March Horoscope: మార్చి నెలలో వారికి అంతా హ్యాపీ..! ఇందులో మీ రాశి ఉందా?

Edited By:

Updated on: Feb 25, 2026 | 7:13 PM

Happy Zodiac Signs: మార్చి 2న శుక్రుడు మీన రాశిలో ప్రవేశించి ఉచ్ఛపట్టడం, మార్చి 14న రవి మీన రాశిలో ప్రవేశించడం జరుగుతోంది. మార్చి 3న చంద్ర గ్రహణం ఏర్పడుతోంది. ఈ విధమైన మార్పుల వల్ల కొన్ని రాశుల వారి జీవితాల్లో కలలో కూడా ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, కుంభ రాశుల వారికి దాదాపు కొత్త జీవితం ప్రారంభమవుతుంది. ఆదాయం పెరగడం, ఉద్యోగంలో అందలాలు ఎక్కడం, ఆరోగ్యం మెరుగుపడడం, వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పట్టడం, కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోవడం వంటివి తప్పకుండా జరుగుతాయి.

1 / 6
వృషభం: రాశ్యధిపతి శుక్రుడు మార్చి 2న మీన రాశిలో ఉచ్ఛపడుతున్నందువల్ల వీరికి అప్పటి నుంచి జీవితంలో సానుకూల పరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతుంది. వీరి జీవితం గతం కంటే మరింత ఉన్నత స్థానానికి చేరుకోవడం జరుగుతుంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో మంచి జీతభత్యాలతో కూడిన పదోన్నతి లభిస్తుంది. విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న నిరుద్యోగుల కల సాకారం అవుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది.

2 / 6
మిథునం: ఈ రాశికి దశమ స్థానంలో శుక్ర, రవుల సంచారం, మార్చి 3న సంభవించబోయే చంద్ర గ్రహణం వల్ల ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితం అనేక విధాలుగా కొత్త పుంతలు తొక్కుతుంది. ఉద్యోగపరంగా స్థిరమైన, ప్రోత్సాహవంతమైన జీవితం ఏర్పడుతుంది. ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అనేక విధాలుగా ప్రాధాన్యం పెరుగుతుంది. నిరుద్యోగులకు ఆశించిన సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి.

3 / 6
కన్య: ఈ రాశికి సప్తమ స్థానం శుక్ర, రవులతో పటిష్ఠం అవుతున్నందువల్ల నెలంతా నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పట్టే అవకాశం ఉంది. ఉద్యోగంలో తప్ప కుండా హోదా, జీతభత్యాలు పెరగడం జరుగుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. ఉన్నతస్థాయి వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు పెరుగుతాయి.

4 / 6
తుల: ఈ రాశికి ఈ నెలలో షష్ట స్థానం బాగా పటిష్ఠమవుతున్నందువల్ల  ఉద్యోగంలో తప్పకుండా ఉన్నత పదవులు లభిస్తాయి. జీతభత్యాలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా వృద్ధి చెందుతుంది. ఆదాయ వృద్ధికి అవకాశాలు పెరుగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి.  పట్టిందల్లా బంగారం అవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ప్రయత్నపూర్వక లాభాలతో పాటు, అప్రయత్న ధన లాభం ఉంటుంది. పిత్రార్జితం కలిసి వస్తుంది. నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి.

5 / 6
మకరం: ఈ రాశికి అత్యంత శుభులైన శుక్ర, శనులు తృతీయంలో కలుస్తున్నందువల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగి, ఆర్థిక సమస్యలు తగ్గు ముఖం పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో తీరిక, విశ్రాంతి ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. రాబడి, లాభాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో హోదాతో పాటు బరువు బాధ్యతలు కూడా పెరుగుతాయి. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభించే అవకాశం ఉంది.

6 / 6
కుంభం: ఈ రాశికి ఈ నెలంతా ధన స్థానం పటిష్టం కాబోతున్నందువల్ల గ్రహణ ప్రభావం కూడా ఉండకపోవచ్చు. ఈ రాశివారికి ముఖ్యంగా ఆదాయానికి లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. గృహ, వాహన ప్రయత్నాలు ఫలిస్తాయి.

Follow Us