Ketu Transit: శుభ గ్రహంగా కేతువు.. ఆ రాశుల వారికి ధన యోగాలు ఖాయం..!

Edited By:

Updated on: Feb 04, 2026 | 3:59 PM

జ్యోతిష శాస్త్రంలో వక్ర గ్రహంగా, పాప గ్రహంగా పేరున్న కేతు గ్రహం ప్రస్తుతం సింహ రాశిలో సంచారం చేస్తోంది. ఫిబ్రవరి 4 నుంచి రెండు నెలల పాటు బుధుడు, 6వ తేదీ నుంచి నెలాఖరు వరకు శుక్రుడు, 13 నుంచి రవి, 23 నుంచి కుజుడు ఈ కేతువును వీక్షించడం వల్ల ఈ కేతువు శుభ గ్రహంగా మారి శుభ ఫలితాలనిచ్చే అవకాశం ఉంది. కేతువు ద్వారా కొన్ని రాశుల వారికి యాక్టివిటీ పెరుగుతుంది. ఆకస్మిక పరిణామాలకు కారకుడైన కేతువు శుభ యోగాలనివ్వడంతో పాటు, ఒకటి రెండు ధన యోగాలనిచ్చే అవకాశం కూడా ఉంది. మేషం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, కుంభ రాశుల వారు ఈ కేతు సంచారం వల్ల అత్యధికంగా లాభాలు పొందడం జరుగుతుంది.

1 / 6
మేషం: ఈ రాశివారికి పంచమ స్థానంలో సంచరించడం వల్ల కేతువు పదోన్నతులు, ఆదాయ వృద్ధి, శుభ కార్యాలు వంటివి కల్పించే అవకాశం ఉంది. సంతాన యోగానికి కూడా అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలను చాలావరకు తగ్గించడం జరుగుతుంది. పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. ఉద్యోగంలో సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు కొద్ది మార్పులతో లాభాలనిస్తాయి. అనారోగ్యాల నుంచి విముక్తి లభిస్తుంది.

2 / 6
మిథునం: ఈ రాశివారికి తృతీయ స్థానంలో కేతువు సంచారం వల్ల అనేక విధాలుగా శీఘ్ర పురోగతి సాధ్యమవుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం బాగా వృద్ది చెందుతుంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి కూడా అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఇతర ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా ఆటంకాలు లేకుండా నెరవేరుతుంది. ఆస్తిపాస్తుల వివాదాలు అనుకూలంగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది.

3 / 6
సింహం: ఈ రాశిలో కేతువు సంచారం వల్ల ఈ రాశివారు వృత్తి, ఉద్యోగాల్లో ఒక వెలుగు వెలుగుతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. అనుకోని మార్గాలలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభానికి, లాటరీలు, జూదాలు, షేర్ల ద్వారా డబ్బు సంపాదించడానికి కూడా అవకాశం ఉంది. వారసత్వ సంపద లభిస్తుంది. రావలసిన సొమ్ము, బాకీలు వసూలవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో జీతభత్యాలు వృద్ధి చెందుతాయి. వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించే అవకాశం ఉంది.

4 / 6
తుల: ఈ రాశికి లాభ స్థానంలో కేతు సంచారం వల్ల ధన యోగాలు ఎక్కువగా కలుగుతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు కూడా బాగా లాభిస్తాయి. ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా పరిష్కారమై విలువైన ఆస్తి లభిస్తుంది. విదేశీ సంపాదనను అనుభవించే యోగం కూడా కలుగుతుంది. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. అనుకోకుండా పిత్రార్జితం లభిస్తుంది.

5 / 6
ధనుస్సు: ఈ రాశికి భాగ్య స్థానంలో సంచరిస్తున్న కేతువు వల్ల ఒకటికి రెండు సార్లు ధన యోగాలు పట్టే అవకాశం ఉంది. విదేశీ సంపాదన యోగం కూడా కలుగుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. పిత్రార్జితం లభిస్తుంది. అనుకోకుండా ఆస్తి లాభం, భూ లాభం కలుగుతాయి. భారీగా వస్త్రాభరణాలు కొనుగోలు చేయడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం అంచనాలను మించుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి.

6 / 6
కుంభం: ఈ రాశికి సప్తమ స్థానంలో సంచారం చేస్తున్న కేతువు మీద నాలుగు గ్రహాల దృష్టి పడుతున్నందు వల్ల వల్ల అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. లాటరీలు, జూదాలు, షేర్లు, స్పెక్యులేషన్ల వంటి వాటివల్ల ఇబ్బడిముబ్బడిగా లాభాలు కలుగుతాయి. ఆర్థిక సమస్యల నుంచి దాదాపు పూర్తిగా విముక్తి లభిస్తుంది. రావలసిన సొమ్ముతో పాటు బాకీలు, బకాయిలు కూడా వసూలవుతాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి కుదరడం జరుగుతుంది.