Lucky Zodiacs: ఆగస్టు నెలంతా వీరికి అదృష్ట దేవత వరాలు! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?

Edited By:

Updated on: Aug 03, 2026 | 3:16 PM

August 2026 Lucky Zodiac Signs: జ్యోతిష శాస్త్రం ప్రకారం జాతకంలో 9వ స్థానం (భాగ్య స్థానం) బలంగా ఉంటే అదృష్టం కలిసి వచ్చి జీవితంలో విజయాలు, అవకాశాలు, ఆర్థిక పురోగతి కలుగుతాయని భావిస్తారు. ప్రస్తుత గ్రహ సంచారం ప్రభావంతో మేషం, వృషభం, కర్కాటకం, సింహం, తుల, మకర రాశుల వారికి వచ్చే నెల రోజుల పాటు భాగ్య యోగం బలపడే అవకాశం ఉందని జ్యోతిష్యులు పేర్కొంటున్నారు.

1 / 7
జ్యోతిష శాస్త్రం ప్రకారం 9వ స్థానాధిపతిని భాగ్య స్థానాధిపతిగా, అదృష్ట స్థానాధిపతిగా పరిగణించడం జరుగుతుంది. జాతక చక్రంలో ఈ స్థానాధిపతి బలంగా ఉంటే ఇక ఆ జాతకుడికి జీవితం విజయాలు, సాఫల్యాలతో సాగిపోతుంది. జాతకంలో ఎన్ని దోషాలున్నా, ఎన్ని లోపాలున్నా కొట్టుకుపోతాయి. జాతకంలో లేదా గ్రహచారంలో 9వ స్థానం, 9వ స్థానాధిపతి చాలా ముఖ్యం. భాగ్య స్థానాధిపతి బలంగా, అనుకూలంగా ఉన్న పక్షంలో జాతకంలో ఎటువంటి దోషాలున్నా కొట్టుకుపోతాయి. ప్రస్తుత గ్రహ సంచారం ప్రకారం మేషం, వృషభం, కర్కాటకం, సింహం, తుల, మకర రాశుల వారికి మరో నెల రోజుల పాటు భాగ్య స్థానం బాగా బలంగా ఉండబోతోంది.

2 / 7
మేషం: ఈ రాశికి భాగ్యాధిపతి అయిన గురువు ప్రస్తుతం చతుర్థ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉండి దశమ స్థానాన్ని వీక్షిస్తున్నందువల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అక్టోబర్ చివరి వరకు ఒక వెలుగు వెలిగే అవకాశం ఉంది. అనేక విధాలుగా సంపద పెరిగే అవకాశం ఉంది. జీవితంలో పురోగతికి, ఆదాయ వృద్ధికి అవకాశాలు లభిస్తాయి. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. ఏ ప్రయత్నమైనా విజయవంతం అవుతుంది. ఆదాయం అంచనాల్ని మించుతుంది.

3 / 7
వృషభం: ఈ రాశికి భాగ్య స్థానాధిపతి అయిన శనీశ్వరుడు లాభ స్థానంలో సంచారం చేయడం వల్ల అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులు లభిస్తాయి. జీత భత్యాలు బాగా పెరుగుతాయి. ఆరోగ్య భాగ్యం కలుగుతుంది. విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. తండ్రి నుంచి వారసత్వ సంపద లభిస్తుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. ప్రతి ప్రయత్నమూ సఫలమవుతుంది. ఆస్తి వివాదాలు బాగా అనుకూలంగా పరిష్కారమవుతాయి.

4 / 7
కర్కాటకం: ఈ రాశికి భాగ్యాధిపతి అయిన గురువు ఇదే రాశిలో ఉచ్ఛ స్థానంలో సంచారంచేస్తున్నందు వల్ల ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం కూడా కలుగుతుంది. పిత్రార్జితం లభిస్తుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు బాగా అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆకస్మిక ధనప్రాప్తికి అవకాశం ఉంది. తీర్థయాత్రలు ఎక్కువగా చేస్తారు. ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. రాజపూజ్యాలు కలుగుతాయి.

5 / 7
సింహం: ఈ రాశికి భాగ్య స్థానాధిపతి అయిన కుజుడు లాభ స్థానంలో సెప్టెంబర్ రెండవ వారం వరకు సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారికి అనేక విధాలుగా అదృష్టాలు కలుగుతాయి. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. మనసులోని కోరికలు, ఆశలు, ఆకాంక్షలు చాలావరకు నెరవేరడం జరుగుతుంది. ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకుంటారు. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగుతాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. పిత్రార్జితం లభిస్తుంది.

6 / 7
తుల: ఈ రాశికి భాగ్యాధిపతి అయిన బుధ గ్రహం దశమ స్థానంలో, ఉచ్ఛ గురువుతో కలిసి సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారికి మరో నెల రోజుల పాటు ఆడింది ఆటగా పాడింది పాటగా సాగిపో తుంది. ఉద్యోగంలో అధికారయోగం పడుతుంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారే అవకాశం ఉంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. అనేక వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. వృత్తి,  వ్యాపారాల్లో జోరు పెరుగుతుంది.

7 / 7
మకరం: ఈ రాశికి భాగ్య స్థానాధిపతి అయిన బుధుడు సప్తమ స్థానంలో ఉచ్ఛస్థితిలో ఉన్న గురువుతో యుతి చెందడం వల్ల ఊహించని శుభ ఫలితాలు కలుగుతాయి. పట్టిందల్లా బంగారమవుతుంది. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు మటుమాయం అవుతాయి. వృత్తి, ఉద్యోగాలు ఆశించిన దానికంటే ఎక్కువగా ఆదాయాన్నిచ్చేకాశం ఉంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లే అరుదైన అవకాశం కలుగుతుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us