Lord Shiva Blessings: ఆ రాశుల వారికి శివానుగ్రహం..! ఆదాయం, అదృష్టం మీ సొంతం..

Edited By:

Updated on: Jan 21, 2026 | 5:05 PM

Moon Transit: ఈ నెల(జనవరి) 23వ తేదీ నుంచి ఫిబ్రవరి 2వరకు చంద్రుడు పూర్ణ బలంతో మీన రాశి నుంచి స్వక్షేత్ర మైన కర్కాటక రాశి వరకు సంచారం చేయడం జరుగుతోంది. ఈ పన్నెండు రోజుల కాలంలో రెండుసార్లు గజకేసరి యోగం ఏర్పడడంతో పాటు ఒకసారి చంద్రుడు ఉచ్ఛపట్టడం కూడా జరుగుతోంది. చంద్రుడు అనుకూలంగా ఉన్న రాశులకు శివానుగ్రహం ఎక్కువగా లభిస్తుందని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. చంద్రుడి అనుకూలత వల్ల ఏ ప్రయత్నమైనా సానుకూలపడడం, ఆరోగ్యం మెరుగుపడడం, శుభ వార్తలు ఎక్కువగా వినడం జరుగుతాయి. వృషభం, మిథునం, కర్కాటకం, తుల, మకరం, కుంభ రాశులకు చంద్రుడు అనుకూలంగా ఉన్నాడు.

1 / 6
వృషభం: ఈ రాశికి తృతీయాధిపతిగా చంద్రుడు బాగా అనుకూలంగా ఉంటున్నందు వల్ల ఏ ప్రయత్నమైనా తప్పకుండా విజయవంతం అవుతుంది. మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. పెండింగ్ వ్యవహారాలన్నీ పూర్తవుతాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను ఆత్మవిశ్వాసంతో చక్కబెడతారు. ఏ రకమైన వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నా శీఘ్ర పురోగతికి అవకాశం ఉంటుంది. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది.

2 / 6
మిథునం: ఈ రాశికి ధనాధిపతి అయిన చంద్రుడు దశమ స్థానం నుంచి ధన స్థానం వరకు బాగా అనుకూలంగా సంచారం చేయడం వల్ల ఉద్యోగ జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగానికి సంబంధించిన ఏ ప్రయత్నమైనా సఫలం అవుతుంది. ఏదో ఒక రూపంలో ఆదాయం తప్ప కుండా వృద్ధి చెందుతుంది. మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. కుటుంబ జీవితం ఉత్సాహంగా గడిచిపోతుంది.

3 / 6
కర్కాటకం: రాశ్యధిపతి చంద్రుడు భాగ్య స్థానం నుంచి స్వక్షేత్రం వరకు బాగా యోగదాయకంగా ఉండడం వల్ల రాజయోగాలు, ధన యోగాలు ఎక్కువగా ఏర్పడతాయి. ఇంట్లో శుభ కార్యాలకు ప్లాన్ చేస్తారు. విహార యాత్రలు ఎక్కువగా చేసే అవకాశం ఉంది. రాజపూజ్యాలు కలుగుతాయి. అనేక విధాలుగా ఆదాయం పెరిగి, ఆర్థిక, వ్యక్తిగత సమస్యలతో పాటు ఆరోగ్య సమస్య కూడా చాలావరకు పరిష్కారం అవుతుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. ఉద్యోగ లాభం కలిగే అవకాశం ఉంది.

4 / 6
తుల: దశమాధిపతి అయిన చంద్రుడి అనుకూల సంచారం వల్ల ఈ రాశివారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సరికొత్త అవకాశాలు అందుతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. అవివాహితులకు ఇష్టపడిన వ్యక్తితో పెళ్లి నిశ్చయం అవుతుంది. వైవాహిక జీవితంలో సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆస్తి వివాదాలు, కోర్టు సమస్యలు అనుకూలంగా పరిష్కారమై ఆస్తి లాభం, భూ లాభం వంటివి కలుగుతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది.

5 / 6
మకరం: ఈ రాశికి తృతీయ స్థానం నుంచి సప్తమ స్థానం వరకు చంద్రుడు అనుకూలంగా సంచారం చేయడం వల్ల కొద్ది ప్రయత్నంతో అత్యధికంగా లాభాలు కలుగుతాయి. ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తితో అప్రయత్నంగా మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వివాహం జరగడానికి కూడా అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా ఇతర దేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. సంతానం లేనివారికి సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. అనారోగ్యాల నుంచి కోలుకోవడం జరుగుతుంది.

6 / 6
కుంభం: ఈ రాశికి ధన స్థానం నుంచి ఆరవ స్థానం వరకు చంద్రుడి సంచారం వల్ల ఈ రాశివారు కొన్ని ముఖ్యమైన ఒత్తిళ్లు, సమస్యల నుంచి పూర్తిగా బయటపడే అవకాశం కలుగుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెంది ఆర్థిక సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. కోర్టు కేసుల నుంచి బయటపడ తారు. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. తల్లితండ్రుల నుంచి ఆస్తి కలిసి వస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాబడి బాగా వృద్ధి చెందుతుంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి.