్య ప్రతి విషయానికి మాట పట్టింపులు తలెత్తే అవకాశం ఉంది. వాగ్వాదాలు, అపార్థాలకు అవకాశం ఉంది. కొన్ని విషయాల్లో ఓర్పు, సహనాలతో వ్యవహరించడం మంచిది.

3 / 7
వృషభం: ఈ రాశికి వ్యయ స్థానంలో కుజ సంచారం వల్ల కుజ దోషం ఏర్పడింది. ఈ దోషం వల్ల జీవిత భాగ స్వామి అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. ఇద్దరి మధ్యా కొద్దిపాటి ఎడబాటు తప్పకపోవచ్చు. బంధువుల కారణంగా ఇద్దరి మధ్యా సమస్యలు తలెత్తడం, ఒకరికొకరు దూరంగా ఉండడం, దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు లోపించడం వంటివి జరిగే సూచనలున్నాయి. దూర ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం కూడా ఉంది. వాహన ప్రమాదాల్లో జాగ్రత్తగా ఉండాలి.

4 / 7
కన్య: ఈ రాశికి అష్టమ స్థానంలో కుజుడి సంచారం వల్ల కుజ దోష ప్రభావం రెట్టింపు అనుభవానికి వస్తుంది. జీవిత భాగస్వామితో వ్యవహరించేటప్పుడు ఎంత ఓర్పు, సహనాలతో వ్యవహరిస్తే అంత మంచిది. చిన్న సమస్యలు, వివాదాలు సైతం చినికి చినికి గాలివానగా పెరిగి పోయే అవకాశం ఉంది. సాధారణంగా మాట పట్టింపులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అనారోగ్యాలు కూడా ఇబ్బంది పెడతాయి. మేష రాశి కుజుడి వల్ల బంధువులు కొందరు రెచ్చగొట్టే సూచనలున్నాయి.

5 / 7
తుల: ఈ రాశికి సప్తమ స్థానంలో కుజ సంచారం వల్ల కుజ దోషం ఏర్పడింది. దీనివల్ల మాట తొందర పాటు ఎక్కువగా ఉంటుంది. కోపతాపాలు పేట్రేగడానికి అవకాశం ఉంది. దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు లోపిస్తాయి. జీవిత భాగస్వామితో అనుకోకుండా వివాదాలు, విభేదాలు తలెత్తుతాయి. ఇందుకు కొంత కుటుంబ సమస్యలు కూడా కారణమవుతాయి. టెన్షన్లు పెరిగే సూచనలున్నాయి. జీవిత భాగస్వామితో దాదాపు అన్ని విషయాల్లోనూ ఓర్పు, సహనాలు పాటించడం మంచిది.

6 / 7
మకరం: ఈ రాశికి చతుర్థ స్థానంలో కుజుడి సంచారం వల్ల మాంగల్య దోషం ఏర్పడింది. దీనివల్ల కుటుంబ కలహాలు పెరుగుతాయి. దంపతుల మధ్య ఈగో సమస్యలు తలెత్తుతాయి. జీవిత భాగస్వామి మీద కోపతాపాలు ప్రదర్శించడం ఎక్కువవుతుంది. ఆర్థిక, కుటుంబ వ్యవహారాలు కూడా వీటికి తోడవుతాయి. మాట తొందర వల్ల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కొద్ది రోజుల పాటు ఆచితూచి వ్యవహరించడం మంచిది. పారదర్శకంగా వ్యవహరించవలసి ఉంటుంది.

7 / 7
మీనం: ఈ రాశికి ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్న కుజుడి వల్ల కుజ దోషం ఏర్పడింది. అనారోగ్యాల వల్ల, ఆధిపత్య ధోరణి వల్ల దంపతుల మధ్య ఎడబాటు కలిగే అవకాశం ఉంది. అహంకారం, మొండి పట్టుదల వంటి కారణాల వల్ల ఇద్దరి మధ్యా అన్యోన్యత దెబ్బతింటుంది. దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు లోపిస్తాయి. ఇద్దరి మధ్యా మాట పట్టింపులకు అవకాశం ఉంది. కొద్దిగా రాజీ మార్గం అనుసరించడం వల్ల, సర్దుబాటు ధోరణిని ప్రదర్శించడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

Follow Us