Bhagya Yoga: శుక్రుడి మీద గురువు దృష్టి.. ఈ రాశుల వారికి ఇక ఈజీ మనీ!

Edited By:

Updated on: Feb 03, 2026 | 4:47 PM

ఈ నెల(ఫిబ్రవరి) 6 నుంచి మార్చి 1 వరకు కుంభ రాశిలో సంచారం చేయబోతున్న శుక్రుడి మీద గురువు దృష్టి పడుతున్నందు వల్ల కొన్ని రాశుల వారికి అతి తక్కువ ప్రయత్నంతో అత్యధికంగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు పరిష్కారమవుతాయి. పెండింగులో ఉన్న శుభకార్యాలు పూర్తవుతాయి. గురు, శుక్రులు పోటీపోటీగా ధన వృద్ధి, కార్య సిద్ధి కలిగించే అవకాశం ఉంది. మేషం, వృషభం, మిథునం, తుల, మకరం, కుంభ రాశులవారు బాగా లబ్ది పొందుతారు. శుక్రుడి మీద గురువుల దృష్టి పడడం భాగ్య యోగానికి దారి తీస్తుంది.

1 / 6
మేషం: ఈ రాశికి లాభ స్థానంలో ఉన్న శుక్రుడిని గురువు వీక్షించడం వల్ల సిరి సంపదలు బాగా వృద్ధి చెందుతాయి. కుటుంబంలో శుభ కార్యాలు జరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులు, ఆదాయ వృద్ధి వంటి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. సంతాన యోగానికి అవకాశం ఉంది. పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. ఆస్తులు సమకూర్చుకోవడం, ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారం కావడం వంటివి జరుగుతాయి. వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి.

2 / 6
వృషభం: ఈ రాశికి దశమ స్థానంలో ఉన్న రాశ్యధిపతి శుక్రుడిని ధన స్థానం నుంచి గురువు చూడడం వల్ల ఈ రాశివారికి వృత్తి, ఉద్యోగాల్లో కీలకమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడడంతో పాటు విశేషంగా ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. అనారోగ్యాల నుంచి బాగా ఉపశమనం లభించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ  బాగా పెరుగుతుంది. నిరుద్యోగులకు ఊహించని అవకాశాలు అందుతాయి. ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది.

3 / 6
మిథునం: ఈ రాశికి భాగ్య స్థానంలో ఉన్న శుక్రుడి మీద గురువు దృష్టి వల్ల ధన ధాన్య సమృద్ధి యోగం కలుగుతుంది. అసలు ఆదాయంతో పాటు అదనపు ఆదాయం కూడా బాగా వృద్ధి చెందుతుంది. కుటుంబంలో శుభ కార్యాలు జరగడానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతి, వేతనాల పెరుగుదల వంటి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. కొన్ని వ్యక్తిగత సమస్యలు తగ్గిపోతాయి.

4 / 6
తుల: పంచమ స్థానంలో ఉన్న రాశ్యధిపతి శుక్రుడి మీద గురువు దృష్టి పడడం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో శీఘ్ర పురోగతికి అవకాశం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల దిశగా దూసుకుపోతాయి. షేర్లు, ఆర్థిక లావాదేవీలు, వడ్డీ వ్యాపారాలు, స్పెక్యులేషన్లు దాదాపు కనక వర్షం కురిపిస్తాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం గానీ, పెళ్లి నిశ్చయం కావడం గానీ జరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి.

5 / 6
మకరం: ఈ రాశికి ధన స్థానంలో ఉన్న శుక్రుడిని గురువు వీక్షించడం వల్ల అతి తక్కువ ప్రయత్నంతో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. అనేక ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగాలు లభిస్తాయి. ఆస్తులు కలిసి వస్తాయి. ఆస్తుల విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో స్థిరత్వం లభించడంతో పాటు వేతనాలు బాగా వృద్ధి చెందుతాయి. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు బాగా తగ్గిపోతాయి.

6 / 6
కుంభం: ఈ రాశిలో ఉన్న శుక్రుడిని గురువు వీక్షించడం వల్ల రాజపూజ్యాలు కలుగుతాయి. రాజ యోగాలు, ధన యోగాలు పడతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కీలకమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. గృహ, వాహన ప్రయత్నాలు సఫలం అవుతాయి. శత్రు, రోగ, రుణ బాధల నుంచి చాలావరకు విముక్తి కలుగుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆశించిన శుభవార్త వింటారు.