కార్తీక పౌర్ణమి ఎప్పుడు? దాని గురించి తెలుసుకుందాం!

Updated on: Oct 24, 2026 | 10:19 AM

కార్తీక పౌర్ణమి వచ్చేస్తోంది. అన్ని ప్రత్యేకతల్లోకి వెళ్లా కార్తీక పౌర్ణమికి చాలా ప్రాముఖ్యత, ప్రత్యేకత ఉంటుంది. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ శివుడిని ఆరాధిస్తుంటారు. నిత్యం శివ నామస్మరణ చేస్తుంటారు. దీపావళి అమావాస్య నుంచి కార్తీక మాసం ప్రారంభం అవుతుంది. కాగా, ఇప్పుడు 2026లో కార్తీక పౌర్ణమి ఎప్పుడు, పూజ విధానం గురించి తెలుసుకుందాం.

1 / 5
దీపావళి పండుగ, కార్తీక పౌర్ణమి వచ్చేస్తోంది. అన్ని మాసాల్లో కెళ్లా కార్తీక మాసం చాలా పవిత్రమైన మాసం అంటారు. ఈ సంవత్సరం నవంబర్ 7 తేదీన అమావాస్య తిథి ప్రారంభం అయ్యి, నవంబర్ 8 వరకు ఉంటుంది. పాడ్యమి తిథి నవంబర్ 10న రావడంతో ఈ రోజు నుంచే కార్తీక మాసం ప్రారంభం అవుతుంది.

2 / 5
ఇక ఈ మాసంలో శివ పూజకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా చాలా మంది కార్తీక పౌర్ణమి రోజు శివాలయాలను దర్శించడం, ఉసిరి చెట్టు కింద దీపారాధన చేయడం చేస్తుంటారు.  అంతే కాకుండా చాలా మంది ఈ రోజు నది స్నానం చేయడం ఇష్టదైవాన్ని ప్రార్థించడం, శివాలయానికి వెళ్లి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేయడం చేస్తుంటారు. ఈరోజు ఇంటి వద్ద దీపాలను వెలిగించి, ఇంటిని అందంగా అలంకరించి, శివుడిని ఆరాధిస్తూ ఉపవాసం ఉంటారు.

3 / 5
2026 సంవత్సరంలో కార్తీక పౌర్ణమి నవంబర్ 24, మంగళ వారం వస్తుంది. దీనిని కార్తీక శుక్ల పూర్ణిమ అని కూడా అంటారు.  ఈ పవిత్రమైన రోజున చంద్రుడిని పూజించడం, శివుడిని ఆరాధించడం వలన సకల శుభాలు కలుగుతాయని చెబుతుంటారు పండితులు. ముఖ్యంగా ఈరోజున చంద్రుడికి అర్ఘ్యం సమర్పించడం చాలా పుణ్యాన్ని ప్రసాదిస్తుంది.

4 / 5
ఈ పౌర్ణమి రోజు దాన ధర్మాలు చేయడం వలన కూడా అద్భుతంగా కలిసి వస్తుంది.  ఈ రోజున నది స్నానం చేయడం, దీపారాధన చేయడం, పూజలు చేయడం వలన పాపాలు అన్నీ తొలిగిపోతాయి. అంతే కాకుండా ఈ రోజు చాలా మంది వ్రతాలు చేసుకుంటారు. దీని వలన కూడా అద్భుతంగా కలిసి వస్తుంది. ఈరోజు విష్ణు మూర్తిని, చంద్రుడిని, శివుడిని పూజించడం వలన వారి నుంచి అనుగ్రహం కలుగుతుంది. వ్యాపార పరంగా ఆర్థకపరంగా కలిసి వస్తుంది.

5 / 5
మరీ ముఖ్యంగా పౌర్ణమి రోజు సత్యనారాయణ వ్రతం చేయడం చాలా శ్రేష్టమైనది. ఈరోజున వ్రతం ఆచరించడం వలన అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. కేవలం వ్రతం ఆచరించడమే కాకుండా, కథ వినడం వలన కూడా విశేషమై ఫలితాలు కలుగుతాయంట. నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

Loading...
Unable to load recommendations.
Follow Us