ఏది పట్టుకున్నా బంగారమే.. గురు బలంతో వారికి తిరుగే ఉండదు..!

Edited By:

Updated on: Mar 02, 2026 | 7:50 PM

ప్రస్తుతం మిథున రాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్న గురువు మార్చి 11న వక్ర త్యాగం చేసి, రుజు మార్గంలో సంచారం ప్రారంభించడం జరుగుతుంది. ఇది జూన్ 3 వరకు కొనసాగుతుంది. దీనివల్ల వంద రోజుల పాటు గురువు బలం రెట్టింపవుతుంది. సహజ శుభ గ్రహమైన గురువు వక్ర త్యాగం చేసిన దగ్గర నుంచి మరింత స్వతంత్రగా, ఎక్కువగా శుభ ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. వృషభం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, కుంభ రాశుల వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏ చిన్న ప్రయత్నం చేపట్టినా అత్యద్భుత విజయాలు సాధిస్తారు.

1 / 6
వృషభం: ఈ రాశికి ధన స్థానంలో సంచారం చేస్తున్న గురువు ఈ రాశివారికి మార్చి 11 నుంచి జూన్ 3 వరకు కలలో కూడా ఊహించనంత ఎక్కువగా ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆదాయ వృద్ధి పరంగా ఎటు వంటి చిన్న ప్రయత్నం తలపెట్టినా అత్యధిక లాభం కలుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో అరుదైన ఆఫర్లు అందుతాయి. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. వారసత్వంగా ఆస్తిపాస్తులు లభిస్తాయి. విదేశీ సంపాదన అనుభవించే యోగం పడుతుంది.

2 / 6
మిథునం: ఈ రాశిలో సంచారం చేస్తున్న గురువు వక్ర త్యాగం చేయడం వల్ల ఈ రాశివారి జీవితం వైభవంగా సాగిపోతుంది. రాజపూజ్యాలు కలుగుతాయి. మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. సొంత ఇల్లు అమరుతుంది. అనేక విధాలుగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. పిత్రార్జితం లభిస్తుంది. విదేశీ సంపాదనకు అవకాశం ఉంది. ఉద్యోగంలో భారీ జీతాలతో పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని మించుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, కనక వర్షం కురిపిస్తాయి.

3 / 6
సింహం: ఈ రాశికి లాభ స్థానంలో ఉన్న గురువు రుజు మార్గం పట్టడం వల్ల ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ది చెందడం, శుభ కార్యాలు జరగడం వంటివి చోటు చేసుకుంటాయి. కొద్ది ప్రయత్నంతో ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమై, విలువైన ఆస్తి లభించే అవకాశం ఉంది. సొంత ఇంటి కల నెరవేరుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాల్లో తగిన స్పందన లభిస్తుంది. వారసత్వ సంపద లభిస్తుంది.

4 / 6
తుల: ఈ రాశికి భాగ్య స్థానంలో సంచారం చేస్తున్న గురువు ఉద్యోగులు, నిరుద్యోగుల విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. రాజపూజ్యాలు కలుగుతాయి. పిత్రార్జితం లభిస్తుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి నిశ్చయమయ్యే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో కూడా విజయాలు సాధిస్తారు. వైవాహిక జీవితంలో ఎటువంటి సమస్యలున్నా తొలగిపోతాయి. అనేక విధాలుగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతుంది.

5 / 6
ధనుస్సు: ఈ రాశికి అధిపతి అయిన గురువు సప్తమ స్థానంలో సంచారం వల్ల ఏ చిన్న ప్రయత్నం తలపెట్టినా సకాలంలో, సంతృప్తికరంగా నెరవేరుతుంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల్లో విజయాలు సాధిస్తారు. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. మనసులోని ముఖ్య మైన కోరికలు నెరవేరుతాయి. బ్యాంక్ బ్యాలెన్స్ వృద్ధి చెందుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. మంచి పరిచయాలు కలుగుతాయి.

6 / 6
కుంభం: ఈ రాశికి పంచమ స్థానంలో ఉన్న గురువు వక్ర త్యాగం చేసి రుజు మార్గంలో సంచారం ప్రారంభించిన దగ్గర నుంచి ఈ రాశివారు ఆశయాలు, లక్ష్యాలు నెరవేరడం మొదలవుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. సంతాన యోగం కలుగుతుంది. ఏ చిన్న ప్రయత్నం తలపెట్టినా రెట్టింపు ఫలితాలనిస్తుంది. ఆదాయ ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల్లో విజయాలు సాధిస్తారు. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి.

Follow Us