Lucky Zodiac Signs: నాలుగు గ్రహాల కటాక్షం.. అదృష్టం వారి తలుపు తట్టే ఛాన్స్..!

Edited By:

Updated on: May 04, 2026 | 3:38 PM

మే ప్రథమార్థంలో రవి, కుజ, శుక్ర, బుధ గ్రహాల రాశి మార్పులతో మేషం, వృషభం, సింహం, తుల, మకర, కుంభ రాశుల వారికి అదృష్టం బలంగా కలిసివస్తుంది. జూన్ మధ్య వరకు ఆర్థిక, ఉద్యోగ, వృత్తి రంగాల్లో వీరు విశేష విజయాలు సాధించే అవకాశముంది. మరి మీ రాశి కూడా అదృష్టంపట్టే రాశుల జాబితాలో ఉందేమో ఇక్కడ చూద్దాం..

1 / 7
మే నెల ప్రథమార్థంలో రవి, కుజ, శుక్ర, బుధులు రాశులు మారుతున్నాయి. ఏకంగా నాలుగు గ్రహాలు రాశులు మారడం వల్ల కొన్ని రాశులవారు ఒక వెలుగు వెలగబోతున్నారు. అనేక విధాలుగా అదృష్టం తలుపు తట్టే అవకాశం ఉంది. ఏప్రిల్ 30న బుధుడు మేషంలోకి, మే 14న రవి వృషభంలోకి, 12న కుజుడు మేషంలోకి, 14న మిథున రాశిలోకి మారుతున్నందువల్ల మేషం, వృషభం, సింహం, తుల, మకర, కుంభ రాశుల వారు ఆర్థికంగా, వృత్తి, ఉద్యోగాలపరంగా ఏనుగు కుంభ స్థలాన్ని బద్దలు కొట్టే అవకాశం ఉంది. జూన్ మధ్య వరకూ వీరికి తిరుగుండదు.

2 / 7
మేషం: రవి, కుజ, శుక్ర, బుధులు ఒకదాని తర్వాత ఒకటిగా ఈ రాశివారిని తప్పకుండా అందలాలు ఎక్కించే అవకాశం ఉంది. ఉద్యోగంలో హోదా పెరగడంతో పాటు అంచనాలకు మించి జీతభత్యాలు పెరిగే సూచనలున్నాయి. ఉద్యోగులకు విదేశీ ఉద్యోగాలకు ఆఫర్లు అందుతాయి. నిరుద్యోగులకు అరుదైన అవకాశాలు లభించే అవకాశం ఉంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. పిల్లలు చదువుల్లోనూ, ఉద్యోగాల్లోనూ రికార్డులు సృష్టిస్తారు. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది.

3 / 7
వృషభం: రాశ్యధిపతి శుక్రుడితో సహా ఏకంగా నాలుగు గ్రహాలు బాగా అనుకూలంగా మారడం వల్ల ఈ రాశివారు పట్టిందల్లా బంగారం అవుతుంది. రావలసిన డబ్బు రావడంతో పాటు షేర్లు, స్పెక్యులే షన్లు, ఆర్థిక లావాదేవీలు, వడ్డీ వ్యాపారాలు లాభాల పంట పండిస్తాయి.  ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాల్లో కూడా విదేశీ సంబంధాలు కుదరవచ్చు. ఆస్తులు వృద్ధి చెందుతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి.

4 / 7
సింహం: రాశ్యధిపతి రవితో సహా నాలుగు గ్రహాలు భాగ్య, దశమ స్థానాల్లో ప్రవేశించడం వల్ల ఈ రాశివారికి రాజపూజ్యాలు కలుగుతాయి. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. వారసత్వపు ఆస్తి కలిసి వస్తుంది. అనేక వైపుల నుంచి సంపద పెరిగే అవకాశం ఉంది. సగటు వ్యక్తి సైతం సంపన్నుడయ్యే అవకాశం ఉంది. ఆర్థిక, వ్యక్తిగత, అనారోగ్య సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. ఉద్యోగంలో డిమాండ్ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి.

5 / 7
తుల: రాశ్యధిపతి శుక్రుడితో పాటు నాలుగు గ్రహాలు రాశులు మారడం వల్ల ఈ రాశివారికి రాజయోగాలు, ధన యోగాలు కలుగుతాయి. ఉద్యోగంలో హోదాతో పాటు జీతభత్యాలు పెరగడం, వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీతో పాటు రాబడి అంచనాల్ని మించడం జరుగుతుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలతో పాటు సహా అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. గృహ, వాహన యోగాలు కలుగుతాయి. శుభకార్యాలు జరుగుతాయి. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు.

6 / 7
మకరం: రవి, బుధ, కుజ, శుక్రుల రాశి మార్పు వల్ల ఈ రాశివారు అత్యధికంగా లాభం పొందే అవకాశం ఉంది. వీరికి ఉద్యోగపరంగానే కాక, సామాజికంగా కూడా రాజయోగాలు కలుగుతాయి. రాజ పూజ్యాలు పెరుగుతాయి. అనేక వైపుల నుంచి బ్యాంక్ బ్యాలెన్స్ వృద్ధి చెందుతుంది. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. ఉన్నత స్థాయి కుటుంబంతో మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.

7 / 7
కుంభం: ఈ రాశికి ఈ గ్రహాల రాశి మార్పు వల్ల జీవనశైలి పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. విలాస జీవితం అనుభవిస్తారు. నిరుద్యోగులకు భారీ జీతభత్యాలతో కూడిన ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగులకు అధికార యోగం పడుతుంది. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం లభిస్తుంది. కుటుంబ సమస్యలు పరిష్కారమై, సామరస్యం పెరుగుతుంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు.

Follow Us